ఆరు నెలల గరిష్టం

జనవరి 13 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 572 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది ఆగస్టు నుంచి చూస్తే ఇదే అత్యధికం కావడం గమనార్హం. జనవరి 6 నాటికి 561 బిలియన్‌ డాలర్లు ఉండగా.. తాజాగా 11 బిలియన్లు పెరిగాయని సెంట్రల్ బ్యాంకు శుక్రవారం తెలిపింది. 2021 అక్టోబరు నాటికి ఫారెక్స్ రిజర్వ్ లు 645 బిలియన్ డాలర్లతో అత్యంత గరిష్ట స్థాయికి చేరగా.. 2022 అక్టోబరులో 524 బిలియన్ డాలర్లతో రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. తాజాగా కొత్త ఏడాదిలో కొంతమేర పెరుగుదల కనిపించినట్లు తెలుస్తోంది.

రూపాయి బలపడుతోంది

రూపాయి బలపడుతోంది

ఆర్థిక అనిశ్చితి, డాలర్‌ తో రూపాయి మారకపు విలువను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ స్పాట్ మరియు ఫార్వర్డ్ మార్కెట్లలో అప్పుడప్పుడు జోక్యం చేసుకుంటూ ఉంటుంది. అందువల్ల గతేడాది నుంచి ఫారెక్స్ నిల్వలు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. జనవరి 13 వారాంతానికి రూపాయి సైతం అత్యుత్తమంగా ట్రేడ్ అవుతుండటమూ ఓ శుభపరిణామం. ప్రస్తుతం వారంలో కొంత నెమ్మదించినా, లాభాల్లోనే ప్రయాణిస్తోంది.

మూడు వారాల తర్వాత పరిస్థితేంటి ?

మూడు వారాల తర్వాత పరిస్థితేంటి ?

భారత్ ఫారెక్స్ నిల్వలు పెరుగుతుండగా.. పొరుగు దేశం పాకిస్థాన్ పరిస్థితి మాత్రం అంతకంతకూ దిగజారుతూ వస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ వద్ద కేవలం 4.343 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. వీటితో కేవలం మూడు వారాలపాటు దిగుమతులకు మాత్రమే చెల్లింపులు చేయగలదు.

తాజాగా 1 బిలియన్ డాలర్లను UAE బ్యాంకులకు చెల్లింపులు చేయడంతో 5 నుంచి 4 బిలియన్లకు పడిపోయినట్లు తెలుస్తోంది. ఆహార ద్రవ్యోల్బణం సైతం గతేడాది జనవరితో పోలిస్తే 31 శాతం పెరిగి తీవ్ర ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు అర్థమవుతోంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *