ISRO Video: జాబిల్లిపై సల్ఫర్‌‌ను గుర్తించిన రోవర్‌ పరికరం.. ఉపయోగాలివే..

[ad_1]

చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 పరిశోధనలు కొనసాగుతున్నాయి. తాజాగా, జాబిల్లి దక్షిణ ధ్రువంపై సల్ఫర్ ఉన్నట్టు ప్రజ్ఞాన్ రోవర్‌‌లోని మరో పరికరం ధ్రువీకరించింది. రోవర్‌కు అమర్చిన అల్ఫా ప్రాక్టికల్ ఎక్స్-రే సెక్ట్రోస్కోప్ (APXS) సల్ఫర్‌తో పాటు ఇతర ఖనిజ మూలకాలను గుర్తించినట్టు ఇస్రో వెల్లడించింది. ఆ ప్రాంతంలోని సల్ఫర్ (S) మూలాల కోసం శాస్త్రవేత్తల అన్వేషణకు ఈ సమాచారం కీలకమైందని పేర్కొంటూ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో 18 సెం.మీ పొడవున్న APXS..రోవర్ ఆటోమేటెడ్ మెకానిజాన్ని, డిటెక్టర్ హెడ్‌ను చంద్రుడి ఉపరితలానికి దాదాపు 5 సెం.మీ దగ్గర ఉండేలా చేస్తుంది. ఏపీఎక్స్‌ఎస్‌ను అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ ( PRL) సహకారంతో బెంగళూరులోని యూఆర్ రావు స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసింది.

‘చంద్రయాన్-3 దిగిన దక్షిణ ధ్రువంలో మట్టి, రాళ్లు దేనితో తయారయ్యాయి? ఇతర ఎత్తైన ప్రాంతాల నుంచి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? అనే వాటికి రోవర్‌లోని అమర్చిన శాస్త్రీయ పరికరాలు సమాధానాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.. ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS) చంద్రుడి మట్టి, రాళ్ల నమూనాలను పరిశీలనకు రోవర్ కింది భాగంలో అమర్చారు.
ఈ పరికరం చంద్రుని వంటి తక్కువ వాతావరణాన్ని కలిగి ఉన్న గ్రహాల ఉపరితలంపై భూమి, రాళ్ల మూలకాల కూర్పు విశ్లేషణకు బాగా సరిపోతుంది. ఇందులో ఉపరితల నమూనాపై ఆల్ఫా కణాలు, ఎక్స్-కిరణాలను విడుదల చేసే రేడియోధార్మిక మూలాలు ఉంటాయి. నమూనాలో ఉన్న అణువులు ప్రస్తుతం ఉన్న మూలకాలకు అనుగుణంగా ఎక్స్-రే లైన్లను విడుదల చేస్తాయి. ఈ X-కిరణాల శక్తులు, తీవ్రతలను కొలవడం ద్వారా ప్రస్తుతం ఉన్న మూలకాలను, వాటి సమృద్ధిని శాస్త్రవేత్తలు కనుగొనగలరు.

ఏపీఎక్సఎస్ (APXS) అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, ఐరన్ వంటి ప్రధాన మూలకాలే కాకుండా సల్ఫర్‌తో సహా ఆసక్తికరమైన చిన్న మూలకాల ఉనికిని గుర్తించింది. రోవర్‌లోని LIBS పరికరం కూడా సల్ఫర్ ఉనికిని నిర్ధారించింది. ఈ డేటాపై వివరణాత్మక శాస్త్రీయ విశ్లేషణ కొనసాగుతోంది అని’ ఇస్రో పేర్కొంది.

మానవ మనుగడపై ఆశలు

కాగా, భూమిపై విరివిగా లభించే అలోహమైన సల్ఫర్.. జీవ పదార్ధాలకు అత్యవసరమైన మూలకాల్లో ఒకటి. దీనిని కారు బ్యాటరీలు, ఎరువులు, చమురు శుద్ధి, నీటి ప్రాసెసింగ్, ఖనిజాల వెలికితీతకు విరివిగా ఉపయోగిస్తారు. రబ్బరు వల్కనీకరణ, బ్లీచింగ్ పేపర్, సిమెంట్, డిటర్జెంట్లు, పురుగుమందుల వంటి ఉత్పత్తుల తయారీలోనూ ఈ మూలకాన్ని వాడుతారు. అలాంటిది చంద్రుడిపై కూడా ఉండటం భవిష్యత్తులో అక్కడ మానవ మనుగడపై ఆశలు చిగురింపజేస్తోంది.


Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *