PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ITR-1 ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు ఫైల్‌ చేయకూడదు?

[ad_1]

Income Tax Return Filing 2024: ఆదాయ పన్ను విభాగం ITR-1 నుంచి ITR-4 వరకు ఉన్న ఫామ్స్‌ను వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్ల (Individual Taxpayers) కోసం నిర్దేశించింది. సంపాదన, ఆదాయ మూలాల ఆధారంగా, ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫారాన్ని (ITR Form) టాక్స్‌ పేయర్‌ ఎంచుకోవాలి. 

ITR-1 కింద రిటర్న్‌ ఫైల్ చేయడానికి.. జీతం తీసుకునే వ్యక్తులను (Salaried) & ఇండివిడ్యువల్‌ పర్సన్స్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్‌ అనుమతిస్తుంది. మిగిలిన ఫారాల కంటే ITR-1 చాలా సరళంగా ఉంటుంది. మిగిలిన ఫారాలతో పోలిస్తే, దీనిలో ఎక్కువ సమాచారం నింపాల్సిన అవసరం ఉండదు. 

అయితే, జీతం తీసుకునే వ్యక్తులందరికీ ITR-1 వర్తించదు. వాళ్ల ఆదాయ మూలాల ఆధారంగా ఇతర ఫారాలను కూడా ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి జరిపిన లావాదేవీల ఆధారంగా అతను ITR-1కి అర్హుడా/అనర్హుడా అన్నది నిర్ణయమవుతుంది.

ITR-1 ఎవరు ఫైల్‌ చేయాలి?

– భారతదేశ పౌరుడు
– ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షల లోపు వ్యక్తిగత ఆదాయం సంపాదించే వ్యక్తి
– జీతం, పెన్షన్, కుటుంబ పెన్షన్, ఇంటి ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం
– రూ. 5000కు మించని వ్యవసాయ ఆదాయం 
– పోస్టాఫీస్‌/కోఆపరేటివ్ సొసైటీ/బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ నుంచి వడ్డీ ఆదాయం
– సేవింగ్స్‌ ఖాతాల నుంచి వడ్డీ ఆదాయం 
– డివిడెండ్స్‌
– ఆదాయ పన్ను వాపసుపై వచ్చిన వడ్డీ, ఇతర రూపాల్లో వడ్డీ ఆదాయం తీసుకున్న వ్యక్తులు ITR-1 ఫారాన్ని పూరించవచ్చు.

ITR-1 ఎవరు ఫైల్ చేయలేరు?

– ప్రవాస భారతీయులు 
– ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.50 లక్షలకు మించినప్పుడు
– వ్యవసాయ ఆదాయం రూ.5000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు
– లాటరీ, గుర్రపు పందేలు, చట్టబద్ధమైన జూదం నుంచి ఆదాయం వచ్చినప్పుడు
– బంగారం, ఈక్విటీ షేర్లు వంటివాటిపై మూలధన లాభాలు (స్వల్పకాలిక  & దీర్ఘకాలిక లాభాలు) వచ్చినప్పుడు
– స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్ చేయని ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టినప్పుడు
– వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం ఉన్నప్పుడు
– ఒక కంపెనీలో డైరెక్టర్‌గా ఉంటే
– ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N కింద TDS ఉంటే
– ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తుల నుంచి ఆదాయం ఉంటే
– ITR-1 ఫైల్‌ చేయడానికి అర్హతలు లేనివాళ్లు
– హిందు అవిభక్త కుటుంబాలు (HUF)

పొరపాటున ITR-1 ఫైల్ చేస్తే ఏమవుతుంది?

సరైన ఫామ్‌ను ఎంచుకోకపోతే, ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. అనర్హుడైన వ్యక్తి పొరపాటున ఐటీఆర్-1 ఫైల్ చేస్తే, ఆదాయపు పన్ను విభాగం దానిని స్వీకరించదు, నోటీసు కూడా రావచ్చు. అప్పుడు, సరైన ఫారాన్ని ఎంచుకుని, రివైజ్డ్ ITRను ఫైల్‌ చేయాల్సి వస్తుంది. నోటీసు తేదీ నుంచి 15 రోజుల లోపు దీనిని దాఖలు చేయాలి. ఆ గడువు కూడా దాటితే ఆ వ్యక్తి నింపిన ITR చెల్లదు, రిటర్న్‌ దాఖలు చేయనట్లుగానే ఆదాయ పన్ను విభాగం భావిస్తుంది.

2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ITR సమర్పించడానికి చివరి తేదీ 31 జులై 2024. ఆ తర్వాత, పెనాల్టీ కట్టి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ఐటీ డిపార్ట్‌మెంట్‌ అనుమతి ఇస్తుంది.

మరో ఆసక్తికర కథనం: ఈ దేశాల్లో ఆదాయ పన్ను ‘సున్నా’, మీరు సంపాదించిందంతా మీదే

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *