PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ITR Filing: టాక్స్ ఫైలింగ్‌తో జరభద్రం.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్.. చిక్కుల్లో పడకండి

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Income
Tax
Frauds:
మోసాలు
చేసి
బతికే
వాళ్లకు
ప్రతి
దానిలోనూ
అవకాశాలు
కనిపిస్తూనే
ఉంటాయి.
పైగా
ప్రస్తుతం
డిజిటల్
యుగం
విసృతంగా
వ్యాప్తి
చెందిన
తరుణంలో
అన్ని
పనులు
ఉన్న
చోటు
నుంచే
పూర్తి
చేసుకోవటం
పెరిగింది.
సైబర్
నేరగాళ్లు
వీటిని
అదునుగా
తీసుకుని
కొత్త
మోసాలకు
పాల్పడుతున్నారు.

పాత
ఆర్థిక
సంవత్సరం
ముగిసిన
తరుణంలో
చాలా
మంది
తమ
టాక్స్
రిటర్న్స్
ఫైల్
చేసే
కంగారులో
ఉన్నారు.
ఇప్పటి
వరకు
క్రెడిట్
కార్డులు,
బ్యాంక్
ఖాతాలు,
ఆధార్
కేవైసీ
మోసాలకు
పాల్పడిన
సైబర్
కేటుగాళ్ల
వలలో
ఇప్పుడు
టాక్స్
పేయర్స్
చిక్కుకుంటున్నారు.
అలా
డబ్బు
పోగొట్టుకుంటున్న
ఘటనలు
తాజాగా
వెలుగులోకి
వస్తున్నాయి.

టాక్స్ ఫైలింగ్‌తో జరభద్రం.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కామ్

పన్నులు
చెల్లించే
వారి
వివరాలు
తెలుసుకుంటున్న
సైబర్
నేరగాళ్లు..
వారికి
ఫేక్
ఎస్ఎమ్ఎస్,
ఈ-మెయిల్స్
పంపుతున్నారు.
పాన్,
ఆధార్
వంటి
వివరాలను
వెంటనే
అప్
డేట్
చేయాలని
లేకుంటే
ఇబ్బందులు
ఎదుర్కోవలసి
ఉంటుందని
నమ్మబలుకుతున్నారు.
పొరపాటున
వారి
మాటలు
నమ్మి
వారు
పంపిన
మెసేజీల్లోని
లింక్స్
క్లిక్
చేస్తే..
ఒక
యాప్
మీ
స్మార్ట్
ఫోనులో
ఇన్‌స్టాల్
అవుతుంది.
అందులో
మీ
బ్యాంక్
వివరాలు,
పాన్,
ఆధార్
వంటి
కీలక
సమాచారానికి
సంబంధించి
వివరాలను
అడుగుతున్నారు.

పొరపాటున
వాటిని
నింపితే
ఇక
అంతే
సంగతులు.
విలువైన
మీ
పర్సనల్
సమాచారం
సైబర్
మోసగాళ్ల
చేతిలోకి
వెళ్లిపోతుంది.
అందువల్ల
వ్యక్తిగత
వివరాలు,
సున్నితమైన
బ్యాంకింగ్
సమాచారం,
పిన్
నంబర్లు
వంటి
వాటి
వివరాలను
మోసగాళ్లకు
అందకుండా
జాగ్రత్త
వహించాల్సి
ఉంటుంది.
ఇందుకోసం
ముందుగా
అనుమానాస్పత
లింక్స్,
మెసేజీలకు
దూరంగా
ఉండటం
చాలా
ముఖ్యం.

ఇలాంటి
పరిస్థితులు
ఎదురైనప్పుడు
అనుమానం
వస్తే
ముందుగా
మీ
బ్యాంకును
సంప్రదించటం
ఉత్తమం.
ఎందుకంటే
వారు
వినియోగదారులను
ఎప్పుడూ
కీలకమైన
వ్యక్తిగత
సమాచారాన్ని
అడగరు.
ఒకవేళ
మీకు
వచ్చిన
మెయిల్స్,
మెసేజీలు
ఫేక్
అని
తేలితే
వెంటనే
సైబర్
క్రైమ్
పోలీసులకు
తెలియజేయండి.
ఓటీపీలు,
సీవీర్
నెంబర్,
పాస్
వర్డ్స్,
లాగిన్
క్రెడెన్షియల్స్
ఎల్లప్పుడూ
సేఫ్‌గా
ఉండేలా
చూసుకోవటం
మిమ్మల్ని
సైబర్
నేరాల
నుంచి
కాపాడుతుందని
వినియోగదారులు
గుర్తుంచుకోవాలి.

English summary

Cyber fraudsters targeted ITR Filers with fake links, Know in detail Keep your data safe

Cyber fraudsters targeted ITR Filers with fake links, Know in detail Keep your data safe

Story first published: Wednesday, April 19, 2023, 11:52 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *