PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Jet Airways: వివాదంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్.. మెుండికేస్తున్న మాజీ ఉద్యోగులు..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Jet Airways: నష్టాల ఊబిలో కూరుకుని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు డబ్బు లేక దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ కుదేలైంది. జెట్ ఎయిర్‌వేస్ ఆస్తులను లిక్విడేషన్ చేయాలని కోరుతూ గత నెల చివర్లో నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ ను జెట్ ఎయిర్‌వేస్ క్యాబిన్ క్రూ అసోసియేషన్ (JACCA) ముంబై బెంచ్ ను ఆశ్రయించింది.

కంపెనీని లిక్విడేషన్ చేయాలని అసోసియేషన్ తన దరఖాస్తును దాఖలు చేసింది. ఎయిర్ లైన్ కు చెందిన సుమారు 700 మంది క్యాబిన్ క్రూ సభ్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. రిజల్యూషన్ ప్లాన్ ఆమోదించబడినప్పటికీ.. రూ.113 కోట్ల వేతన బకాయిలు తమకు ఇంకా అందలేదని అసోసియేషన్ ట్రిబ్యునల్ కు తెలిపింది.

Jet Airways: వివాదంలో చిక్కుకున్న జెట్ ఎయిర్‌వేస్.. మెుండికే

ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విమానయాన సంస్థ ఆస్తుల విలువ మరింతగా క్షీణిస్తుందని వారు ట్విబ్యునల్ కు తెలిపారు. కొత్త యజమానులు జలాన్-కల్రాక్ కన్సార్టియం (JKC), రుణదాతల మధ్య మాజీ ఉద్యోగుల పెన్షన్ ఫండ్‌లలోకి ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉందా అనే దానిపై వివాదం తలెత్తిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

మాజీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై NCLAT గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కొత్త యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ వివాదంలో డిసెంబర్ 12న మరిన్ని విషయాలపై విచారణ జరుగుతుందని NCLAT తెలిపింది. ఈ వివాదం తర్వాత కంపెనీ పునరుద్ధరణ జరిగి ముందుకు సాగుతుందా లేక లిక్విజేట్ చేయబడుతుందో తెలియాల్సి ఉంది.

English summary

Jet airways old employees filed for company liquidation amid going contraversies

Jet airways old employees filed for company liquidation amid going contraversies

Story first published: Thursday, December 8, 2022, 11:28 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *