News
lekhaka-Bhusarapu Pavani
రిలయన్స్
ఇండస్ట్రీస్
లిమిటెడ్
నియంత్రణలోని
Viacom18..
వార్నర్
బ్రదర్స్
డిస్కవరీతో
3
సంవత్సరాల
ఒప్పందంపై
సంతకం
చేసినట్లు
ప్రముఖ
వార్తా
సంస్థ
నివేదించింది.
తద్వారా
వచ్చే
నెల
నుంచి
ప్రసిద్ధ
HBO
ఒరిజినల్స్,
వార్నర్
బ్రదర్స్
కంటెంట్
ను
JioCinemaలో
ప్రసారం
చేయడానికి
అవకాశం
ఏర్పడుతుంది.
ఈ
డీల్
విలువ
దాదాపు
వెయ్యి
కోట్లుగా
నిర్ణయించినట్లు
తెలిసింది.
ప్రీమియం
ఇంగ్లీష్
కంటెంట్
వీక్షకులను
JioCinema
ఆకర్షించడానికి
ఇది
సహాయపడుతుంది.
సంస్థ
కథనం
ప్రకారం..
ఈ
ఒప్పందంలో
Viacom18
యొక్క
సాధారణ
టెలివిజన్
ఛానెల్‌ల
హక్కులు
కూడా
భాగమయ్యాయి.
తద్వారా
కొంత
కంటెంట్
ను
దాని
ఇంగ్లీష్
ఎంటర్‌టైన్‌మెంట్
ఛానెల్‌లలో
ప్రసారం
చేసుకునే
అవకాశమూ
ఉంది.
భారతదేశంలో
తన
స్ట్రీమింగ్
ప్లాట్
ఫారమ్
మ్యాక్స్
లాంచ్
ను
హోల్డ్
లో
ఉంచిన
వార్నర్
బ్రదర్స్
డిస్కవరీకి
ఈ
డీల్
మంచి
జాక్
పాట్
గా
చెప్పవచ్చు.

అయితే
ఈ
ఒప్పందంపై
వార్నర్
బ్రదర్స్
డిస్కవరీ,
Viacom18
స్పందించడానికి
నిరాకరించాయి.
మొదట
ఈ
డీల్
కోసం
150
మిలియన్
డాలర్ల
వద్ద
చర్చలు
జరగ్గా..
చివరకు
120కు
ఫైనల్
అయినట్లు
విశ్వసనీయ
సమాచారం.
ఇదే
సమయంలో
వాల్ట్
డిస్నీ
భారతీయ
యూనిట్
డిస్నీ
స్టార్,
HBO
ఒరిజినల్స్
కోసం
వార్నర్
బ్రదర్స్
డిస్కవరీతో
తన
దీర్ఘకాల
కంటెంట్
ఒప్పందాన్ని
మార్చి
31న
ముగించింది.
ఫలితంగా
ప్రముఖ
గేమ్
ఆఫ్
థ్రోన్స్,
హౌస్
ఆఫ్
డ్రాగన్
వంటి
144
షోలు
వీక్షించే
అవకాశం
ఉండదు.
వార్నర్
బ్రదర్స్
డిస్కవరీ
ఐదేళ్ల
డీల్
కోసం
సంవత్సరానికి
10
మిలియన్
డాలర్లు
అడుగుతున్నట్లు
వార్తా
సంస్థ
పేర్కొంది.
ప్రస్తుతం
లాభాల
కోసం
చూస్తున్న
డిస్నీ+
హాట్‌స్టార్
తగినంత
విలువైనదిగా
భావించలేదు.
Viacom18తో
ఒప్పందం
HBO
ఒరిజినల్స్‌కు
మాత్రమే
పరిమితం
కాకుండా
దానికి
చెందిన
టీవీ
లైబ్రరీతో
సహా
వార్నర్
బ్రదర్స్
టెలివిజన్
సిరీస్‌లోని
కంటెంట్
ను
కూడా
కలిగి
ఉంది.
మరో
విషయం
ఏంటంటే..
ఒప్పందంలో
భాగంగా,
USలో
ప్రసారమవుతున్న
కంటెంట్
అదే
రోజున
భారతదేశంలోనూ
ప్రదర్శితమవుతుంది.
ప్రస్తుతం
ఇండియన్
ప్రీమియర్
లీగ్
(IPL)ని
JioCinema
ఉచితంగా
ప్రసారం
చేస్తోంది.
కాగా
మొత్తం
ఇంగ్లీష్
కంటెంట్
ను
పేవాల్
వెనుక
ఉంచాలని
భావిస్తోంది.
“మేము
భారతీయులందరికీ
వినోదం
కోసం
ఒక
గమ్యస్థానాన్ని
నిర్మించాలనే
లక్ష్యంతో
ఉన్నాము.
వార్నర్
బ్రదర్స్
డిస్కవరీతో
ఉన్న
వ్యూహాత్మక
భాగస్వామ్యం
మా
వినియోగదారులకు
అత్యుత్తమ
హాలీవుడ్
కంటెంట్‌ను
అందించే
మా
ప్రయాణంలో
ఒక
పెద్ద
మైలురాయి.
ఈ
ఒప్పందం
మా
వినియోగదారులకు
ఉత్తమమైన,
అత్యంత
సమగ్రమైన
కంటెంట్
ను
సృష్టించడానికి
అనుమతిస్తుంది”
అని
Viacom18
ఇంటర్నేషనల్
బిజినెస్
హెడ్
ఫెర్జాద్
పాలియా
తెలిపారు.
English summary
Reliance backed Viacom18 signed deal for HBO content in India
Reliance backed Viacom18 signed deal for HBO content in India..
Story first published: Saturday, April 29, 2023, 8:14 [IST]