PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Mutual
Funds:

ప్రస్తుత
కాలంలో
దేశీయ
స్టాక్
మార్కెట్లలో
నేరుగా
ఈక్విటీల
కొనుగోలు
ద్వారా
పెట్టుబడులు
పెట్టే
వారి
సంఖ్య
తగ్గింది.
దీనికి
కారణం
చాలా
మంది
మ్యూచువల్
ఫండ్
పెట్టుబడుల
వైపు
మెుగ్గుచూపటమే.
అయితే
వీటి
నియంత్రణకు
సెబీ
అనేక
చర్యలు
చేపడుతూనే
ఉంటుంది.

మ్యూచువల్
ఫండ్
కంపెనీలు
చిన్న
మెుత్తాల్లో
పెట్టుబడిదారుల
నుంచి
డబ్బును
సమీకరించి
వాటిని
వివిధ
స్టాక్
లలో
ఇన్వెస్ట్
చేస్తుంటాయి.
ఏఏ
కంపెనీల్లో
పెట్టుబడి
పెట్టాలనే
నిర్ణయాన్ని
మాత్రం
ఫండ్
మేనేజర్లు
తీసుకుంటారు.
దీనికోసం
వారు
చేసే
ఖర్చులను
ఇన్వెస్టర్ల
నుంచే
వసూలు
చేస్తుంటారు.
దీనినే
ఫైనాన్స్
పరిభాషలో
వ్యయ
నిష్పత్తి(Expence
Ratio)
అని
పిలుస్తుంటారు.

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..?

ఒక్కో
ఫండ్
వివిధ
వ్యయ
నిష్పత్తిని
కలిగి
ఉంటుంది.
తక్కువ
ఎక్స్పెన్స్
రేషియో
ఉండే
ఫండ్
ఎంపిక
చేసుకోవటం
వల్ల
ఇన్వెస్టర్లకు
ఖర్చులు
తగ్గి
ఎక్కువ
రాబడి
లభిస్తుంది.
అయితే
క్యాపిటల్
మార్కెట్స్
రెగ్యులేటర్
సెబీ
పెట్టుబడిదారుల
నుంచి
ఫండ్
కంపెనీలు
వసూలు
చేసే
ఖర్చుల్లో
పారదర్శకతను
తీసుకురావడానికి
మ్యూచువల్
ఫండ్
పథకాల్లో
ఏకరీతి
మొత్తం
వ్యయ
నిష్పత్తిని(TER)
విధానాన్ని
ప్రతిపాదించింది.

ప్రస్తుతం
సెబీ
మ్యూచువల్
ఫండ్
సంస్థలు
ఇన్వెస్టర్లకు
పేర్కొన్న
TER
పరిమితుల
కంటే
నాలుగు
అదనపు
రకాల
ఖర్చులను
వసూలు
చేయడానికి
అసెట్
మేనేజ్‌మెంట్
కంపెనీలను
అనుమతిస్తుంది.
ఇవి
బ్రోకరేజ్,
లావాదేవీ
ఖర్చులు,
B-30
(టాప్
30
కంటే
ఎక్కువ)
నగరాల
నుంచి
వచ్చే
ఇన్‌ఫ్లోల
కోసం
డిస్ట్రిబ్యూషన్
కమీషన్
కోసం
అదనపు
TER,
సేవల
పన్నులు,
నిష్క్రమణ
లోడ్‌ల
కోసం
అదనపు
ఖర్చులు
ఉన్నాయి.
TER
అనేది
మ్యూచువల్
ఫండ్
హౌస్
అడ్మినిస్ట్రేటివ్,
మేనేజ్‌మెంట్‌తో
సహా
ఖర్చుల
కోసం
వసూలు
చేసే
స్కీమ్
కార్పస్
శాతం.

తాజాగా
సెబీ
తీసుకు
రావాలనుకుంటున్న
పరిమితుల
వల్ల
ఇన్వెస్టర్ల
నుంచి
మ్యూచువల్
ఫండ్
కంపెనీలు
నిర్ధేశించిన
పరిమితుల్లోనే
ఖర్చులను
వసూలు
చేయాల్సి
ఉంటుంది.
పరోక్షంగా
ఇది
పెట్టుబడిదారులకు
ఎక్కువ
ఆదాయాన్ని
అందించటానికి
దోహదపడుతుందని
మార్కెట్
నిపుణులు
అభిప్రాయపడుతున్నారు.
జూన్
1వ
తేదీ
వరకు
ప్రతిపాదనలపై
అభిప్రాయాలను
తెలియజేయాలని
సెక్యూరిటీస్
అండ్
ఎక్స్ఛేంజ్
బోర్డ్
ఆఫ్
ఇండియా
కోరింది.
దేశంలో
ప్రస్తుతం
42
మ్యూచువల్
ఫండ్
కంపెనీలు
దాదాపు
రూ.40
లక్షల
కోట్లకు
పైగా
ఆస్తులను
నిర్వహిస్తున్నాయి.

English summary

Market Regulator SEBI Proposes Uniform Total Expence Ratio to mutual funds yields good returns

Market Regulator SEBI Proposes Uniform Total Expence Ratio to mutual funds yields good returns

Story first published: Friday, May 19, 2023, 13:44 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *