News
oi-Mamidi Ayyappa
Notes
Ban:
దేశవ్యాప్తంగా
రూ.2000
నోట్ల
ఉపసంహరణపై
ఇప్పుడు
భారీగా
చర్చ
జరుగుతోంది.
పెద్ద
నోట్లు
వద్దంటూనే
గతంలో
మోదీ
సర్కారు
రూ.2000
నోట్లను
ప్రవేశపెట్టిన
సంగతి
తెలిసిందే.
కావాలని
తెచ్చి..
ఇప్పుడు
మళ్లీ
వాటిని
వద్దనుకోవటం
ఏంటని
అందరూ
అభిప్రాయపడుతున్నారు.
క్లీన్
నోట్
పాలసీ
కారణంగా
రూ.2000
నోటును
ఉపసంహరించుకోవాలని
నిర్ణయించినట్లు
ఆర్‌బీఐ
ప్రకటించింది.
అయితే
అది
ప్రధాన
కారణం
కాదని
చాలా
మంది
భావిస్తున్నారు.
కరెన్సీ
ఉపసంహరణ
వ్యవస్థలోని
మొత్తం
కరెన్సీలో
86
శాతంపై
ప్రభావం
చూపినందున
డీమోనిటైజేషన్
సమయంలో
అధిక
విలువ
కలిగిన
రూ.2,000
నోటును
జారీ
చేయడం
తప్పనిసరిగా
మారింది.
త్వరగా
ఆర్థిక
వ్యవస్థ
కుదుటపడేలా
చేసేందుకు
అప్పట్లో
ఈ
నోట్లు
ఎంతగానో
దోహదపడ్డాయని
తెలుస్తోంది.

అయితే
అధిక
విలువ
కలిగిన
రూ.2000
నోట్లను
నిల్వ
చేయటం,
మార్చటం
సులభం
కాబట్టి
బ్లాక్
మార్కెటర్లు
వీటిని
ఎక్కువగా
వినియోగిస్తున్నారు.
చాలా
కాలంగా
మార్కెట్లో
ఈ
నోట్లు
కనిపించటం
లేదు.
పైగా
అన్ని
బ్యాంకులు
తమ
ఏటీఎంలలో
రూ.2000
నోట్లను
రీకాలిబరేషన్
చేయడంతో
సరిపడా
రూ.2000
నోట్లు
రావడం
లేదని
ఫిర్యాదు
చేస్తున్నాయి.
పెద్ద
నోట్లను
మార్కెట్
నుంచి
తొలగించటానికి
ప్రధాన
కారణం
దొంగ
నోట్లను
అరికట్టడం.
అయితే
ప్రస్తుతం
రిజర్వు
బ్యాంక్
తీసుకున్న
నోట్ల
ఉపసంహరణ
నిర్ణయం
మినీ
డీమానిటైజేషన్
అని
చెప్పుకోవచ్చు.
పెద్ద
మొత్తంలో
కరెన్సీని
కలిగి
ఉన్నవారు
నోట్లను
డిపాజిట్
చేస్తున్నట్లయితే
లేదా
మార్పిడి
చేస్తున్నట్లయితే
దానికి
సంబంధించిన
మూలాన్ని
వారు
తప్పకుండా
వెల్లడించాల్సి
ఉంటుంది.
ఒకవేళ
నోట్లు
తిరిగి
బ్యాంకులకు
రాకపోతే
నిర్ణీత
గడువు
తర్వాత
అవి
విలువను
కోల్పోతాయి.
రిజర్వు
బ్యాంక్
వాటికి
ఎలాంటి
చెల్లింపు
చేయదు
కాబట్టి
RBIకి
లాభం
కూడా.
అయితే
దేశంలోని
రాజకీయ
పార్టీలు
మాత్రం
దీనిని
ఎన్నికల
అస్త్రంగా
భావిస్తున్నాయి.
బీజేపీ
కర్ణాటక
ఎన్నికల
ఓటమి
తర్వాత
ఈ
నిర్ణయం
రావటం
కొందరిలో
అనుమానాలు
కలిగిస్తోంది.
కొందరు
విశ్లేషకులు
మాత్రం
ఈ
రెండింటికీ
సంబంధం
లేదని
అంటున్నారు.
English summary
Why RBI banned 2000 denomination notes after BJP lost in Karnata elections, Know
Why RBI banned 2000 denomination notes after BJP lost in Karnata elections, Know
Story first published: Saturday, May 20, 2023, 11:56 [IST]