News
oi-Mamidi Ayyappa
Ratan
Tata:
భారత
ఖ్యాతిని
అంతర్జాతీయ
స్థాయికి
తీసుకెళ్లిన
వారిలో
రతన్
టాటా
కూడా
ఒకరని
మనందరికీ
తెలుసు.
వ్యాపార
సామ్రాజ్యంలో
ఎంత
పోటీ
ఉన్నప్పటికీ
శత్రువులు
లేని
ఏకైక
నాయకుడు
సర్
రతన్
టాటా.
దేశాభివృద్ధే
పరమావదిగా
వ్యాపారాలను
నిర్వహిస్తున్న
సంస్థ
టాటా
గ్రూప్.
ప్రఖ్యాత
పారిశ్రామికవేత్త,
టాటా
సన్స్
ఛైర్మన్
ఎమెరిటస్
రతన్
టాటాకు
ఆస్ట్రేలియా
అత్యున్నత
పౌర
పురస్కారం
ఆర్డర్
ఆఫ్
ఆస్ట్రేలియా
లభించింది.
భారత్‌లోని
ఆస్ట్రేలియన్
రాయబారి
బారీ
ఓ
ఫారెల్
దీనికి
సంబంధించిన
వివరాలను
ట్వీట్
ద్వారా
వెల్లడించారు.
వ్యాపార
దిగ్గజం,
దాతృత్వం
ఉన్న
నాయకుడని
ప్రశంసించారు.
టాటా
సహకారం
ఆస్ట్రేలియాలో
గణనీయమైన
ప్రభావాన్ని
చూపిందని
ఆయన
తెలిపారు.

ఆస్ట్రేలియా-భారత్
బంధంలో
రతన్
టాటా
సుదీర్ఘకాలంగా
చూపుతున్న
నిబద్ధతకు
గుర్తింపుగా
ఆర్డర్
ఆఫ్
ఆస్ట్రేలియా
ప్రదానం
చేయడం
ఆనందంగా
ఉందని
బారీ
ఓ’
ఫారెల్
ట్విట్టర్లో
వెల్లడించారు.
రెండు
దేశాల
మధ్య
ద్వైపాక్షిక
సంబంధాలకు..
ముఖ్యంగా
వాణిజ్యం,
పెట్టుబడులు,
దాతృత్వానికి
అందించిన
సేవలకు
ఆర్డర్
ఆఫ్
ఆస్ట్రేలియా
జనరల్
విభాగంలో
గౌరవ
అధికారిగా
రతన్
టాటా
నియమితులయ్యారు.

Ratan
Tata
is
a
titan
of
biz,
industry
&
philanthropy
not
just
in
🇮🇳,
but
his
contributions
have
also
made
a
significant
impact
in
🇦🇺.
Delighted
to
confer
Order
of
Australia
(AO)
honour
to
@RNTata2000
in
recognition
of
his
longstanding
commitment
to
the
🇦🇺🇮🇳relationship.
@ausgov
pic.twitter.com/N7e05sWzpV—
Barry
O’Farrell
AO
(@AusHCIndia)
April
22,
2023
రతన్
టాటాకు
దేశంలోనే
కాక
ప్రపంచవ్యాప్తంగా
గొప్ప
గుర్తింపు
దక్కటంపై
టాటా
పవర్
సదరన్
ఒడిషా
డిస్ట్రిబ్యూషన్
లిమిటెడ్
ఎగ్జిక్యూటివ్
రాహుల్
రంజన్
అభిప్రాయపడ్డారు.
అనేక
విజయవంతమైన
వెంచర్ల
వెనుక
రతన్
టాటా
చోదక
శక్తిగా
నిలిచారని
పేర్కొన్నారు.
భారత
టైకూన్
రతన్
టాటా
ఇలాంటి
అరుదైన
గౌరవాన్ని
పొందటంపై
నెటిజన్లు
హర్షం
వ్యక్తం
చేస్తున్నారు.

English summary
Indian business tycoon philanthropist ratan tata received australia’s highest honour Order of Australia
Indian business tycoon philanthropist ratan tata received australia’s highest honour Order of Australia
Story first published: Monday, April 24, 2023, 14:01 [IST]