PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

RBI గవర్నర్ శక్తికాంత దాస్‌పై నెటిజన్ల ప్రశంసలు.. శుభాకాంక్షలతో దద్దరిల్లిన ట్విట్టర్‌

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

రిజర్వు
బ్యాంకు
ఆఫ్
ఇండియా
గవర్నరు
శక్తికాంత
దాస్‌
పై
నెటిజన్లు
ప్రశంసల
వర్షం
కురిపిస్తున్నారు.
పలువురు
ఆయనకు
శుభాకాంక్షలు
చెబుతుండటంతో
ట్విట్టర్‌
దద్దరిల్లిపోతోంది.
ఇంతకూ
దీనికి
కారణం
ఏమిటంటే..
లండన్‌లో
జరిగిన
సెంట్రల్
బ్యాంకింగ్
అవార్డ్స్
2023లో
భాగంగా
‘గవర్నర్
ఆఫ్
ది
ఇయర్’గా
ఆయన
ఎంపిక
కావడమే.
ప్రతి
భారతీయుడూ
గర్వించదగిన
విషయం
కావడంతో
ప్రశంసలు
వెల్లువెత్తుతున్నాయి.

క్లిష్టమైన
సంస్కరణలను
RBI
గవర్నర్
సుస్థిరం
చేశారని
ఈవెంట్
నిర్వాహకులు
కొనియాడారు.
ప్రపంచంలోని
ప్రముఖ
చెల్లింపుల
ఆవిష్కరణలను
పర్యవేక్షించారని,
వాటిని
సమయానుగుణంగా
చక్కగా
రూపొందించి
దేశాన్ని
కష్ట
సమయాల్లో
ముందుండి
నడిపించారని
ప్రశంసించారు.
2018
నుంచి
ఇప్పటి
వరకు
పలు
ద్రవ్య
నిర్ణయాలను
అమలుచేసి,
దేశ
ఆర్థికాభివృద్ధిలో
కీలక
పాత్ర
పోషించారన్నారు.

RBI గవర్నర్ శక్తికాంత దాస్‌పై నెటిజన్ల ప్రశంసలు..

“ఒక
ప్రధాన
నాన్-బ్యాంకు
సంస్థ
పతనంతో
మొదలై,
కరోనావైరస్
మొదటి
మరియు
రెండవ
వేవ్స్
వల్ల
తీవ్రమైన
సవాళ్లతో
ప్రపంచ
ఆర్థిక
వ్యవస్థ
కుదేలైంది.
దాని
నుంచి
పూర్తిగా
కోలుకోకుండానే
2022లో
ఉక్రెయిన్‌పై
రష్యా
దాడితో
ద్రవ్యోల్బణం
ప్రభావం
ప్రపంచాన్ని
వణికిస్తోంది.
ఇటువంటి
తీవ్ర
పరిస్థితులకు
సమర్థవంతంగా
ఎదురు
వెళ్తూ,
ప్రపంచంలో
మేటి
ఆర్థిక
వ్యవస్థగా
భారత్‌
ను
నిలపడాన్ని
ఖచ్చితంగా
ప్రశంసించాలి”
అని
నిర్వాహకులు
పేర్కొన్నారు.

అవార్డు
వార్త
వెలువడిన
తర్వాత
నుంచి
RBI
గవర్నర్
శక్తికాంత
దాస్
‌కు
అన్ని
వర్గాల
నుంచి
శుభాకాంక్షలు
వెల్లువెత్తాయి.
“భారతదేశానికి,
భారతీయులందరికీ
గర్వించదగిన
క్షణం”
అంటూ
నెటిజన్లు
హర్షం
వ్యక్తం
చేశారు.
చాలా
కాలంగా
వృద్ధికి
ఆటంకంగా
ఉన్న
బ్యాంకింగ్
రంగం
ఆయన
హయాంలో
క్రమంగా
మెరుగుపడిందంటూ
పోస్టులు
పెడుతున్నారు.
ద్రవ్యోల్బణ
ప్రభావాన్ని,
ఆర్థిక
పరిణామాలను
సమర్థవంతంగా
నిర్వహించడంపై
ట్వీట్స్
ద్వారా
తమ
అభిమానాన్ని
చాటుకున్నారు.

English summary

Netizens appriciating RBI Governor Shaktikanta Das for achieving ‘Governor of the Year’

Netizens appreciating RBI Governor Shaktikanta Das for achieving ‘Governor of the Year’..

Story first published: Thursday, June 15, 2023, 7:17 [IST]



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *