[ad_1]
ఫ్యాటీ ఫిష్..
సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. తద్వారా శరీరంలో మంట, వాపును తగ్గిస్తాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, కీళ్ల నొప్పులతో బాధపడేవారు వారి డైట్‌లే ఫ్యాటీ ఫిష్ కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
(image source – pixabay)
Health Tips: ఈ అలవాట్లు మీకు ఉంటే.. నిండు నూరేళ్లు హ్యాపీగా బతికేస్తారు..!
పసుపు..
పసుపులో కర్కుమిన్ ఉంది. దీనిలో శక్తివంతమైన యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కీళ్ల నొప్పులు, ష్టిఫ్‌నెస్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. కీళ్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి మీ ఆహారంలో పసుపును యాడ్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు.
(image source – pixabay)
అల్లం..
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, ఇవి కీళ్లలో మంట, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. పసుపులో జింజెరోల్స్ ఉంటుంది, ఇది ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది.
(image source – pixabay)
బెర్రీలు..
బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, శరీరంలో వాపును తగ్గిండానికి సహాయపడతాయి. ఇవి మీ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి మీ డైట్‌లో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీస్‌ను చేర్చుకోండి.
(image source – pixabay)
ఆకుకూరలు..
పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
(image source – pixabay)
నట్స్, విత్తనాలు..
వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా గింజల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
(image source – pixabay)
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్‌లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, పాలీఫెనాల్స్ ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలో మంటును తగ్గిస్తాయి, కీళ్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
(image source – pixabay)
గ్రీన్ టీ..
గ్రీన్ టీలో పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ కూడా ఉంటుంది. ఈ సమ్మేళనాలు మంటను తగ్గించడానికి, మృదులాస్థి నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
(image source – pixabay)
సిట్రస్ పండ్లు..
నారింజ, నిమ్మ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో కొల్లాజెన్ సంశ్లేషణకు అవసరమైన విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీకు బలమైన కీళ్లు కావాలంటే ఇది చాలా అవసరం.
తృణధాన్యాలు..
బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ వంటి తృణధాన్యాలు ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందిస్తాయి. ఈ పోషకాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
(image source – pixabay)
Health Care: నూనె, నెయ్యి కలిపి వంట చేయవచ్చా..?
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply