అరటి పువ్వు..
అరటి పువ్వుతో రకరకాల వంటిలు చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అరటిపువ్వు గర్భాశయ ఆరోగ్యానికి తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణురాలు సిద్ధమారుత్తువార్ అన్నారు. USDA ప్రకారం, 3.5-ఔన్సు (100-గ్రామ్) అరటి పువ్వులో ప్రోటీన్: 1.5 గ్రాములు ఉంటాయి. దీనిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ వంటి మినరల్స్ మెండుగా ఉంటాయి. ఇందులో ఒలియోరిసిన్ ఉంటుంది. ఇది హెవీ బ్లీడింగ్‌ను నియంత్రిస్తుంది. కొన్ని లిగమెంట్ల సహాయంతో వెన్నుపూసకూ, పెల్విక్‌జోన్‌కూ గర్భాశయం అతికి ఉంటుంది. గర్భాశయం మన పెల్విస్‌లో సరైన స్థితిలో ఉండాలి. గర్భాశయం చుట్టూ ఉన్న నిర్మాణాలు కూడా దానికి మద్దతు ఇచ్చేంత బలంగా ఉండాలి. అరటి పువ్వులోని ఆస్ట్రింజెంట్ వాటికి మద్దతు ఇస్తుంది. గర్భాశయ గోడలు, చుట్టుపక్కల ఉన్న అవయవాలను బలంగా ఉంచుతుంది. (image source – pixabay)
కుంకుమ పువ్వు..

సాధారణంగా కుంకుమ పువ్వును గర్భధారణ సమయంలో తీసుకుంటూ ఉంటారు. మహిళలు దీన్ని సాధారణ సమయాలలోనూ తీసుకుంటే మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణురాలు సిద్ధమారుత్తువార్ సూచించారు. కోపం, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి పీఎంఎస్ లక్షణాలు ఉన్నవారు కుంకుమ పువ్వు తీసుకుంటే అవి కంట్రోల్‌లో ఉంటాని అన్నారు. మీరు పాలలో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే.. ఒత్తిడి తగ్గుతుంది, నెలసరి నొప్పులు తగ్గుతాయి. ఇది పునరుత్పత్తి వ్యవస్థకు మేలు చేస్తుంది. (image source – pixabay)
గులాబీ రేకులు..

అమ్మాయిలు గులాబీలంటే.. చాలా ఇష్టపడతారు. గులాబీలను సౌందర్య సంరక్షణలో ఎక్కువగా వాడుతుంటారు. గులాబీలు.. గర్భశయ ఆరోగ్యానికీ మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గులాబీ రేకుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడంలో సహాయపడతాయి. ఇవి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. గులాబీ రేకులో జింక్ ఎముకలను దృఢంగా ఉంచతుంది. నొప్పని తగ్గిస్తుంది. ప్రెగ్నెన్సీ హార్మోన్లను బ్యాలెన్స్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. మీరు తరచుగా రోజ్ టీ చేసుకుని తాగితే గర్భాశయ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. (image source – pixabay)
మందారం..

నెలసరి సరిగ్గా రానివారు మందారం పువ్వుల టీ తాగితే.. సమస్య పరిష్కారం అవుతుంది. ఇది గర్భాశయంలోని హార్మోన్ సమస్యలను సరిచేస్తుంది. హెవీ బ్లీడింగ్‌ను కంట్రోల్ చేస్తుంది. మీరు గర్భాశయ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి 4, 5 మందార రేకులను నీళ్లలో మరిగించి తాగండి. మందార పువ్వులు లేకపోతే.. మందార పొడని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగండి. (image source – pixabay)
తామర పవ్వు..

నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువగా అయ్యేవారికి.. హిమోగ్లోబిన్ స్థాయి అకస్మాత్తుగా పడిపోయో ప్రమాదం ఉంది. దీన్ని భర్తీ చేయడానికి తామర పువ్వు బెస్ట్ ఆప్షన్. హెవీ బ్లీడింగ్‌ను కూడా నియంత్రిస్తుంది. నెలసరి సక్రమంగా వచ్చేలా చేస్తుంది. తలతిరగడం, ఆకలి లేకపోవడం, మానసిక కల్లోలం, కోపం వంటి పీఎంఎస్ లక్షణాలను దూరం చేస్తుంది. మీరు తామర పవ్వు రేకులను ఒక గ్లాస్ నీటిలో మరిగించి తాగండి. ఈ ఐదు పూలను తరచుగా ఏదో రూపంలో తీసుకుంటే.. గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. (image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.