[ad_1]
వీరభద్రాసనం..
వీరభద్రాసనం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది హార్ట్ బీట్‌ను అదుపులో ఉంచుతుంది, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి కారణంగా వచ్చే, గుండె ప్రమాదాల ముప్పును తగ్గిస్తుంది. ఈ ఆసనం భుజం, తొడ, చీలమండ, థొరాక్స్, మెడ, ఊపిరితిత్తులు, నాభి ప్రాంతాన్ని విస్తరించింది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు.. వీరభద్రాసనం ప్రాక్టిస్ చేసే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
ఇలా వేయాలి..
రెండు కాళ్లూ కొంచెం దూరంగా పెట్టి సౌకర్యంగా ఉండేట్లు చూసుకోవాలి. ఎడమ పాదాన్ని వెనుకవైపునకు జరపాలి. కుడికాలు అలానే ఉండాలి. పిరుదులను వీలైనంత కిందికి వంచాలి. కుడి మోకాలిని 90 డిగ్రీలు వంచాలి. ఎడమ మోకాలు వంచకుండా తిన్నగానే ఉండాలి. రెండు చేతులూ భుజాలకు సమాంతరంగా చాచి ఉంచి ముందుకు చూస్తుండాలి. ఈ భంగిమలో శ్వాస తీసుకుని వదులుతూ కనీసం 30 క్షణాలపాటు ఉండాలి. ఇదే విధంగా కుడి కాలును వెనక్కు జరిపి చేయాలి. ఇలా కాళ్లు మారుస్తూ 30 క్షణాల చొప్పున నాలుగు సార్లు చేయాలి.
శీర్షాసనం..
శీర్షాసనంలో.. శరీర బరువు మొత్తం తలపై, భుజాలపై ఒత్తిడి పడుతుంది. ఇది గుండె మరింత రక్తాన్ని పంప్ చేస్తుంది. ఇది గుండెకు మరితం రక్తాన్ని పంప్ చేస్తుంది, హృదయ స్పందన రేటును పెంచుతుంది. కానీ ఇప్పటికే గుండె ఉన్నవారు ఈ సమనం వేయకూడదు. ఈ ఆసనం అన్ని ఆసనాలకెల్లా.. ఉత్తమమైనది కాబట్టి రాజాసనం అని అంటారు.
ఇలా వేయండి..
నేలపై మెత్తని టవల్ నాలుగు మడతలుగా వేసి.. రెండు చేతులపై బరువు మోపి తలను నేలపై ఆనించాలి. రెండు కాళ్లను మెల్లగా పైకి లేపాలి. ఆరమోకాళ్లు, తరువాత రెండు కాళ్లు కలిపి మొల్లగా పైకి ఎత్తాలి. పిక్కలు, తొడలు, నడుము, వీపు నిటారుగా వుండాలి. బరువు తలమీద తక్కువగాను, చేతుల మీద ఎక్కువగాను మోపాలి. కొంతసేపు తర్వాత.. నెమ్మదిగా తిరిగి యథా స్థితికి తేవాలి. ఈ ఆసనం తర్వాత.. పద్మాసనం తప్పని సరిగా వేయాలి.
హలాసనం..
హలాసానాలో నాగలిలా.. శరీరాన్ని వంచాలి. ఈ ఆసనం గుండెకు రక్తాన్ని ఎక్కువ పంప్ చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇప్పటికే గుండె సమస్యలతో బాధపడేవారు, ఈ ఆసనం వేయకపోవడమే మంచిది.
ఈ ఆసనం ఇలా వేయండి..
ఈ ఆసనం వేయడానికి.. మొదట శవాసనం వేయాలి. ఆ తరువాత కాళ్లు రెండూ కలిపి మెల్లమెల్లగా తలవైపుగా నేలపై ఆనించాలి. చేతులు నేలమీద చాపి గాని, తలవైపు మడచిగాని ఉంచాలి. ఈ స్థితిలో మీ వక్షస్థలం గడ్డానికి తగలాలి. ఆసనంలో ఉన్నంతసేపూ శ్వాసను బయటనే ఆపాలి. పొట్టను లోపలికి పీల్చి ఉంచితే ఈ ఆసనం సులభంగా వేయవచ్చును. అయితే చేతులపై ఎటువంటి ఒత్తిడిని పెట్టకండి. ఈ ఆసనంలో కొంతసేపు ఉండి.. తిరిగి సాధారణ స్థితికి చేరుకోండి. ఆ తర్వాస సుఖాసనంలో కొంతసేపు విశ్రాంతి తీసుకోండి.
భుజంగాసనం..
భుజంగాసనం.. శరీరాన్ని సాగదీస్తుంది. ఈ భంగిమ శరీరాన్ని నాగుపాములా చేస్తుంది. ఇందులో పొట్టపై పడుకుని, కాళ్లను కలిపి ఉంచి, లోతైన శ్వాస తీసుకుంటూ పైభాగాన్ని పైకి లేపాలి. ఈ పోజ్ కడుపుపై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. క్రమంగా గుండె సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఎలా వేయాలి..
భుజంగాసనం వేయడానికి ముందుగా.. బోర్లా పడుకొని శరీరం మొత్తాన్ని పూర్తిగా సాగదీయాలి. రెండు పాదాల వేళ్లు, మడమలు తాకేలా చూసుకోవాలి. అరచేతులను ఛాతీ పక్కలకు తీసుకొచ్చి, నేలకు ఆనించాలి. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా తల, ఛాతీని పైకి లేపాలి. మోచేతులు నేలకు ఆని ఉండేలా చూసుకోవాలి. కొద్ది సేపు తర్వాత శ్వాసను వదులుతూ తిరిగి సాధారణ స్థితికి రావాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply