PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు – సెబీ మరో 3 నెలల గడువు

[ad_1]

AAdani Group-Hindeburg Research Case Verdict: అదానీ – హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. ఇప్పటి వరకు సాగిన సెబీ (SEBI) దర్యాప్తును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. తాము నియమించిన నిపుణుల కమిటీ దర్యాప్తును కూడా సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. నిపుణుల కమిటీపై వచ్చిన ఆరోపణలనూ తోసిపుచ్చింది. దర్యాప్తును బదిలీ చేయాలన్న పిటిషనర్ వాదనల్లో బలం లేదని స్పష్టం చేసింది. 

సెబీ రెగ్యులేషన్స్ పరిధిలో జోక్యం చేసుకోవాలని తాము భావించడం లేదని వ్యాఖ్యానించిన సర్వోన్నత న్యాయస్థానం, దర్యాప్తును పూర్తి చేసేందుకు సెబీకి మరింత సమయం ఇచ్చింది. మొత్తం 24 కేసుల్లో, 22 కేసుల్లో ఇప్పటికే సెబీ దర్యాప్తు పూర్తయింది, ఆ నివేదికను సెబీ సుప్రీంకోర్టుకు సమర్పించింది. మిగిలిన 2 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు సెబీకి మరో 3 నెలల సమయం ఇచ్చింది. 

పెట్టుబడిదార్లకు కేంద్ర ప్రభుత్వం, సెబీ రక్షణ కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *