PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

అమెరికా ఆగమాగం ఆగని స్టాక్‌ మార్కెట్ల పతనం – నిఫ్టీ 71, సెన్సెక్స్‌ 344 డౌన్‌

[ad_1]

Stock Market Closing 15 March 2023: 

స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. అమెరికా బ్యాంకుల దివాలా, యూఎస్‌ ఎకానమీ మందగమనం వంటివి మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 71 పాయింట్లు తగ్గి 16,972 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 344 పాయింట్లు పతనమై 57,555 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 బలపడి 82.32 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 57,900  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,268 వద్ద మొదలైంది. 57,455 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,473 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 344 పాయింట్ల నష్టంతో 57,555 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

మంగళవారం 17,043 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,166 వద్ద ఓపెనైంది. 16,938 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,211 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 71 పాయింట్లు పతనమై 16,972 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 39,777 వద్ద మొదలైంది. 38,934 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,914 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 359 పాయింట్లు తగ్గి 39,051 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 28 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, టైటాన్‌ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి. మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ సూచీలు పతనమయ్యాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.57,870 గా ఉంది. కిలో వెండి రూ.500 పెరిగి రూ.69,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 తగ్గి రూ.26,050 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *