PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఆర్బీఐ రేట్‌ హైక్‌తో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ – సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌

[ad_1]

Stock Market Closing 07 December 2022:

భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందలేదు. ఆర్బీఐ రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచడం మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంట్‌ పెంచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 82 పాయింట్ల నష్టంతో 18,560 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 215 పాయింట్ల నష్టంతో 62,410 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి 82.48 వద్ద స్థిరపడింది.

BSE Sensex

క్రితం సెషన్లో 62,626 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 62,615 వద్ద మొదలైంది. 62,316 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,759 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 215 పాయింట్ల నష్టంతో 62,410 వద్ద ముగిసింది.

News Reels

NSE Nifty

మంగళవారం 18,642 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,638 వద్ద ఓపెనైంది. 18,528 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,668 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 82 పాయింట్ల నష్టంతో 18,560 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ మోస్తరుగా నష్టపోయింది. ఉదయం 43,157 వద్ద మొదలైంది. 42,948 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,327 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 39 పాయింట్లు పతనమై 43,098 వద్ద క్లోజైంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ముగిశాయి. హిందుస్థాన్‌ యునీలివర్‌, బీపీసీఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఎల్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ లైఫ్‌, ఎన్టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోయాయి. పీఎస్‌బీ బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, మీడియా, మెటల్‌, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ రంగాలు నష్టపోయాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.




[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *