PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఆస్తమా పేషెంట్స్.. శీతాకాలంలో ఈ ఆహారం అసలు తినకూడదు..!

[ad_1]

foods trigger asthma: ఆస్తమా.. ఊపిరితిత్తులకు సంబందించిన దీర్ఘకాలిక వ్యాధి. అస్తమా ఎటాక్‌ అయితే.. ఒక చోట కూర్చోలేం..నిలపడ లేం.. ఫ్రీగా గాలిని కూడా పీల్చలేం. ఆస్తమా ఎక్కువైతే.. నరకం చూడాల్సి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 2019 లో, సుమారు 262 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. అదే ఏడాది ఆస్తమా కారణంగా దాదాపు 4 లక్షల 55 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఊపిరి తిత్తుల్లోని వాయు నాళాలకు వచ్చే సమస్యనే అస్తమా అంటాం. అలర్జీతో వాయు నాళాలకు వాపు రావడంతో అవి కుంచించుకొని పోతాయి. దీంతో గాలి లోపలికి, బయటకు రావడం కష్టంగా మారుతుంది. ఆస్తమా వంశపారంపర్యంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అధిక బరువు ఉన్న వ్యక్తుల్లో అస్తమా రావొచ్చు. స్మోకింగ్‌ చేయడం, దీర్ఘకాలికంగా పొగ, దుమ్ము, ధూళిలో పనిచేయడం, కెమికల్స్‌కు గురికావడం, కాలుష్యంలో పనిచేసే వారికి ఆస్తమా వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.
ఆస్తమా పేషెంట్స్‌‌‌‌ శీతాకాలం కొంత జాగ్రత్తగానే ఉండాలి. మిగతా సీజన్‌లతో పోల్చినపుడు ఈ కాలంలో చల్లని వాతావరణం, శీతగాలుల మూలంగా ఆస్తమా ఉద్ధృతం అవుతుంది. దీంతో ఊపిరి సరిగా అందకా ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. ఈ సమస్యతో ఛాతీ పట్టేసినట్టు ఉండటం, గాలి పీల్చినపుడు పిల్లకూతలు వస్తాయి. అయితే సీజన్‌లో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆహారం, వ్యాయామాలతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమా పేషెంట్స్‌ ఈ కాలంలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలు ఆస్తమాను ట్రిగ్గర్‌ చేస్తాయని అంటున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

వాల్‌నట్స్‌..

వాల్‌నట్స్‌, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ తినడం వల్ల ఆస్తమా మరింత తీవ్రమవుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నట్స్‌లో అలర్జీ కారకాలు ఉంటాయి, ఇవి ప్రాణాంతకమైన ఆస్తమా లక్షణాలను ప్రేరేపిస్తాయి. అస్తమా పేషెంట్స్‌.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్‌ తినే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మేలు.

బీన్స్‌..

చలికాలంలో స్పైసీ స్పైసీ.. రాజ్మా కర్రీ.. తినడానికి చూడటానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ ఆస్తమా రోగులకు.. ఇది ఒక పనిష్మెంట్‌ అని చెప్పొచ్చు. . ఒక పరిశోధన ప్రకారం.. కిడ్నీ బీన్స్, ఇతర బీన్స్‌లో ఉండే.. కార్బోహైడ్రేట్ విచ్ఛిన్నమైనప్పుడు గ్యాస్ ఏర్పడుతుంది. దీని కారణంగా, ఆస్తమా రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. వారి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఒక వేళ మీరు రాజ్మా తినాలనుకుంటే.. దాన్ని కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టి కర్రీ చేసుకోవడం మంచిది.

టీ/కాఫీ..

చలికాలంలో.. వేడి వేడి టీ/కాఫీ తాగితే వచ్చే కిక్కే వేరు. కానీ, ఆస్తమా పేషెంట్స్‌ ఈ కాలంలో టీ/కాఫీ తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అస్తమా ట్రిగ్గర్‌ అవుతుందని NCBI చేసిన పరిశోధనలో స్పష్టమైంది. ఇందులో అలర్జీని కలిగించే సాలిసైలేట్స్ ఉంటాయి. ఇవి ఆస్తమా పేషెంట్స్‌కు హాని చేస్తాయి.

డైరీ ఉత్పత్తులు..

పాల ఉత్పత్తులు అందరి ఆస్తమా పేషెంట్స్‌కు హాని చేయవు. కానీ, డైరీ ఉత్పత్తులకు అలెర్జిటిక్‌ ఉన్నవారిలో మాత్రం ఆస్తమా లక్షణాలు తీవ్రం అవుతాయి. అలాంటి వారు లాక్టోస్ లేని ఆహారం తీసుకోవాలి.

రొయ్యలు..

ఫ్రోజన్‌ రొయ్యలు.. ఆస్తమా పేషెంట్స్‌కు ప్రమాదకరం. వీటిలో సల్ఫైట్స్‌ ఉంటాయి. దీని వల్ల ఆస్తమా ఎటాక్ రావచ్చు. మీరు ఒకవేళ రొయ్యలు తినాలనుకుంటే.. ఫ్రెష్‌వి తీసుకుంటే మంచిది.

ప్రాసెస్డ్‌ మీట్‌..

సాసేజ్, బేకన్, సలామీ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తింటే.. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ పెరుగుతుంది. ఆస్తమా పేషెంట్స్‌ ప్రాసెస్‌ చేసిన మీట్‌కు దూరంగా ఉంటే మంచిది. దీనికి బదులు లీన్ మాంసాలు, పౌల్ట్రీ, చేపలు తింటే మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *