PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఈ ఏడాది మల్టీబ్యాగర్లుగా మారిన 4 అదానీ స్టాక్స్‌, మీ దగ్గర ఒక్కటైనా ఉందా?

[ad_1]

Adani Group stocks 2022: గౌతమ్ అదానీ గ్రూప్‌నకు 2022 ఒక అద్భుతమైన సంవత్సరం. ఈ గ్రూప్‌లోని ఏడు లిస్టెడ్ కంపెనీల్లో నాలుగు 2022లో మల్టీ బ్యాగర్లుగా మారాయి. అదానీ స్టాక్స్‌ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (2022 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 15 వరకు) 20 శాతం నుంచి 200 శాతం మధ్య లాభాలు తెచ్చి పెట్టాయి. 

డిసెంబర్ 15, 2022 నాటికి అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 18,64,579 కోట్లుగా ఉంది. 2021లోని రూ. 9,62,322 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు అయింది. 

2022 సంవత్సరంలో అదానీ గ్రూప్ స్టాక్స్‌ పనితీరు ఇది: 

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌   | ఈ ఏడాదిలో ఇప్పటివరకు (డిసెంబర్‌ 15 వరకు) ఇచ్చిన రాబడి: 137%​
మార్కెట్‌ క్యాప్‌ 2022: రూ. 4,60,908 కోట్లు; 2021లో: రూ. 1,87,908 కోట్లు
2022 డిసెంబర్‌ 15న ముగింపు ధర: రూ. 4043.05 | 52-వారాల గరిష్టం: రూ. 4098.10
TTM P/E: 376.84 రెట్లు; ఇండస్ట్రీ P/E: 105.73 రెట్లు

News Reels

అదానీ టోటల్‌ గ్యాస్‌   |  ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇచ్చిన రాబడి: 107%​
మార్కెట్‌ క్యాప్‌ 2022: రూ.  3,90,394 కోట్లు; 2021: రూ.  1,88,579 కోట్లు
2022 డిసెంబర్‌ 15న ముగింపు ధర: రూ. 3549.65 | 52-వారాల గరిష్టం: రూ. 3910.00
TTM P/E: 769.87 రెట్లు; ఇండస్ట్రీ P/E: 133.83 రెట్లు

అదానీ గ్రీన్‌ ఎనర్జీ   |  ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇచ్చిన రాబడి: 52%​
మార్కెట్‌ క్యాప్‌ 2022: రూ. 3,20,703 కోట్లు; 2021: రూ.  2,07,662 కోట్లు
2022 డిసెంబర్‌ 15న ముగింపు ధర: రూ.  2024.60 | 52-వారాల గరిష్టం: రూ. 3048.00
TTM P/E: 601.69 రెట్లు; ఇండస్ట్రీ P/E: 12.03 రెట్లు

అదానీ ట్రాన్స్‌మిషన్‌  |  ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇచ్చిన రాబడి: 53%​
మార్కెట్‌ క్యాప్‌ 2022: రూ. 2,96,554 కోట్లు; 2021: రూ. 1,90,581 కోట్లు
2022 డిసెంబర్‌ 15న ముగింపు ధర: రూ. 2658.50 | 52-వారాల గరిష్టం: రూ. 4238.55
TTM P/E: 330.28 రెట్లు; ఇండస్ట్రీ P/E: 12.03 రెట్లు

అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌   |  ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇచ్చిన రాబడి: 21%​
మార్కెట్‌ క్యాప్‌ 2022: రూ. 1,90,945 కోట్లు; 2021: రూ. 1,49,119 కోట్లు
2022 డిసెంబర్‌ 15న ముగింపు ధర: రూ. 883.95 | 52-వారాల గరిష్టం: రూ. 987.90
TTM P/E: 36.40 రెట్లు; ఇండస్ట్రీ P/E: 18.79 రెట్లు

అదానీ పవర్‌  |  ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇచ్చిన రాబడి: 216%​
మార్కెట్‌ క్యాప్‌ 2022: రూ. 1,21,667 కోట్లు; 2021: రూ. 38,473 కోట్లు
2022 డిసెంబర్‌ 15న ముగింపు ధర: రూ. 315.45 | 52-వారాల గరిష్టం: రూ. 432.80
TTM P/E: 11.77 రెట్లు; ఇండస్ట్రీ P/E: 12.03 రెట్లు

అదానీ విల్మార్‌  |  ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇచ్చిన రాబడి: 142%​
మార్కెట్‌ క్యాప్‌ 2022: రూ. 83,407 కోట్లు; 2021: రూ. 34,467 కోట్లు
2022 డిసెంబర్‌ 15న ముగింపు ధర: రూ.  641.75 | 52-వారాల గరిష్టం: రూ. 878.35
TTM P/E: 121.22 రెట్లు; ఇండస్ట్రీ P/E: 75.13 రెట్లు

గమనిక: అదానీ విల్మార్‌ BSE, NSEలో 2022లో లిస్ట్‌ అయింది

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *