Stock Market Today, 03 January 2024: గ్లోబల్ మార్కెట్లలోని నష్టాలకు అనుగుణంగా, ఇండియన్‌ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీ ఈ రోజు (బుధవారం) ట్రేడింగ్‌ను నెగెటివ్‌ నోట్‌తో ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి.

డిసెంబర్ నెల మాన్యుఫాక్చరింగ్‌ PMI డేటా ఈ రోజు రిలీజ్‌ అవుతుంది. 

US నౌకాదళం మూడు హౌతీ బోట్లను ధ్వంసం చేయడంతో, హైతీకి మద్దతుగా, ఎర్ర సముద్రంలో ఇరాన్ యుద్ధనౌకను మోహరించింది. రెడ్‌ సీలో ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ముడి చమురు ధరలు ఆటుపోట్లకు గురవుతున్నాయి, మార్కెట్‌ దీనిని ట్రాక్‌ చేస్తుంది.

ఈ ఉదయం ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. కోస్పీ 2 శాతం పతనమైంది. హాంగ్ సెంగ్, ASX 200 1 శాతం వరకు పడిపోయాయి. భూకంపం ప్రభావంతో జపాన్ మార్కెట్లు గురువారం వరకు పని చేయవు.

మంగళవారం, కొత్త సంవత్సరంలో మొదటి ట్రేడింగ్‌ సెషన్‌ను US స్టాక్స్ నష్టాలతో ముగించాయి. S&P 500 0.57 శాతం, నాస్‌డాక్ 1.63 శాతం పడిపోయాయి, డౌ జోన్‌ ఫ్లాట్‌గా క్లోజ్‌ అయింది.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 19 పాయింట్లు లేదా 0.09% రెడ్‌ కలర్‌లో 21,679 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

అదానీ గ్రూప్‌ స్టాక్స్‌: అదానీ గ్రూప్-హిండెబర్గ్ రీసెర్చ్ కేసులో (Adani Group-Hindeburg Research case) సుప్రీంకోర్టు తుది తీర్పు నేపథ్యంలో ఈ రోజు అదానీ గ్రూప్‌ షేర్ల మీద మార్కెట్‌ ఫుల్‌ ఫోకస్‌ ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: BoM మొత్తం బిజినెస్‌ 2023 డిసెంబర్ త్రైమాసికంలో రూ.4.35 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ.3.66 లక్షల కోట్లుగా ఉంది, ఏడాది ప్రాతిపదికన 19% పెరిగింది.

CSB బ్యాంక్: Q3FY24లో బ్యాంక్ గ్రాస్‌ అడ్వాన్సులు 22.6 శాతం పెరిగి రూ. 22,863 కోట్లకు చేరుకోగా, డిపాజిట్లు ఏడాదికి 20.65 శాతం పెరిగి రూ. 27,344 కోట్లకు చేరాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్: డిసెంబర్‌ క్వార్టర్‌లో అడ్వాన్స్‌లు 13.5 శాతం వృద్ధితో రూ.9.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిపాజిట్లు 9.4 శాతం పెరిగి రూ.13.23 లక్షల కోట్లకు చేరాయి.

యస్‌ బ్యాంక్: Q3FY24లో ఈ రుణదాత ఇచ్చిన లోన్లు & మరియు అడ్వాన్సులు 11.9 శాతం YoY పెరిగి రూ.2.17 లక్షల కోట్లకు చేరాయి. డిపాజిట్లు రూ.2.41 లక్షల కోట్లుగా ఉన్నాయి, ఇది 13.2 శాతం YoY గ్రోత్‌.

మారుతి సుజుకి: కంపెనీ మొత్తం కార్ల తయారీ ఉత్పత్తి 2.9 శాతం YoY తగ్గింది. ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 3.7 శాతం YoY తగ్గి 64,802 యూనిట్లకు చేరింది.

హీరో మోటోకార్ప్: మొత్తం సేల్స్‌ 0.1 శాతం తగ్గి 393,952 యూనిట్లకు పరిమితమయ్యాయి. మోటార్‌ సైకిల్ విక్రయాలు 0.6 శాతం తగ్గి 354,658 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ ఎగుమతులు 25.7 శాతం వృద్ధితో 16,110 యూనిట్లకు చేరాయి. 

అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (DMart): డిసెంబర్ 31 నాటికి స్టోర్ల సంఖ్య 341కి చేరింది. ఆ త్రైమాసికంలో కంపెనీ స్టాండ్‌లోన్ ఆదాయం 17.2 శాతం YoY పెరిగి, రూ. 13,247 కోట్లకు చేరింది. 

V-మార్ట్ రిటైల్: కంపెనీ ఆదాయం Q3FY24లో 14 శాతం YoY జంప్‌ చేసి రూ. 889 కోట్లకు చేరుకుంది, ఇందులో లైమ్‌రోడ్ నుంచి రూ.17 కోట్లు వచ్చాయి. సేమ్‌ స్టోర్ సేల్స్‌ గ్రోత్‌ (SSSG) త్రైమాసికంలో 4 శాతానికి పైగా ఉంది.

శ్యామ్ మెటాలిక్స్: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.3,600 కోట్ల వరకు సమీకరించే పనిని ప్రారంభించింది. ఫ్లోర్‌ ప్రైస్‌ ఒక్కో షేరుకు రూ.597.63గా నిర్ణయించింది. ఇది, NSEలో గత ముగింపుతో పోలిస్తే 7.06 శాతం డిస్కౌంట్‌.

మహీంద్ర EPC ఇరిగేషన్: ప్రెషరైజ్డ్ మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ సరఫరా కోసం వాటర్ యూజర్స్ అసోసియేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ కార్యాలయం నుంచి రూ.13.34 కోట్ల విలువైన 4 ఆర్డర్లు అందుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *