Stock Market Today, 12 January 2024: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ వస్తున్నాయి. యూఎస్‌ ఇన్‌ఫ్లేషన్‌ డేటా అంచనాల కంటే ఎక్కువగా ఉండడం, ఇండియన్‌ IT మేజర్‌ కంపెనీల Q3 ఆదాయాలు బలహీనంగా ఉండడంతో భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం) అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు, భారతదేశంలో డిసెంబర్‌ నెల ద్రవ్యోల్బణం డేటా, IIP రిపోర్ట్‌ రిలీజ్‌ అవుతాయి.

USలో, డిసెంబర్‌ నెలలో ద్రవ్యోల్బణం 0.3 శాతం పెరిగింది. MoMలో ఇది 0.2 శాతం పెరుగుతుందని అంచనా వేస్తే, అంతకుమించి వేడిని పెంచింది.

నిన్న, గణనీయమైన నష్టాల నుంచి కోలుకున్న యూఎస్‌ మార్కెట్‌ ఫ్లాట్‌గా ముగిసింది. 

ఆసియా మార్కెట్లలో.. జపాన్ నికాయ్‌ ఈ ఉదయం మరో 1 శాతం పెరిగింది, 35,500 స్థాయికి సమీపంలో ఉంది. 1990 తర్వాత ఇదే అత్యధికం. ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియా కోప్సీ, హాంకాంగ్‌ హ్యాంగ్ సెంగ్ స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. 

US బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్‌ ఈల్డ్స్‌ 4.9 బేసిస్ పాయింట్లు తగ్గి 3.980 శాతానికి తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 79 డాలర్లకు పైకి చేరింది. బిట్‌కాయిన్‌ ETFలకు యుఎస్ ఆమోదంతో, బిట్‌కాయిన్ రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 14 పాయింట్లు లేదా 0.06% గ్రీన్‌ కలర్‌లో 21,720 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: HCL టెక్నాలజీస్, విప్రో, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ఆనంద్ రాఠీ వెల్త్, జస్ట్ డయల్, JTL ఇండస్ట్రీస్, టాటా మెటాలిక్స్, డెన్ నెట్‌వర్క్స్. వీటిపై మార్కెట్‌ ఫోకస్‌ ఉంటుంది.

ఇన్ఫోసిస్: 2023 డిసెంబర్‌ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.6,106 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 7.3 శాతం తగ్గింది. బ్లూమ్‌బెర్గ్ అంచనా రూ. 6,167 కోట్ల ‍‌(QoQ) కంటే 1.7 శాతం తగ్గింది.

TCS: టాటా గ్రూప్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, 2022-24 మూడో త్రైమాసికంలో రూ.11,735 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుుకుంది. 2022-23 ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం కంటే ఇది 8.2% ఎక్కువ. ఆదాయం కూడా రూ.58,228 కోట్ల నుంచి 4% పెరిగి రూ.60,583 కోట్లకు చేరింది.

టాటా పవర్: దీని అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, రూ. 70,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లో 10,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

నైకా: లెక్స్‌డేల్ ఇంటర్నేషనల్, బ్లాక్ డీల్‌ ద్వారా ఈ కంపెనీలో 2.62 కోట్ల షేర్లను విక్రయించే అవకాశం ఉంది. ఈ బ్లాక్ డీల్ విలువ రూ.490 కోట్లు.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ‍‌(LIC): పన్ను అధికారులు రూ. 3,529 కోట్ల విలువైన రెండు డిమాండ్ నోటీసులను ఈ బీమా కంపెనీకి పంపారు.

అల్ట్రాటెక్ సిమెంట్: నిబంధనల ప్రకారం గ్రీన్ ఎనర్జీ అవసరాలు తీర్చుకునేలా, క్యాప్టివ్ పవర్ కోసం ఆమ్‌ప్లస్‌ ఏజ్‌లో 26 శాతం వాటాను రూ. 49 కోట్లకు కొనుగోలు చేస్తోంది.

మహీంద్ర & మహీంద్ర (M&M): MEAL షేర్ల హక్కుల జారీకి సబ్‌స్క్రిప్షన్ ద్వారా మహీంద్ర ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ లిమిటెడ్‌లో రూ. 630 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

HG ఇన్‌ఫ్రా: ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ & కన్‌స్ట్రక్షన్‌ ప్రాతిపదికన సెంట్రల్ రైల్వేస్ ద్వారా రూ.716 కోట్ల విలువైన ప్రాజెక్టును ఈ కంపెనీ గెలుచుకుంది.

KPI గ్రీన్ ఎనర్జీ: సన్వారియా ప్రాసెసర్స్‌ లిమిటెడ్‌ నుంచి 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కోసం KPI గ్రీన్ ఎనర్జీ అనుబంధ విభాగానికి ఆర్డర్ వచ్చింది. ఈ ప్రాజెక్టును FY25లో పూర్తి చేయాలి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *