Stock Market Today, 09 February 2024: దేశంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఆలస్యం అవుతుందని మానిటరీ పాలసీ సమావేశం తర్వాత ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పడంతో, గురువారం నాడు స్టాక్‌ మార్కెట్లు సత్తువ కోల్పోయాయి, అదే బలహీనత ఈ రోజు కూడా కనిపించవచ్చు. 

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 16 పాయింట్లు లేదా 0.07 శాతం రెడ్‌ కలర్‌లో 21,758 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 

Q3 ఫలితాల ఆధారంగా RVNL, LIC, ఇర్కాన్‌ వంటి షేర్లకు డైరెక్షన్ దొరకవచ్చు. రూ. 96,317 కోట్ల రిజర్వ్ ధరతో తదుపరి స్పెక్ట్రమ్ వేలానికి గురువారం క్యాబినెట్ ఆమోదం తెలపడంతో టెలికాం స్టాక్స్‌ కూడా ఈ రోజు మార్కెట్‌ దృష్టిలో ఉంటాయి.

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఈ ఉదయం, నికాయ్‌ 0.6 శాతం పెరిగి 34 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. ASX 200 0.18 శాతం పెరిగితే, హాంగ్ సెంగ్ 1.7 శాతం పతనమైంది. లూనార్‌ న్యూ ఇయర్‌ సందర్భంగా ఇతర మార్కెట్లకు ఈ రోజు సెలవు.

నిన్న US మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్‌ అయ్యాయి. S&P 500 0.06 శాతం, డౌ జోన్స్‌ 0.13 శాతం, నాస్‌డాక్ 0.24 శాతం పెరిగాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఆల్కెమ్ ల్యాబ్‌, బజాజ్ హిందుస్థాన్ షుగర్, బంధన్ బ్యాంక్, క్యాంపస్ యాక్టివ్‌వేర్, క్యాప్లిన్ లేబొరేటరీస్, సెల్లో వరల్డ్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్, డిష్ టీవీ ఇండియా, డోమ్స్ ఇండస్ట్రీస్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, ఇమామీ, ఫినోలెక్స్ కేబుల్స్, గుజరాత్ మినరల్స్‌, గోద్రెజ్ ఇండస్ట్రీస్, హ్యాపీ ఫోర్జింగ్స్, హీరో మోటోకార్ప్, హోనాస కన్స్యూమర్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, IFCI, ఇండిగో పెయింట్స్, ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ, ఐనాక్స్ విండ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్, ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్ప్, ఐనాక్స్ విండ్ ఎనర్జీ, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్, జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్, కెన్నమెటల్ ఇండియా, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, ల్యాండ్‌మార్క్ కార్స్, మాక్స్ ఎస్టేట్, మోల్డ్-టెక్ ప్యాకేజింగ్, MRF, నియోజెన్ కెమికల్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ, పరాస్ డిఫెన్స్, ఫైజర్ పీఐ ఇండస్ట్రీస్, PSP ప్రాజెక్ట్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, శ్రీ రేణుక షుగర్, సఫైర్ ఫుడ్స్, సారెగమ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, SJVN, సన్‌ఫ్లాగ్ ఐరన్ అండ్ స్టీల్, టాటా పవర్, తేగా ఇండస్ట్రీస్, జైడస్ లైఫ్ సైన్సెస్.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్: Q3లో LIC నికర లాభం సంవత్సరానికి (YoY) 49.10 శాతం జంప్‌తో రూ. 9,444.42 కోట్లకు చేరుకుంది. అదే కాలంలో రూ. 1.17 లక్షల కోట్ల నికర ప్రీమియం ఆదాయాన్ని ఈ కంపెనీ ప్రకటించింది, ఇది 4.6 శాతం YoY వృద్ధి. 

JSW స్టీల్: జాయింట్ వెంచర్‌కు అవసరమైన ఆమోదాలు రావడంతో, JSW స్టీల్ & జపాన్‌కు చెందిన JFE స్టీల్ కార్పొరేషన్‌కు JSW ఎలక్ట్రికల్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈక్విటీ షేర్లను సమానంగా కేటాయించారు. దీంతో, JSWESPLలో JSW స్టీల్‌కు  5 మిలియన్ల ఈక్విటీ షేర్లు వచ్చాయి.

Zomato: ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్, నికర లాభంలో మార్కెట్‌ అంచనా రూ. 90.98 కోట్లను అధిగమించి, Q3 FY24లో రూ.138 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఏడాది రూ.347 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. సమీక్ష కాలంలో మొత్తం ఆదాయం 69 శాతం పెరిగి రూ. 3,288 కోట్లకు చేరుకుంది.

JK లక్ష్మి సిమెంట్: అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభం 93.9 శాతం పెరిగి రూ.150.2 కోట్లకు చేరుకుంది. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.21 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీగా 2024 ఫిబ్రవరి 21ని నిర్ణయించారు.

జీ ఎంటర్‌టైన్‌మెంట్: జీ బిజినెస్‌లోని కొందరు గెస్ట్‌ ఎక్స్‌పర్ట్‌లు, తాము ఇచ్చిన సలహాల ఆధారంగా షేర్లు కొని, తద్వారా చట్టవిరుద్ధంగా పొందిన లాభాలు రూ.7.41 కోట్లను తిరిగి చెల్లించాలని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆదేశించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *