PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

గంటకు 325 స్పీడ్‌తో వెళ్లే కారు – ఇండియాలో డెలివరీ చేసిన లాంబోర్గినీ – ధర ఎంతంటే?

[ad_1]

Lamborghini Huracan Tecnica Delivered in India: ప్రముఖ లగ్జరీ కార్ల బ్రాండ్ లాంబోర్గినీ భారతదేశంలో తన లగ్జరీ స్పోర్ట్స్ కారు అయిన హురాకాన్ టెక్నికా మొదటి యూనిట్‌ను డెలివరీ చేసింది. ఈ కారు 2022 ఏప్రిల్‌లో గ్లోబల్ లాంచ్ అయింది. దీనిని 2022 ఆగస్టులో భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర రూ. 4.99 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) ఉంది.

లాంబోర్గినీ హురాకాన్ టెక్నికా డిజైన్
హురాకాన్ పవర్ స్పోర్ట్స్ కారు అనేది కంపెనీ లాంచ్ చేసిన కొత్త కారు. ఇది స్టాండర్డ్ EVO, ట్రాక్ ఓరియంటేషన్ వెర్షన్ STO మధ్య ఉంది. ఈ ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కారు బానెట్ కార్బన్ ఫైబర్‌తో తయారు అయింది. ఇది కాకుండా ఈ కారు వెనుక భాగంలో డిఫ్యూజర్, ఫిక్స్‌డ్ రియర్ స్పాయిలర్ ఉంది. అలాగే ఇందులో వెనుక చక్రాల స్టీరింగ్, కార్బన్ సిరామిక్ బ్రేక్‌లను అందించారు.

ఇంజిన్, స్పెసిఫికేషన్లు
ఈ స్పోర్ట్స్ కారులో 5.2-లీటర్ v10 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఉంది. ఇది ఈ కారుకు 631 బీహెచ్‌పీ పవర్, 565 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ట్రాన్స్‌మిషన్ కోసం 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించారు. అదే సమయంలో ఇంజిన్ దాని శక్తిని వెనుక చక్రాలకు అందించడానికి పనిచేస్తుంది. ఈ కారు కేవలం 3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాని గరిష్ట వేగం గురించి చెప్పాలంటే ఈ విలాసవంతమైన స్పోర్ట్స్ కారు గరిష్ట వేగం గంటకు 325 కిలోమీటర్లుగా ఉంది.

భారత్‌లోనూ మరిన్ని వాహనాలు
ఈ వాహనం డెలివరీ తర్వాత భవిష్యత్తులో మరిన్ని వాహనాలను భారత్‌కు తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీనికి కారణం భారతదేశంలో లాంబోర్గినీ వాహనాలపై ప్రజల్లో పెరుగుతున్న ఇంట్రస్ట్. లాంబోర్గినీ హురాకాన్ టెక్నికా లగ్జరీ స్పోర్ట్స్ కారు… పోర్షే 911 GT3 RS, మెక్‌లారెన్ 720S, ఫెరారీ F8 ట్రిబ్యూటోలతో పోటీ పడనుంది. 

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే రూ.3.16 కోట్ల విలువైన లాంబోర్గినీ ఉరుస్ కారును కొనుగోలు చేశారు. ఇటలీ నుంచి శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు ఆ తర్వాత తారక్‌ ఇంటికి ఈ కారు చేరుకుంది. ప్రస్తుతం దీని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటలీకి చెందిన ఫోక్స్‌ వాగన్‌ కంపెనీ అనుబంధ సంస్థయే ‘లాంబోర్గినీ’.

3.16 కోట్ల రూపాయల విలువ చేసే ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్‌ అట. ఇక బుల్లెట్ ఫ్రూవ్ అని కూడా చెబుతున్నారు. 200 కిలో మీటర్ల వేగంతో వెళుతున్నప్పటికీ ఎలాంటి కుదుపులు ఉండవట. పైగా 2 నిమిషాల్లో 200 స్పీడుకు వెళ్లి.. మళ్లీ 1 నిమిషంలో 10 కిలోమీటర్లు తగ్గించినా ఎలాంటి ఒడిదొడుకులకు లోను కాదట. అంతేకాదు ఇందులో ఆటో సెన్సర్ మిషన్స్ కూడా ఉండటంతో ఎదురుగా వాహనాలు ఉంటే అలర్ట్ చేస్తుందట. ఆటోమేటేడ్‌ కారు తాళాలు ఈ కారు ప్రత్యేకత. ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు, కానీ డోర్‌లు కానీ అంత ఈజీ తెరచుకోవట. ఫుల్లీ ఆటోమెటెడ్‌, సెఫ్టీతో లంబోర్గినిని తయారు చేశారు.  దీంతో ఎన్టీఆర్‌ లంబోర్గినీ ఊరుస్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్‌ గ్యారేజ్‌‌లో 20పైగా కార్లు ఉన్నాయట. 

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *