PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

పెద్దింటిపైనే ప్రజల కన్ను, వివిధ బ్యాంక్‌ల్లో హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు ఇవి

[ad_1]

Latest Home Loan Interest Rates: 60 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు, లేదా మెట్రో ప్రాంతాల్లో రూ.45 లక్షల లోపు విలువైన ఇళ్లను అందుబాటు ధరల ఇళ్లుగా (Affordable Housing) కేంద్ర ప్రభుత్వం వర్గీకరించింది. ఇళ్ల అమ్మకాల్లో అఫర్డబుల్‌ హౌసింగ్‌ విభాగానిదే పెద్ద పోర్షన్‌. అయితే, ప్రజల అభిరుచితో పాటే ఇళ్ల కొనుగోళ్లలోనూ క్రమంగా మార్పులు వస్తున్నాయి. 

అందుబాటు ధరల ఇంట్లో సర్దుకుపోయి బతకడానికి ప్రజలు ఇష్టపడడం లేదట. తమ అభిరుచికి తగ్గట్లుగా మరింత ఉన్నత స్థాయి నివాసం (Luxury House) ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచనలకు అనుగుణంగా గృహ రుణాల్లోనూ (Home loans) స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా (ToI) రిపోర్ట్‌ ప్రకారం, సగటు హోమ్‌ లోన్‌ మొత్తం 22% పెరిగింది. FY20లో ఇది రూ.20.2 లక్షలుగా ఉంటే, FY23లో రూ.24.7 లక్షలకు చేరింది.

ఇటీవలి కాలంలోని హోమ్‌ లోన్‌ ట్రెండ్స్‌ను క్రెడిట్ బ్యూరో సంస్థ సీఆ్‌ఐఎఫ్‌ హై మార్క్‌ (CRIF High Mark) విశ్లేషించింది. ఆ ఎనాలిసిస్‌ ప్రకారం, హోమ్ లోన్ విలువ & వాల్యూమ్ రెండింటిలోనూ జంప్‌ కనిపించింది. ప్రజలు రూ.5 లక్షలు-రూ.35 లక్షల పరిధి నుంచి క్రమంగా రూ.35 లక్షలు-రూ.75 లక్షల పరిధిలోకి మారుతున్నట్లు తేలింది.

2023 ఏప్రిల్ – జూన్ కాలంలోని డేటా ప్రకారం, మొత్తం హోమ్‌ లోన్స్‌లో రూ.75 లక్షలకు మించిన లోన్లది దాదాపు 30% వాటా. రూ.35 లక్షలు-రూ.75 లక్షల పరిధిలోని లోన్లు 31.4%గా ఉన్నాయి. 35 లక్షల కంటే తక్కువ లోన్‌ తీసుకున్న వాళ్లు మొత్తం లోన్లలో 37% కంటే తక్కువగా ఉన్నారు.

ప్రస్తుతం, హోమ్‌ లోన్స్‌ మీద వివిధ బ్యాంక్‌లు వసూలు చేస్తున్న వడ్డీ రేట్‌లు ఇవి:

ప్రభుత్వ రంగ బ్యాంకులు

బ్యాంక్ ఆఫ్ ఇండియా —-  8.30% నుంచి 10.75% వరకు 
యూనియన్ బ్యాంక్ —-  8.35% నుంచి 10.75% వరకు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర —-  8.35% నుంచి 11.15% వరకు 
స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా —-  8.40% నుంచి 10.15% వరకు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్  —-  8.40% నుంచి రేట్‌ మొదలవుతుంది 
బ్యాంక్ ఆఫ్ బరోడా —-  8.40% నుంచి 10.65% వరకు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా —-  8.45% నుంచి 9.80% వరకు 
పంజాబ్ నేషనల్ బ్యాంక్ —-  8.45% నుంచి 10.10% వరకు
యూకో బ్యాంక్ —-  8.45% నుంచి 10.30% వరకు
కెనరా బ్యాంక్ —-  8.50% నుంచి 11.25% వరకు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ —-  8.50% నుంచి 10% వరకు

ప్రైవేట్ రంగ బ్యాంకులు

HDFC బ్యాంక్ —-  8.35% నుంచి ప్రారంభం
కోటక్ మహీంద్ర బ్యాంక్ —-  8.70% నుంచి ప్రారంభం
యాక్సిస్ బ్యాంక్ —-  8.70 నుంచి 13.30% వరకు
ICICI బ్యాంక్ —-  8.75% నుంచి ప్రారంభం
ఫెడరల్ బ్యాంక్ —-  8.80%  నుంచి ప్రారంభం
RBL బ్యాంక్ —-  8.90% నుంచి ప్రారంభం
కరూర్ వైశ్యా బ్యాంక్ —-  8.95% నుంచి 11.00% వరకు
బంధన్ బ్యాంక్ —-  9.16% నుంచి 15% వరకు
ధనలక్ష్మి బ్యాంక్‌  —-  9.35% నుంచి 10.50% వరకు
సౌత్ ఇండియన్ బ్యాంక్ —-  9.84% నుంచి 11.24% వరకు

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు)

LIC హౌసింగ్ ఫైనాన్స్ —-  8.35% నుంచి 10.35% వరకు
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ —-  8.50% నుంచి ప్రారంభం
PNB హౌసింగ్ ఫైనాన్స్ —-  8.50% నుంచి 14.50% వరకు
గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ —-  8.55% నుంచి ప్రారంభం
ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ —-  8.80% నుంచి 14.75% వరకు
ICICI హోమ్ ఫైనాన్స్ —-  9.20% నుంచి ప్రారంభం

మరో ఆసక్తికర కథనం: హయ్యర్‌ పెన్షన్ టెన్షన్‌, వాళ్ల బీపీ పెంచకండయ్యా బాబూ!

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *