PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ లేదా బోర్డ్‌ రద్దు, మరో వేటుకు సిద్ధమవుతున్న ఆర్‌బీఐ!

[ad_1]

RBI May Revoking Paytm Payments Bank License: పేటీఎం బ్రాండ్‌తో బిజినెస్‌ చేస్తున్న మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ‍‌(One97 Communications) కష్టాలు రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 29 తర్వాత కొత్త కస్టమర్లను యాడ్‌ చేయకుండా, క్రెడిట్ బిజినెస్‌ చేయకుండా పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ (PPBL) మీద ఆంక్షలు విధించిన రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI), మరో కఠిన చర్యకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు!
 మనీ కంట్రోల్‌ రిపోర్ట్‌ ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసే ఆలోచనలో ఉంది. వ్యాపారాన్ని మూసివేయడానికి, ఇప్పటికే ఉన్న లావాదేవీలను సెటిల్ చేయడానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి RBI వచ్చే నెల 15 వరకు (15 మార్చి 2024‌) గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఎటువంటి లావాదేవీలు చేయకూడదని స్పష్టం చేసింది. మార్చి 15 తర్వాత, పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ లైసెన్స్‌ను కేంద్ర బ్యాంక్‌ రద్దు చేసే అవకాశం ఉంది. లేదా, బ్యాంక్ డైరెక్టర్ల బోర్డును సస్పెండ్‌ చేసే ఆప్షన్‌ను కూడా రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోంది. మనీ కంట్రోల్‌ ఇచ్చిన ఈ న్యూస్‌ నిజమైతే, ఇప్పటికే ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన పేటీఎం కష్టాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 

కేంద్ర ఆర్థిక మంత్రితో శర్మ సమావేశం
పేటీఎం ప్రమోటర్ విజయ్ శేఖర్ శర్మ, మంగళవారం నాడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశం అయ్యారని సమాచారం. ఈ వార్తను ఏ వర్గం కూడా అధికారికంగా ధృవీకరించలేదు. ఆర్‌బీఐతోనూ సమావేశమై నిబంధనల గురించి, కంపెనీ లావాదేవీల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో, పేటీఎం ఉన్నతాధికార్లు కూడా ఆర్‌బీఐ అధికార్లతో చర్చలు జరిపారు. 

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ మీద ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో కొన్ని స్టార్టప్‌ కంపెనీలు ఏకమయ్యాయి. పేటీఎం మీద ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు ఆందోళన కలిగిస్తున్నాయని, వాటిని రద్దు చేయాలని కోరుతూ స్టార్టప్‌ కంపెనీల వ్యవస్థాపకులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కనీసం ఆంక్షల తీవ్రతనైనా తగ్గించాలి అభ్యర్థించారు. ఆంక్షలు అలాగే కొనసాగితే ఫిన్‌టెక్‌ రంగానికి ప్రతికూల సంకేతాలు వెళ్తాయని, మిగిలిన కంపెనీలపైనా ఆ ప్రభావం పడుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. తాము రాసిన లేఖను ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు ఆర్‌బీఐకి కూడా పంపారు. ఇన్నోవ్‌8, క్యాపిటల్‌మైండ్‌, భారత్‌ మ్యాట్రిమోనీ సహా మరికొన్ని ప్రముఖ స్టార్టప్‌ల ఫౌండర్లు ఆ లేఖ మీద సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త తర్వాత, ఈ రోజు (బుధవారం, 07 ఫిబ్రవరి 2024), Paytm షేర్లు 10% జంప్‌ చేశాయి. ఈ రోజు ఉదయం మార్కెట్‌ ప్రారంభమైన నిమిషాల్లోనే పేటీఎం షేర్లు రూ. 496.75 స్థాయికి చేరాయి. మధ్యాహ్నం 11.57 గం. సమయానికి ఈ షేర్‌ ధర 9% లాభంతో రూ.491.75 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఈ చిన్న లాజిక్‌ మిస్ అయింది, ఆర్‌బీఐకి అడ్డంగా దొరికిపోయింది!

మరిన్ని చూడండి

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *