ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడీ వ్యక్తి – అంబానీ, అదానీ నంబర్‌ ఏంటో తెలుసా?

[ad_1]

Forbes Richest List 2024: ఫోర్బ్స్, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను ప్రతి సంవత్సరం విడుదల చేస్తుంది. 2024 సంవత్సరం లిస్ట్‌ను కూడా రిలీజ్‌ చేసింది. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల సంఖ్య ఈ ఏడాది 200కు చేరింది. గత ఏడాది ఈ సంఖ్య 167 గా ఉంది. ఫోర్బ్స్ జాబితాలో ఉన్న భారతీయుల కోటీశ్వరుల మొత్తం సంపద దాదాపు 954 బిలియన్ డాలర్లు. 

అగ్రస్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 
ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ LMVH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఎక్స్‌, స్టార్‌లింక్, టెస్లా కంపెనీల యజమాని ఎలాన్ మస్క్‌ను దాటి ఫస్ట్‌ ప్లేస్‌కు చేరుకున్నారు. 75 ఏళ్ల బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం నికర విలువ (సంపద విలువ) దాదాపు 233 బిలియన్‌ డాలర్లు. ఈ జాబితాలో ఎలాన్ మస్క్ పేరు రెండో స్థానంలో ఉంది. అతని ఆస్తుల విలువ 195 బిలియన్ డాలర్లు. 

ఫోర్బ్స్ 2024 సంపన్నుల జాబితాలో.. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పేరు థర్డ్‌ ప్లేస్‌లో ఉంది, ఆయన సంపద విలువ 194 బిలియన్ డాలర్లు. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ 177 బిలియన్ డాలర్ల ఆస్తిపాస్తులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఒరాకిల్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు, అతని నికర విలువ 141 బిలియన్ డాలర్లు. ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ 133 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఈ జాబితాలో 6వ ర్యాంక్‌ సాధించారు. బిల్ గేట్స్ 128 బిలియన్ డాలర్ల సంపదతో 7వ నంబర్‌లో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈవో స్టీవ్ బాల్మర్, రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ, గూగుల్‌ కో-ఫౌండర్‌ లారీ పేజ్ వరుసగా 8, 9, 10 స్థానాల్లో ఉన్నారు.

అంబానీ, అదానీల ఆస్తుల విలువ
ఫోర్బ్స్ ప్రకారం, ప్రపంచంలోని టాప్-10 సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముకేశ్‌ అంబానీ నికర విలువ దాదాపు 116 బిలియన్ డాలర్లు. గౌతమ్ అదానీ భారతదేశంలో రెండో అత్యంత సంపన్న వ్యాపారవేత్త. ఫోర్బ్స్ జాబితాలో అతను 17వ స్థానంలో ఉన్నారు. అదానీ సంపద విలువ 84 బిలియన్ డాలర్లు. 

భారత్‌లో, 36.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో శివ్ నాడార్ మూడో స్థానంలో, 33.5 బిలియన్ డాలర్ల ఆస్తులున్న సావిత్రి జిందాల్ ఫోర్త్‌ ప్లేస్‌లో, 26.7 బిలియన్ డాలర్ల సంపదతో దిలీప్ సంఘ్వీ ఐదో నంబర్‌లో నిలిచారు.

ఫోర్బ్స్ 2024 జాబితాలో మొత్తం 2,781 మందికి చోటు దక్కింది. 2023తో పోలిస్తే 2024లో వీరి సంఖ్య 141 పెరిగింది. ఈ సంపన్నుల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే ఈసారి 2 లక్షల కోట్ల డాలర్లు పెరిగింది, 14.2 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్లలో జాబితాలో మూడింట రెండొంతుల మంది సంపద వృద్ధి చెందగా, నాలుగింట ఒక వంతు సంపన్నుల ఆస్తి తగ్గింది.

ఫోర్బ్స్‌ 2024 లిస్ట్‌లో ఉన్న 2,781 మందిలో 813 మంది అమెరికన్లు. 473 మంది చైనీయులు. భారత్‌ నుంచి 200 మంది ఉన్నారు. 2023తో పోలిస్తే భారతీయ సంపన్నుల సంఖ్య ఈసారి 31 పెరిగింది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *