మార్కెట్లలో సానుకూలత – 72000 పైన సెన్సెక్స్ , 22000 స్థాయిని టెస్ట్‌ చేస్తున్న నిఫ్టీ


Stock Market News Today in Telugu: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు (గురువారం, 08 ఫిబ్రవరి 2024) సానుకూల దృక్పథంతో ప్రారంభమైంది. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ (RBI MPC) నిర్ణయాలు వెలువడే రోజున, స్టాక్ మార్కెట్‌లో సందడి కనిపించింది. 72,000 పైన నిలదొక్కుకోవడానికి సెన్సెక్స్‌ ప్రయత్నిస్తుండగా, నిఫ్టీ 22,000 స్థాయిని టెస్ట్‌ చేస్తోంది.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…

గత సెషన్‌లో (బుధవారం) 72,152 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 321.42 పాయింట్లు లేదా 0.45 శాతం పెరుగుదలతో 72,473.42 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 21,931 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 9.15 పాయింట్లు లేదా 0.36 శాతం జంప్‌తో 22,009.65 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.8 శాతం, స్మాల్‌ క్యాప్ సూచీ కూడా 0.8 శాతం లాభపడ్డాయి. వీటిలో బలం కంటిన్యూ అవుతోంది.

సెన్సెక్స్ షేర్లు
మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో.. 22 స్టాక్స్‌ లాభాల్లో ఉండగా, 8 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టాప్ గెయినర్స్‌లో.. పవర్ గ్రిడ్ 5.34 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 1.28 శాతం, ఎస్‌బీఐ 1.23 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.21 శాతం, టీసీఎస్ 1.05 శాతం చొప్పున లాభపడ్డాయి. టాప్ లూజర్లలో.. ఐటీసీ 1.31 శాతం, మారుతి సుజుకి 1.26 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.71 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.64 శాతం, నెస్లే 0.38 శాతం చొప్పున క్షీణించాయి. 

నిఫ్టీ షేర్లు
నిఫ్టీ PSB ఇండెక్స్ 1 శాతం పైగా పెరిగింది. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి.

పేటీఎం మనీ కేవైసీ విషయాలను CDSL పరిశీలిస్తోందని నేషనల్‌ మీడియాలో వార్తలు రావడంతో, పేటీఎం షేర్లలో రెండు రోజుల లాభాలు ఆగిపోయాయి, ఈ రోజు 5 శాతం పడిపోయింది.

ఈ రోజు ఉదయం 09.45 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 128.40 పాయింట్లు లేదా 0.18% పెరిగి 72,280.40 దగ్గర; NSE నిఫ్టీ 44.55 పాయింట్లు లేదా 0.20% పెరిగి 21,975.05 వద్ద ట్రేడవుతున్నాయి. 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: గ్రాసిమ్ ఇండస్ట్రీస్, LIC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, జొమాటో, బయోకాన్, ఆర్తి ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్, అస్టర్ DM హెల్త్‌కేర్, ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా, బలరాంపూర్ చినీ మిల్స్, BEML, కాంకర్డ్ బయోటెక్, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎస్కార్ట్స్ కుబోటా, హిట్స్, హనీవెల్ ఆటోమేషన్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ITD సిమెంటేషన్, JK లక్ష్మి సిమెంట్, NCC, పేజ్ ఇండస్ట్రీస్, పతంజలి ఫుడ్స్, రైల్ వికాస్ నిగమ్, SKF ఇండియా, థర్మాక్స్, టోరెంట్ పవర్, జైడస్ వెల్‌నెస్.

గ్లోబల్ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు అందాయి. జపాన్ నికాయ్‌ 0.75 శాతం పెరిగింది. నిన్న, అమెరికా మార్కెట్లలో డౌ జోన్స్‌,  S&P 500 రికార్డు స్థాయికి చేరుకున్నాయి. డౌ జోన్స్ 150 పాయింట్ల జంప్‌తో ముగిసింది. S&P 500 ఇండెక్స్ మొదటిసారిగా 5000 స్థాయికి చేరుకుంది. నాస్‌డాక్ కూడా నిన్న ఒక శాతం భారీ ర్యాలీని చూసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *