రెండు సెషన్లలో రూ.6 లక్షల కోట్లు హుష్‌కాకి! శుక్రవారం మార్కెట్లో రక్త కన్నీరు!

[ad_1]

Stock Market Closing 16 December 2022:

భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్‌ మళ్లీ వడ్డీరేట్లు పెంపు, ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడమే ఇందుకు కారణాలు. పనిలో పనిగా మదుపర్లు లాభాల స్వీకరణకూ పాల్పడ్డారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 140 పాయింట్ల నష్టంతో 18,274 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 461 పాయింట్ల నష్టంతో 61,337 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు బలహీనపడి 82.86 వద్ద స్థిరపడింది. రెండు రోజుల్లోనే మదుపర్లు రూ.6 లక్షల కోట్ల సంపద నష్టపోయారు.

BSE Sensex

క్రితం సెషన్లో 61,799 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,534 వద్ద మొదలైంది. 61,292 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,893 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 461 పాయింట్ల నష్టంతో 61,337 వద్ద ముగిసింది.

News Reels

NSE Nifty

గురువారం 18,414 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 18,319 వద్ద ఓపెనైంది. 18,255 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,440 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 140 పాయింట్ల నష్టంతో 18,274 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ మోస్తరుగా నష్టపోయింది. ఉదయం 43,261 వద్ద మొదలైంది. 43,080 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,598 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 261 పాయింట్లు పతనమై 43,237 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 45 నష్టాల్లో ముగిశాయి. టాటా మోటార్స్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యూపీఎల్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌, ఎం అండ్‌ ఎం, బీపీసీఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, డాక్టర్ రెడ్డీస్‌ నష్టపోయాయి. ఆటో, ఐటీ, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌ రంగాలు ఎక్కువ పతనమయ్యాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.




[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *