PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

సెన్సెక్స్‌ 899 రైజ్‌ – నేడు రూ.4.5 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!

[ad_1]

Stock Market Closing 03 March 2023: 

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. అమెరికాకు చెందిన జీక్యూజీ పాట్నర్స్‌ అదానీ గ్రూప్‌లో రూ.15,446 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేసింది. ఇంకా ఇతర అంశాలు మార్కెట్లో పాజిటివ్‌ సెంటిమెంటు పెంచాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 272 పాయింట్లు పెరిగి 17,594 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 899 పాయింట్లు ఎగిసి 59,808 వద్ద  ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 63 పైసలు బలపడి 81.96 వద్ద స్థిరపడింది. నేడు మదుపర్లు రూ.4.5 లక్షల కోట్ల వరకు సంపద పోగేశారు.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 58,909 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 59,241 వద్ద మొదలైంది. 59,231 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,967 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 899 పాయింట్ల లాభంతో 59,808 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 17,321 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,451 వద్ద ఓపెనైంది. 17,427 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,644 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 272 పాయింట్లు పెరిగి 17,594 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 40,671 వద్ద మొదలైంది. 40,605 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,390 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 861 పాయింట్లు పెరిగి 41,251 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభాల్లో 8 నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సెమ్‌, సిప్లా, దివిస్‌ ల్యాబ్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఆకుపచ్చ రంగులో కళకళలాడుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎక్కువ ఎగిశాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర  రూ.56,450 గా ఉంది. కిలో వెండి రూ.400 పెరిగి రూ.66,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.25,440 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *