అదానీతో టోటల్‌ ఎనర్జీస్‌ డీల్‌ – 700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి

[ad_1]

Totalenergies Adani Deal: 

అదానీ గ్రూప్‌ మరో జాక్‌పాట్‌ కొట్టబోతోంది! అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) అభివృద్ధి చేసిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో టోటల్‌ ఎనర్జీస్‌ ఎస్‌ఈ (Total Energies SE) కంపెనీ భారీ పెట్టుబడి పెట్టబోతోందని సమాచారం. అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌  సంస్థ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిన అదానీ గ్రూప్‌ కుదుర్చుకొంటున్న తొలి బహిరంగ ఒప్పందం ఇదే కానుంది. కాగా ఈ వ్యవహారంపై రెండు కంపెనీలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

స్వచ్ఛ ఇంధన పోర్టుపోలియోను విస్తరించుకోవాలని టోటల్‌ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో భాగంగానే అదానీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల్లో వాటా కొనుగోలుకు సిద్ధమైందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మీడియాకు తెలిపారు. పెట్టుబడి విలువ 700 మిలియన్‌ డాలర్లుగా ఉంటుందని వారు పేర్కొన్నారు. చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. లావాదేవీని ఎలా పూర్తి చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని వివరించారు.

ఈ ఒప్పందం కుదిరితే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఇంధన మార్కెట్లో టోటల్‌ ఉనికి పెరుగుతుంది. మరోవైపు అదానీ గ్రీన్‌ మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా రెండు కంపెనీల మధ్య బలం మరింత బలోపేతం అవుతుంది. ఇప్పటికే అదానీ గ్రీన్‌లో 19.75 శాతం వాటాతో టోటల్‌ రెండో అతిపెద్ద వాటాదారుగా ఉంది. కర్బణ ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ మార్పులు రాకుండా అడ్డుకొనేందుకు అన్ని దేశాలు ఏకమవుతున్న సంగతి తెలిసిందే. పైగా షేరు హోల్డర్ల నుంచీ డిమాండ్లు పెరుగుతున్నాయి. అందుకే టోటల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

అదాన్‌ గ్యాస్‌ లిమిటెడ్‌లో టోటల్‌ గ్యాస్‌ 2019లో పెట్టుబడి పెట్టింది. 600 మిలియన్‌ డాలర్లతో 27.4 శాతం వాటా కొనుగోలు చేసింది. దాంతో కంపెనీ పేరు అదానీ టోటల్‌ గ్యాస్‌గా మారింది. ఇక 2021లో అదానీ గ్రీన్‌లో కంపెనీ 20 శాతం వాటా కైవసం చేసుకుంది. అలాగే అదానీ గ్రీన్‌ సోలార్‌ ఫార్మ్స్‌లోనూ 2.5 బిలియన్ డాలర్లతో వాటా కొనుగోలు చేసింది. దీంతో 2022లో అదానీ గ్రీన్‌లో పెట్టిన పెట్టుబడి విలువ 10 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. అలాగే భారత్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ డెవలప్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించాలని టోటల్‌ భావిస్తోంది.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లు శుక్రవారం రూ.18 పెరిగి రూ.1000 వద్ద కొనసాగుతున్నాయి. ఉదయం రూ.990 వద్ద మొదలైన షేర్లు  రూ.983 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకాయి. రూ.1012 వద్ద గరిష్ఠాన్ని అందుకున్నాయి. ఇక అదానీ పవర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన షేర్లు ఎరుపెక్కాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *