[ad_1]
కాల్షియం, విటమిన్ డి తీసుకోండి..
ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, విడమిన్ D చాలా అవసరం. 70 శాతం ఎముకలు కాల్షియం, ఫాస్ఫేట్ తోనే తయారవుతాయి. విటమిన్ డీ శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. 19-50 సంవత్సరాల వయస్సు గల మహిళలు రోజుకు 1000 మిల్లీగ్రాముల కాల్షియం, 600-800 ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ D తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు తమ ఆహారం, సప్లిమెంట్ల ద్వారా తగినంత మొత్తంలో కాల్షియం తీసుకోవాలని డాక్టర్ దిలీప్ అన్నారు. మీ డైట్‌లో డైరీ ఉత్పత్తులు, చీజ్, సోయాబీన్స్, ఆకుకూరలు, చేపలు, తృణధాన్యాలు వంటి ఆహరం ఎక్కువగా తీసుకోండి. విటమిన్ డీ పొందడానికి ఉదయం పూట కొంత సమయం సూర్యరశ్మిలో గడపండి.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి..
ఎముకలును దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. వ్యాయామం చాలా అవసరం. ఆస్టియోపోరోసిస్ నివారించడానికి ప్రతిరోజూ.. వాకింగ్, డాన్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటి వర్కవుట్స్ చేయండి. ఇవి మీ ఎముకల సాంద్రతను పెంచడానికి సాహయపడతాయి. మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి..
అతిగా స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తాగినా.. బోలు ఎముకల వ్యాధి ముప్పు పెరుగుతుంది. మహిళలు ధూమపానానికి దూరంగా ఉండాలని డాక్టర్ దిలీప్ సూచించారు. మధ్యపానం మితంగానే తీసుకోవాలని అన్నారు.
హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ…
హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ(HRT).. మెనోపాజ్ దశోలో ఉన్న మహిళల్లో ఆస్టియోపోరోసిస్ నివారించడానికి సహాయపడుతుంది. మెనోపాజ్ తర్వాత శరీరం ఉత్పత్తి ఆగిపోయిన హార్మోన్ల భర్తీకి HRT సహాయపడుతుంది. ఇది ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. వేడి ఆవిర్లు, యోని పొడిబారడం వంటి మెనోపాజ్ లక్షణాలను నుంచి ఉపశమనం పొందడానికి HRT సహాయపడుతుంది. HRT కారణంగా.. కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.. వీటి గురించి మా డాక్టర్‌ను అడిగి తెలుసుకోండి.
మందులు తీసుకుంటా..
ఆస్టియోపోరొసిస్ సమస్యను దూరం చేయడానికి అనేక మెడిసిన్స్ సహాయపడతాయి. అలెండ్రోనేట్, రైస్‌డ్రోనేట్ వంటి బిస్ఫాస్ఫోనేట్‌లు ఎముక క్షీణతను తగ్గించడానికి, ఎముక సాంద్రతను పెంచడానికి తోడ్పడతాయి. డెనోసుమాబ్, టెరిపరాటైడ్ వంటి మందులు బోలు ఎముకల వ్యాధిని నిరోధించడంలో సహాయపడతాయి. మహిళలు వారి ప్రత్యామ్నాయాల గురించి వైద్యుడిని సంప్రదించడం మేలు.
ఎముక సాంద్రత పరీక్ష..
65 ఏళ్లు పైబడిన మహిళలు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని గుర్తించడానికి ఎముక సాంద్రత పరీక్ష (Bone Density Testing) చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బోలు ఎముకల వ్యాధి కుటుంబ చరిత్ర ఉన్నవారు, ఇప్పటికే ఎముకలు బలహీనంగా ఉన్న మహిళలకు ఆస్టియోపోరొసిస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎముక సాంద్రత పరీక్ష చేయించుకుంటే.. మొదటి దశలోని దీనిని గుర్తించి, నివారించగలం.
Also Read: ఈ సమస్య ఉంటే.. తుమ్మినా ఎముకలు విరుగుతాయంట..!
హెల్తీ వెయిట్ మెయింటేన్ చేయండి..
ఆస్టియోపోరొసిస్ సమస్యను నివారించడానికి.. హెల్తీ వెయిట్ మెయింటేన్ చేయడం చాలా ముఖ్యం. తక్కువ బరువు ఉన్న స్త్రీలకు ఎముక సాంద్రత తక్కువగా ఉండటం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అధిక బరువు ఉన్న స్త్రీలు ఎక్కువగా పడిపోతూ ఉంటారు, వీళ్లలో ఎముకలు ఫ్రాక్చర్స్ ఎక్కువగా ఉంటాయి. . మహిళలు సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల.. హెల్తీ వెయిట్ మెయింటేన్ చేయవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply