PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఇల్లు కొనే వాళ్లు హ్యాపీ, గుడ్‌న్యూస్‌ చెప్పిన రిజర్వ్‌ బ్యాంక్‌

[ad_1]

Housing Loan Interest Rates: ఈ రోజు ద్రవ్య విధానాన్ని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు, రివర్స్‌ రెపో రేటులో ఎలాంటి ఛేంజెస్‌ ఉండవని గవర్నర్ శక్తికాంత దాస్‌ చెప్పారు. అంటే, రెపో రేటు 6.50 శాతంగా వద్దే యథతథంగా కొనసాగుతుంది. మళ్లీ, RBI MPC మీటింగ్‌ ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగుతుంది. అప్పటి వరకు 6.50 శాతం రెపో రేట్‌ కంటిన్యూ అవుతుంది. బ్యాంక్‌ లోన్స్‌ కోసం వెళ్లే వాళ్లకు, ముఖ్యంగా హోమ్‌ లోన్‌ తీసుకునే వాళ్లకు ఇది ఉపశమనం. ఎందుకంటే, మరో రెండు నెలల వరకు హౌసింగ్‌ లోన్స్‌ మీద వడ్డీ రేట్లు పెరగకపోవచ్చు.

ఆర్‌బీఐ రెపో రేట్‌కు, బ్యాంక్‌ వడ్డీ రేట్లకు లింక్‌ ఏంటి?
రెపో రేట్‌ అంటే, దేశంలోని వాణిజ్య బ్యాంకులకు సెంట్రల్‌ బ్యాంక్‌ (RBI) ఇచ్చే అప్పులపై వసూలు చేసే వడ్డీ రేటు. రెపో రేట్‌ పెరిగితే బ్యాంకులపై వడ్డీ భారం పెరుగుతుంది. ఆ బర్డెన్‌ను అవి కస్టమర్ల మీదకు నెడతాయి. తాము ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లను పెంచుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే, రెపో రేట్‌ పెరిగితే బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరుగుతాయి, రెపో రేట్‌ తగ్గితే బ్యాంక్‌ వడ్డీ రేట్లు తగ్గుతాయి. గత ఆర్థిక సంవత్సరంలో (FY23), RBI మొత్తం ఆరు సార్లు రెపో రేటును పెంచింది. ఈ ఆరు దఫాల్లో కలిపి మొత్తం 2.50 శాతం (250 బేసిస్‌ పాయింట్లు) పెంచింది, రెపో రేటును 4,00 శాతం నుంచి 6.50 శాతానికి తీసుకెళ్లింది. దీనివల్ల, లోన్లు తీసుకున్న ప్రజలపై చాలా భారం పడింది. రెపో రేట్‌ పెంచిన ప్రతిసారీ బ్యాంక్‌కు కట్టాల్సిన EMI మొత్తం పెరుగుతూ వచ్చింది. 

తాజా MPC మీటింగ్‌లో రెపో రేట్‌ను RBI పెంచలేదు కాబట్టి, అక్టోబర్‌ (నెక్ట్స్‌ MPC మీటింగ్‌) వరకు బ్యాంక్‌ రేట్లు, ముఖ్యంగా హౌసింగ్‌ లోన్‌ రేట్లు పెరిగే ఆస్కారం లేదు. ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వాళ్లతో పాటు, కొత్తగా హోమ్‌ లోన్‌ తీసుకోవాలని అనుకుంటున్న వాళ్లకు ఇది ఊరట. రాబోయేది పండుగల సీజన్‌. ఆ సీజన్‌లో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయాలనుకునే వాళ్లకు ఉపశమనం లభించినట్లే. 

రియల్‌ ఎస్టేట్‌కు బూస్ట్‌
యథాతథంగా కొనసాగే రెపో రేట్‌, స్థిరాస్తి రంగంలో ఉత్సాహం పెంచుతుందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పూరి చెబుతున్నారు. ముఖ్యంగా.. మిడిల్ & లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేశారు.

గత రెండేళ్లలో EMI భారం బాగా పెరిగింది
అనరాక్‌ (ANAROCK) రీసెర్చ్ ప్రకారం, 2023 మొదటి ఆరు నెలల్లో, దేశంలోని టాప్-7 నగరాల్లో దాదాపు 2.29 లక్షల యూనిట్ల హౌసింగ్ అమ్మకాలు జరిగాయి. ఇది, గత పదేళ్లలోనే అత్యధిక అర్ధ-వార్షిక విక్రయాలు. ప్రస్తుతానికి ఇన్‌ఫ్లేషన్‌ రిస్క్‌ స్థిరంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరిగితే, ఇళ్ల అమ్మకాలను అది ప్రభావితం చేస్తుంది. అనరాక్‌ రీసెర్చ్ ప్రకారం, గత రెండేళ్లలో గృహ కొనుగోలుదార్ల EMIల మొత్తం 20 శాతం పెరిగింది. 2021 జులైలో సగటున రూ. 22,700గా ఉన్న హౌసింగ్‌ లోన్‌ ఈఎంఐ, ఇప్పుడు రూ. 27,300 కు చేరింది. 

మరో ఆసక్తికర కథనం: టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్ ఐపీవో – ఎక్స్‌పర్ట్‌లు బిడ్‌ వేయమంటున్నారా, వద్దంటున్నారా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *