[ad_1]
Stock Market Today, 20 November 2023: బెంచ్‌మార్క్ సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఈ వారాన్ని ఉత్సాహంగా ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా, తన బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను యథాతథంగా ఉంచడంతో సోమవారం ఆసియా-పసిఫిక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. హ్యాంగ్ సెంగ్, కోస్పీ 0.6, 0.8 శాతం చొప్పున పెరిగాయి. ASX200 0.15 శాతం పెరిగింది. జపాన్ యొక్క నిక్కీ ఫ్లాట్‌గా ఉంది.
గ్లోబల్ ఇన్వెస్టర్లు FOMC మినిట్స్‌పై ఒక కన్నేసి ఉంచుతారు, మంగళవారం ఆ డేటా విడుదలవుతుంది. థాంక్స్ గివింగ్ సందర్భంగా గురువారం US మార్కెట్ పని చేయదు.
ఈ రోజు ఉదయం 8.30 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 10 పాయింట్లు లేదా 0.05% రెడ్ కలర్‌లో 19,809 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్: రిలయన్స్ నుంచి ఇటీవల డీమెర్జ్ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్లు సేతురామన్ కందసామి, జగన్నాథ కుమార్ వెంకట గొల్లపల్లి, జయశ్రీ రాజేష్‌లు కంపెనీ డైరెక్టర్‌ల పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 17న ఆఫీస్ అవర్స్ ముగింపు నుంచి ఈ రాజీనామాలు అమల్లోకి వచ్చాయి.
ఒబెరాయ్ రియాల్టీ: హరియాణాలోని గురుగావ్‌లో ఉన్న సెక్టార్ 58లో దాదాపు 14.816 ఎకరాల భూమిని (59,956.20 చదరపు మీటర్లకు సమానం) ఒబెరాయ్ రియాల్టీ కొనుగోలు చేసింది. ఐరియో రెసిడెన్సెస్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరికొన్ని కంపెనీలతో కలిసి ఈ ల్యాండ్‌ను కొనుగోలు చేసింది.
VIP ఇండస్ట్రీస్: V.I.P. ఇండస్ట్రీస్ లిమిటెడ్ IT & సిస్టమ్స్ హెడ్ అజిత్ కోల్హే తన పదవికి రిజైన్ చేశారు. 17 నవంబర్ 2023 నాడు రిజైనింగ్ లెటర్‌ను కంపెనీకి అందించారు.
ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: ఓరియంటల్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) నుంచి రూ.7 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చింది. LHB SCN కోచ్‌ల కోసం 113 సెట్ల ‘సీట్లు & బెర్త్’లను ఉత్పత్తి చేసి, సరఫరా చేయాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 నాటికి సప్లై పూర్తి చేయాలి.
జెన్ టెక్నాలజీస్: జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు దాదాపు రూ. 42 కోట్ల (5.12 మిలియన్ డాలర్లు) విలువైన ఎగుమతి ఆర్డర్ లభించింది. రక్షణ రంగ ఎగుమతులను పెంచడానికి, రక్షణ ఉత్పత్తుల నికర ఎగుమతి దేశంగా మన దేశం ఆవిర్భవించాలని భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ ఆర్డర్ ప్రతిబింబిస్తుంది.
ధనలక్ష్మి బ్యాంక్: స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు ఈ బ్యాంక్ సమర్పించిన సమాచారం ప్రకారం, ధనలక్ష్మి బ్యాంక్ బోర్డులో అదనపు డైరెక్టర్‌గా నాగేశ్వరరావు చత్రాదిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించింది. జయకుమార్ యారాసి స్థానంలో ఆయన వచ్చారు. నవంబర్ 18, 2023 నుంచి నవంబర్ 17, 2025 వరకు, లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు, ఏది ముందైతే అంత వరకు అదనపు డైరెక్టర్‌గా నాగేశ్వరరావు కొనసాగుతారు.
హిందుస్థాన్ జింక్: రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ రేటింగ్స్ (CRISIL Ratings), హిందుస్థాన్ జింక్‌కు దీర్ఘకాల రేటింగ్ ‘CRISIL AAA/స్టేబుల్’ను కంటిన్యూ చేసింది. స్వల్పకాలిక రేటింగ్ ‘CRISIL A1+’ కూడా కొనసాగించింది. కంపెనీ జారీ చేసి నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్స్‌కు CRISIL A1+ రేటింగ్ వర్తిస్తుంది.
స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా: కంపెనీ డైరెక్టర్ల బోర్డు, మోహిత్ సాయి కుమార్ బండిని హోల్ టైమ్ డైరెక్టర్ హోదాలో అదనపు డైరెక్టర్‌గా నియమించింది. ఈ అపాయింట్‌మెంట్‌కు షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది.
ట్రైడెంట్: 2023 సెప్టెంబర్ క్వార్టర్‌లో, ట్రైడెంట్ లిమిటెడ్ రూ.90.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని మిగుల్చుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలోని లాభం రూ. 37.39 కోట్ల నుంచి ఇప్పుడు 141.50% పెరిగింది. కంపెనీ సేల్స్ Q2FY23లోని రూ.14,37.67 కోట్ల నుంచి Q2FY24లో 25% పెరిగి రూ.17,97.52 కోట్లకు చేరాయి. త్రైమాసికంలో బెడ్ లినెన్ & కో-జెన్ ప్రాజెక్టు నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైనట్లు కంపెనీ ప్రకటించింది. ట్రైడెంట్ నికర రుణం రూ. 11,960 మిలియన్లుగా ఉంది.
ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: Q2 FY24లో ఈ బ్యాంక్ నికర లాభం 143.35% పెరిగి రూ. 140.12 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 57.58 కోట్లుగా ఉంది. త్రైమాసిక నిర్వహణ లాభం 37.39% జంప్‌తో రూ. 289.65 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంలో నికర NPAలు 1.19%, స్థూల NPAలు 2.64%గా లెక్క తేలాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply