[ad_1]
Stock Market Closing 01 february 2023:
స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బడ్జెట్ ఆరంభానికి ముందే మార్కెట్లు ఎగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు గరిష్ఠాలను తాకాయి. ఐరోపా మార్కెట్లు తెరిచాక మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఫలితంగా సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 45 పాయింట్ల నష్టంతో 17,616 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 158 పాయింట్ల లాభంతో 59,708 వద్ద ముగిశాయి. ఐటీ షేర్లకు డిమాండ్ కనిపించింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,549 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,001 వద్ద మొదలైంది. 58,816 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,773 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 158 పాయింట్ల లాభంతో 59,708 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
మంగళవారం 17,662 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,811 వద్ద ఓపెనైంది. 17,735 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,972 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 45 పాయింట్ల నష్టంతో 17,616 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 41,115 వద్ద మొదలైంది. 39,490 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,015 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 142 పాయింట్లు తగ్గి 40,513 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 27 నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంకు, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, టాటాస్టీల్, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌టైన్‌మెంట్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల సూచీలు మాత్రమే ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
The National Stock Exchange of India (NSE) achieved two major global #milestones. For the fourth consecutive year, the #NSE has emerged as the largest #derivative exchange. In the #equity segment, the exchange has climbed up a rank to number 3 in 2022! @AshishChauhan @psubbaraman pic.twitter.com/qBSUcfCEYe
— NSE India (@NSEIndia) February 1, 2023
Assured returns don’t exist. Don’t fall for false promises of guaranteed returns.#SochKarSamajhKarInvestKar #AssuredReturns #NSE #NSEIndia #InvestorAwareness #StockMarket #StockMarketIndia #StockExchange @ashishchauhan @psubbaraman pic.twitter.com/4ULfAUvNOm
— NSE India (@NSEIndia) February 1, 2023
[ad_2]
Source link
Leave a Reply