ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీలో కోత, ఈ లిస్ట్‌లో మీ బ్యాంక్‌ ఉందేమో చూసుకోండి

[ad_1]

Fixed Deposit Rates Reduction: ప్రస్తుత వడ్డీ రేట్ల పెంపు సైకిల్‌లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా రెపో రేటు (RBI Repo Rate) ఇప్పుడు గరిష్ట స్థాయిలో ఉంది. దీనికి అనుగుణంగా కొంతకాలంగా బ్యాంకులు అటు లోన్‌ రేట్లను, ఇటు డిపాజిట్‌ రేట్లను పెంచాయి. ముఖ్యంగా, ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆకర్షించడానికి మంచి వడ్డీ రేట్లను ఆఫర్‌ చేశాయి. ఇప్పుడు, కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని తగ్గించడం ప్రారంభించాయి.

తాజాగా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంకులు… పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు            
యాక్సిస్ బ్యాంక్, తన సింగిల్ టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇంట్రెస్ట్‌ రేట్ల తగ్గింపు తర్వాత, 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాల వ్యవధి కలిగిన వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.10 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. అదే సమయంలో, 5 రోజుల నుంచి 13 నెలల వరకు కాల వ్యవధి ఉన్న డిపాజిట్ల మీద వడ్డీ రేటును 7.10 నుంచి 6.80 శాతానికి తగ్గించింది. 13 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య కాల వ్యవధి ఉన్న డిపాజిట్ల మీద వడ్డీని 7.15 శాతం నుంచి 7.10 శాతానికి కుదించింది. ఈ మార్పు 18 మే 2023 నుంచి అమల్లోకి వచ్చింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు           
PNB, జూన్ 1 నుంచి, సింగిల్ టెన్యూర్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించింది. రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లకు ఈ కోత పెట్టింది. 1 సంవత్సరం కాల వ్యవధిపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ 5 బేసిస్‌ పాయింట్లు తగ్గి 6.75 శాతానికి చేరుకుంది. ఈ FD రేటును సాధారణ పౌరుల (60 ఏళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న వాళ్లు) కోసం నిర్ణయించింది. 666 రోజుల టర్మ్‌ డిపాజిట్‌ మీద వడ్డీని 7.25 శాతం నుంచి 7.05 శాతానికి తగ్గించింది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు          
2022 నవంబర్‌ నుంచి, జనరల్ పబ్లిక్‌కు అత్యధికంగా 7.30 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.80 శాతం, సూపర్ సీనియర్‌ సిటిజన్లకు 8.05 శాతం వడ్డీని ఈ బ్యాంక్‌ చెల్లించింది. ఇప్పుడు ఆ రేట్లలో 0.30 శాతం లేదా 30 బేసిస్‌ పాయింట్లు కోత పెట్టింది. బ్యాంక్‌ వెబ్‌సైట్ ప్రకారం, సాధారణ పౌరులకు గరిష్టంగా 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని ఇప్పుడు అందిస్తోంది.

పైన చెప్పుకున్న మెచ్యూరిటీ టైమ్‌ల కోసం, ఆ బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడి పెట్టాలని మీరు భావిస్తే, మీకు మునుపటి కంటే తక్కువ వడ్డీ లభిస్తుంది. అయితే, ఈ కాల వ్యవధులు కాకుండా ఇతర టర్మ్‌ డిపాజిట్‌ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడితే, పాత రేట్ల ప్రకారం వడ్డీ వస్తుంది.

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: ఐసీఐసీఐ బ్యాంక్‌ హోమ్‌ లోన్‌ కావాలా, మీ కోసమే ఈ గుడ్‌న్యూస్‌

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *