లాకర్‌ ఇవ్వడానికి ఏ బ్యాంక్‌ ఎంత ఛార్జ్‌ చేస్తోంది?

[ad_1]

Bank Locker Charges: ఇంటి బీరువా కంటే బ్యాంక్ లాకర్‌ పదిలం. ముఖ్యమైన & విలువైన వస్తువులు, పేపర్లు, ఇతర అసెట్స్‌ను దాచుకోవడానికి సెక్యూర్డ్‌ ప్లేసెస్‌ అవి. ఏదైనా బ్యాంక్‌లో లాకర్‌ను అద్దెకు తీసుకోవాలంటే, ఏడాదికి కొంత డబ్బును అద్దె/నిర్వహణ ఛార్జ్‌ కింద బ్యాంకులకు చెల్లించాలి. ఒకవేళ మీకు కూడా లాకర్‌ కావాలంటే, ఏ బ్యాంక్‌ ఎంత ఫీజ్‌ వసూలు చేస్తోందో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, యెస్ బ్యాంక్‌ వెబ్‌సైట్స్‌ ప్రకారం, అవి వసూలు చేసే లాకర్ ఫీజుల వివరాలు ఇవి:

SBI బ్యాంక్‌ లాకర్‌ ఛార్జెస్‌
SBI లాకర్ల ఏడాది అద్దె మొత్తం, లాకర్ సైజ్‌ & లొకేషన్‌ మీద ఆధారపడి ఉంటుంది. పట్టణ (urban) & మెట్రో వినియోగదార్లకు ‘స్మాల్‌ సైజ్‌’ లాకర్ల కోసం బ్యాంక్ రూ. 1500+GST వసూలు చేస్తోంది. గ్రామీణ (rural) & సెమీ-అర్బన్ కస్టమర్ల దగ్గర రూ. 1000+GST ఛార్జ్‌ చేస్తోంది. అర్బన్ & మెట్రో క్లయింట్‌లు ‘మీడియం సైజ్‌’ లాకర్‌ తీసుకోవాలంటే రూ. 3000+GST చెల్లించాలి. సేమ్‌ సైజ్‌ లాకర్‌ కోసం గ్రామీణ & సెమీ-అర్బన్ కస్టమర్లు రూ. 2000+GST చెల్లించాలి.

HDFC బ్యాంక్ లాకర్‌ ఛార్జెస్‌
HDFC బ్యాంక్, వివిధ రకాల అవసరాల కోసం వివిధ సైజుల్లో లాకర్లను అందిస్తోంది. లాకర్ల ఏడాది అద్దె ధర లాకర్‌ సైజ్‌, డిమాండ్‌, బ్రాంచ్‌ లొకేషన్‌ను బట్టి మారుతుంది. ఈ బ్యాంక్‌లో లాకర్ యాన్యువల్‌ రేట్లు రూ. 1350 నుంచి రూ. 20,000 వరకు ఉన్నాయి. సాధారణంగా, నగరాలు & మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో  మీడియం సైజ్‌ లాకర్లకు రూ. 3,000, లార్జ్‌ సైజ్‌ లాకర్లకు రూ. 7000, ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్‌ లాకర్లకు రూ. 15,000 వరకు ఈ బ్యాంక్‌ వసూలు చేస్తోంది.

ICICI బ్యాంక్ లాకర్‌ ఛార్జెస్‌
ICICI బ్యాంక్ కూడా వివిధ పరిమాణాల్లో లాకర్లు అందిస్తోంది, పరిమాణానికి తగ్గట్లుగా డబ్బులు తీసుకుంటోంది. స్మాల్‌ కెపాసిటీ లాకర్ల కోసం ఈ బ్యాంక్‌ రూ. 1,200 నుండి రూ. 5,000 వరకు వసూలు చేస్తోంది. మీడియం సైజ్‌ లాకర్లకు రూ. 2,500 నుంచి రూ. 9,000 వరకు, పెద్ద లాకర్లకు రూ. 4,000 నుంచి రూ. 15,000 వరకు వసూలు చేస్తోంది.

యెస్ బ్యాంక్ లాకర్‌ ఛార్జెస్‌
యెస్ బ్యాంక్ యాన్యువల్‌ లాకర్‌ ఛార్జెస్‌ రూ. 4,500 నుంచి రూ. 32000 వరకు ఉన్నాయి. చిన్న లాకర్ల కోసం ఏడాదికి రూ. 4,500 వరకు, మధ్య స్థాయి (మీడియం) లాకర్లకు రూ. 10,000 వరకు, పెద్ద లాకర్లకు (లార్జ్‌) రూ. 20,000 వరకు, ఇంకా పెద్ద (ఎక్స్‌ట్రా లార్జ్‌) లాకర్లకు రూ. 32,000 వరకు ఏడాది అద్దె రూపంలో వసూలు చేస్తోంది.

కెనరా బ్యాంక్ లాకర్‌ ఛార్జెస్‌
కెనరా బ్యాంక్‌లో లాకర్‌ తీసుకోవాలంటే, వన్-టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసం కస్టమర్లు రూ. 400 + GSTని చెల్లించాలి. ఒక ఏడాదిలో మొదటి 12 లాకర్‌ ఆపరేషన్లు ఉచితం. ఆ తర్వాత ఒక్కో ఆపరేషన్‌కి రూ. 100 + GSTని ఖాతాదార్లు కట్టాలి. దీంతోపాటు యాన్యువల్‌ ఛార్జెస్‌ కూడా వసూలు చేస్తోంది. చిన్న లాకర్ల కోసం ఏడాదికి రూ. 2,000 వరకు, మధ్య స్థాయి లాకర్లకు రూ. 4,000 వరకు, పెద్ద లాకర్లకు రూ. 7,000 వరకు, ఇంకా పెద్ద లాకర్లకు రూ. 12,000 వరకు పే చేయాల్సి ఉంటుంది.

మరో ఆసక్తికర కథనం: మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ అంటే ఇవి, ₹10 వేలు ₹10 లక్షలయ్యాయ్‌! 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *