వివిధ బ్యాంకుల్లో హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు ఇవి, కొన్నిచోట్ల ప్రాసెసింగ్‌ ఫీజ్‌ కూడా లేదు

[ad_1]

Best home loan rates in various banks in india: కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయడం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పెద్ద పండుగ. ఇల్లు చిన్నదైనా/పెద్దదైనా, సొంత ఇంట్లో ‍‌(Own House) నివశించే దర్జానే వేరు. ఇల్లు ఎంత విశాలంగా, ఆధునికంగా ఉన్నా.. అద్దె ఇల్లు అద్దె ఇల్లే. కాబట్టి, ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని తాపత్రయపడతాడు. కొందరు, రుణ భారం లేకుండానే ఇంటిని సొంతం చేసుకుంటే, మరికొందరికి అప్పు (Housing Loan) చేయక తప్పదు. అప్పుడు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల దగ్గరకో, బ్యాంక్‌ చెంతకో చేరాల్సి వస్తుంది.   

హోమ్‌ లోన్‌ (home loan) అనేది, ఒక వ్యక్తి తన జీవితంలో తీసుకునే అతి పెద్ద రుణం కావచ్చు. అమౌంట్‌తో (Loan Amount) పాటు, అప్పు తీర్చే సమయం (Loan Tenure) కూడా ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి లాంగ్‌టర్మ్‌ లోన్ల విషయంలో, అప్పు తీసుకున్న డబ్బు కంటే రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, హోమ్‌ లోన్‌ విషయంలో కీలకమైన విషయం వడ్డీ రేటు ‍‌(home loan interest rate). ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీకి గృహ రుణం దొరికితే, అది బెస్ట్‌ హోమ్‌ లోన్‌ రేట్‌ (Best home loan rate) అవుతుంది.    

దేశంలోని కొన్ని బ్యాంకులు గృహ రుణంపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు:       

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ——– 8.30-10.75% ——–   2023 డిసెంబర్‌ 31 వరకు ప్రాసెసింగ్‌ ఫీజ్‌ రద్దు
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ——— 8.40-10.60%  ——–   ప్రాసెసింగ్‌ ఫీజ్‌ లేదు
కెనరా బ్యాంక్‌ ——– 8.40-11.25%   ——–   2023 డిసెంబర్‌ 31 వరకు ప్రాసెసింగ్‌ ఫీజ్‌ రద్దు
ఇండియన్‌ బ్యాంక్‌ ——— 8.40-10.20%  ——–   ప్రాసెసింగ్‌ ఫీజ్‌ 0.25% వరకు
ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ——— 8.40-9.55%   ——–   ప్రాసెసింగ్‌ ఫీజ్‌ 0.50% వరకు (గరిష్టంగా రూ.25 వేలు) + GST
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ———— 8.40-10.80%   ———-   ప్రాసెసింగ్‌ ఫీజ్‌ 0.50% (గరిష్టంగా రూ.5 వేలు) + GST
IDBI బ్యాంక్‌ ———- 8.45-12.25%   ———   ప్రాసెసింగ్‌ ఫీజ్‌ రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు
UCO బ్యాంక్‌ ——— 8.45-12.60%   ———   ప్రాసెసింగ్‌ ఫీజ్‌ 0.50% (కనిష్టం రూ.1,500, గరిష్టం రూ.15,000)
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ——- 8.50-10.10%   ——–   31 మార్చి 2024 వరకు ప్రాసెసింగ్‌ ఫీజ్‌ రద్దు
HDFC బ్యాంక్‌ ———  8.50-9.40%     ——–   ప్రాసెసింగ్‌ ఫీజ్‌ 0.50% లేదా రూ.3,000 (ఏది ఎక్కువయితే అది) + GST
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ———- 8.60-9.65%  ———   ప్రాసెసింగ్‌ ఫీజ్‌ 0.35% (కనిష్టం రూ.2 వేలు, గరిష్టం రూ.10 వేలు) + GST
యాక్సిస్‌ బ్యాంక్‌ ——— 8.70%  ——–   ప్రాసెసింగ్‌ ఫీజ్‌ 1% వరకు ‍‌(కనీసం రూ.10 వేలు) + GST

నోట్‌: 09 నవంబర్‌ 2023 వరకు ఆయా బ్యాంక్‌ల అధికారిక వెబ్‌సైట్లలో ఉన్న సమాచారం ఇది.           

మరో ఆసక్తికర కథనం: డేంజర్‌ బెల్స్‌, అలా జరిగితే స్టాక్‌ మార్కెట్‌లో మహా పతనం, ముందుంది మొసళ్ల పండుగ!           

Join Us on Telegram: https://t.me/abpdesamofficial           

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *