వివేక కేసులో బిగ్‌ డే- ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఇష్యూస్‌తో నేటి హెడ్‌లైన్స్‌

[ad_1]

Top Headlines Today:

బీఆర్‌ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ కీలక భేటీ 

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణభవన్‌లో జరిగే పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు ఇతర కీలక నేతలు సుమారు 300 మంది పాల్గొంటారు. 

పార్టీ ఆవిర్భావం నుంచి చేసిన పోరాటాలు, పాలన ఒక్కైతే ఇకపై ప్రయాణం మరింత శక్తిమంతంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన వేళ చేపట్టాల్సిన కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలను వారితో చర్చించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించనున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి కౌంటర్ అటాక్ ఎలా చేయాలనే విషయాలపై దిశానిర్దేశం చేయనున్నారు. 

వివేక కేసులో నేడు బిగ్‌ డే

వివేక హత్య కేసులో మరో బిగ్‌ డే అని చెప్పవచ్చు. ఓవైపు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. మరోవైపు ఇదే కేసులో వివేక ముఖ్య అనుచరుడిగా చెప్పుకుంటున్న ఇనాయ్‌తుల్లాను ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాష్ రెడ్డిని సీబీఐ మళ్లీ విచారణకు పిలిచింది. ఇంకోవైపు ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దుపై కూడా వాదనలు పూర్తయ్యాయి. తీర్పు ఇవాళ రానుంది. 

ఐపీఎల్‌లో నేడు

ఐపీఎల్‌ 2023లో నేడు 37వ మ్యాచ్‌ జరుగుతోంది. టేబుల్‌ టాపర్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (RR vs CSK) ఢీ కొట్టబోతున్నాయి.  సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన రాయల్స్‌ మళ్లీ విన్నింగ్‌ మూమెంటమ్‌ అందుకోవాలని పట్టుదలతో ఉంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!!

బ్యాటింగే ధోనీసేన బలం!

మొదటి రెండు మ్యాచులు చూస్తే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings)  ఏం ఆడుతుందో అనిపించింది! సీజన్‌ సగం ముగిసే సరికి తిరగులేని పొజిషన్లో నిలిచింది. ఇందుకు ఒకే ఒక్క రీజన్‌ సీఎస్కే బ్యాటింగ్‌ యూనిట్‌. బలహీనమైన తమ బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌పై ఒత్తిడి లేకుండా పెద్ద టోటల్స్‌ చేస్తున్నారు. సాధారణంగా నెమ్మదిగా పరుగుల వేట ఆరభించే ధోనీసేన.. ఈసారి మెరుపులు మెరిపిస్తోంది. రుతురాజ్‌ గైక్వాడ్‌, డేవాన్‌ కాన్వే అదరగొడుతున్నారు. కాన్వే అయితే డిస్ట్రక్టివ్‌గా ఆడుతున్నాడు. అజింక్య రహానె వీర బాదుడు బాదడం ప్రెజర్‌ తగ్గిస్తోంది. మిడిలార్డర్లో శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా బాగా ఆడుతున్నారు. అంబటి రాయుడు, ధోనీ గురించి తెలిసిందే. బౌలింగ్‌ పరంగా ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి. బెన్‌స్టోక్స్‌, దీపక్‌ చాహర్‌ అందుబాటులో లేరు. ప్రత్యర్థుల ముందు భారీ లక్ష్యాలు ఉండటం… ధోనీ వ్యూహాలతో ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నారు. నెమ్మది పిచ్‌లుండే జైపుర్‌లో సీఎస్కే బ్యాటింగ్‌ ఎలా ఉంటుందో చూడాలి.

ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ ఏదీ!

సీజన్‌ స్టార్టింగ్‌ నుంచి అదరగొడుతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) విన్నింగ్‌ మూమెంటమ్‌ కోల్పోయింది. అందుకే సీఎస్కేపై గెలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. జోష్ బట్లర్‌ కాస్త నెమ్మదించాడు. మళ్లీ ఫామ్‌ చూపించాలి. యశస్వీ జైశ్వాల్‌ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. దేవదత్‌ పడిక్కల్‌ లయ అందుకున్నాడు. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) గురించి తెలిసిందే. నిలబడితే ఎలాంటి టార్గెట్‌ అయినా ఛేదించగలడు. కొన్ని సార్లు తడబడుతున్నాడు. హెట్‌మైయర్‌ పోరాడుతున్నాడు. ధ్రువ్‌ జోరెల్‌ ఫర్వాలేదు. రవిచంద్రన్ అశ్విన్‌ సైతం మంచి ఇంటెంట్‌ చూపిస్తున్నాడు. అయితే భారీ హిట్స్‌ కొట్టగల జేసన్ హోల్డర్‌కు ఎక్కువ పని అప్పగించడం లేదు. స్పెషలిస్టు బౌలర్‌గానే చూస్తున్నారు. స్లో పిచ్‌ ఉంటుంది కాబట్టి ఆడమ్‌ జంపా జట్టులోకి రావొచ్చు. ట్రెంట్‌ బౌల్ట్‌, సందీప్‌ శర్మ పేస్‌ బౌలింగ్‌ అద్భుతం. యూజీ, యాష్‌ స్పిన్‌ గురించి తెలిసిందే. కానీ ఆరో బౌలర్‌ గురించి పట్టించుకోకపోవడం మున్ముందు ఇబ్బంది పెట్టొచ్చు.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: HUL, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, విప్రో, LTIMindtree, టెక్ మహీంద్ర, లారస్ ల్యాబ్స్. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.

SBI లైఫ్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ లైఫ్ రూ. 777 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 672 కోట్లతో పోలిస్తే ప్రస్తుత లాభం 15% ఎక్కువ.

బజాజ్ ఫైనాన్స్: 2022-23 నాలుగో త్రైమాసికానికి రూ. 3,158 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 2,419 కోట్లతో పోలిస్తే 30% ఎక్కువ.

HDFC లైఫ్: జనవరి-మార్చి కాలానికి HDFC లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 359 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 357 కోట్లతో పోలిస్తే లాభం వృద్ధి ఫ్లాట్‌గా ఉంది.

L&T టెక్: IT సేవల సంస్థ L&T టెక్, మార్చి 2023తో ముగిసిన త్రైమాసికంలో, తన నికర లాభంలో 22% వృద్ధితో రూ. 1,170 కోట్లకు నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం రూ. 8,014 కోట్లకు చేరుకుంది, ఇది కూడా సంవత్సరానికి 22% వృద్ధి.

ఒరాకిల్ ఫైనాన్షియల్: FY23 నాలుగో త్రైమాసికంలో రూ. 479 కోట్ల నికర లాభాన్ని కంపెనీ నివేదించగా, కార్యకలాపాల ద్వారా రూ. 1,470 కోట్ల ఆదాయం వచ్చింది.

సిటీ యూనియన్ బ్యాంక్: మూడు సంవత్సరాల కాలానికి సిటీ యూనియన్ బ్యాంక్ MD & CEOగా ఎన్‌.కామకోడిని పునర్నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదించింది. ఈ నియామకం మే 1 నుంచి అమల్లోకి వస్తుంది.

సింధు టవర్స్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఒరాకిల్ ఫైనాన్షియల్ రూ. 1,399 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 6,752 కోట్లుగా ఉంది.

షాపర్స్ స్టాప్‌: మార్చి త్రైమాసికంలో షాపర్స్ స్టాప్ నికర లాభం రూ. 14.3 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ. 15.9 కోట్ల నష్టంలో ఉంది. Q4FY23లో ఆదాయం 30% పెరిగి రూ. 924 కోట్లకు చేరుకుంది.

సింజీన్ ఇంటర్నేషనల్‌: సింజీన్ ఇంటర్నేషనల్ రూ. 179 కోట్ల నికర లాభాన్ని, రూ. 995 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

ఓల్టాస్: జనవరి-మార్చి కాలానికి ఓల్టాస్ రూ. 143 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయం రూ. 2,957 కోట్లు వచ్చింది.

RVNL: రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌ (RVNL)కి “నవరత్న హోదా”ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

ఆనంద్ మోహన్ విడుదల

మాజీ ఎంపీ, బాహుబలి ఆనంద్ మోహన్ (ఆనంద్ మోహన్) ఈ రోజు (ఏప్రిల్ 27) విడుదల అయ్యారు. కుమారుడి నిశ్చితార్థం సందర్భంగా 15 రోజుల పెరోల్ పై బయటకు వచ్చారు. ఆనంద్ మోహన్ విడుదలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. గోపాల్ గంజ్ డీఎం జి.కృష్ణయ్య హత్య కేసులో ఆనంద్ మోహన్ దోషిగా తేలారు. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *