Health Care: ఈ ఆహారం తింటే.. 40 తర్వాత కూడా ఫిట్‌గా ఉంటారు..!​

[ad_1]

ఫైబర్‌ రిచ్ ఫుడ్స్‌ తినండి..

ఫైబర్‌ రిచ్ ఫుడ్స్‌ తినండి..

గట్‌ను ఆరోగ్యంగా ఉంచుకుంటే.. వయస్సు పెరిగే కొద్దీ మీరు హెల్తీగా, ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుందని నేచర్‌ రివ్యూస్‌ అధ్యయనం స్పష్టం చేసింది. వయస్సు పెరిగే కొద్దీ.. జీర్ణవ్యవస్థ బలహీనపడుతూ వస్తుంది. దీని కారణంగా కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ట్రిక్‌, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఫైబర్‌ సమృద్ధిగా ఉండే ఆహారలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ డైట్‌లో పండ్లు, కూరగాయలు, విత్తనాలు, దంపుడు బియ్యం, బార్లీ, ఓట్స్‌, విత్తనాలు, పండ్లు, పప్పుధాన్యాలు చేర్చుకోండి.

(image source – pixbay)

యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్..

యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్..

నలభై ఏళ్లు దాటిన తర్వాత వృద్ధాప్యం, రోగనిరోధక శక్తి బలహీనపడుతూ వస్తుంది. దీని కారణంగా శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ పెరుగుతూ వస్తుంది. శరీరంలో వాపు కారణంగా కీళ్లు నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను దూరం చేయడానికి మీ డైట్‌లో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉండే పసుపు, గ్రీన్‌ టీ, క్యాప్సికమ్‌, తాజా పండ్లు, బెర్రీస్‌ను చేర్చుకోండి.​

spirulina Health Benefits: ఈ నాచు తింటే.. షుగర్‌, హైబీపీ కంట్రోల్‌ ఉంటాయి..!

ప్రొటీన్‌ రిచ్‌ ఫుడ్స్‌..

ప్రొటీన్‌ రిచ్‌ ఫుడ్స్‌..

కండరాల బలహీనత కారణంగా, శరీరం బలం కోల్పోవచ్చు. శరీరంలో కండరాలను దృఢంగా ఉంచడానికి, వాటిని రిపేర్‌ చేయడానికి ప్రొటీన్‌ సహాయపడతుంది. మీ వయస్సు 40 దాటిన తర్వాత డైట్‌లో ప్రొటీన్‌ సమృద్ధిగా ఉండే.. చికెన్‌, టోఫు, సోయాబీన్, పప్పులు, గుమ్మడి గింజలు, గుడ్లు కచ్చితంగా చేర్చుకోవాలి. ఈ డైట్‌ తీసుకుంటే.. 40 లోనూ యవ్వనంగా ఉంటారు.

(image source – pixbay)

హెల్తీ ఫ్యాట్స్‌ తీసుకోండి..

హెల్తీ ఫ్యాట్స్‌ తీసుకోండి..

మీ చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా అవసరం. హెల్తీ ఫ్యాట్స్‌ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సమస్యలు రాకుండా రక్షిస్తుంది. మీ డైట్‌లో అవకాడో, ఆలివ్, నట్స్, గింజలు, చేప నూనె, సాల్మన్‌ వంటి ఆహారం చేర్చుకోండి. వీటిలో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి.

(image source – pixbay)

క్యాలరీలు తక్కువగా తీసుకోండి..

క్యాలరీలు తక్కువగా తీసుకోండి..

వయస్సు పెరిగే కొద్ది.. శరీరంలో కొవ్వు పెరుగుతుంది, తర్వగా బరువు పెరుగుతారు. శరీరంలో కొవ్వు పెరిగితే అనేక ప్రమాదకరమైన వ్యాధుల ముప్పు పెరుగుతుంది. కొవ్వును కంట్రోల్‌లో ఉంచడానికి ఎక్కువగా తినడం మానుకోవాలి, క్యాలరీలు తక్కువగా తీసుకోవాలి. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోకూడదు.

(image source – pixbay)​

Arthritis diet chart: అర్థరైటిస్‌ నొప్పిని తగ్గించే.. ఆహారం ఇదే..!
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *