PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

BBC పై ఆదాయపు పున్ను శాఖ సర్వేలో అధికారులు ఏం తేల్చారంటే..


అరవై గంటలపాటు సాగిన సర్వే:

ఢిల్లీ, ముంబై లోని BBC కార్యాలయాల్లో ఆదాయపు పన్ను విభాగం అధికారులు దాదాపు 60 గంటలపాటు సర్వే నిర్వహించారు. మంగళవారం నుంచి మొదలైన ఈ కార్యక్రమం మూడు రోజులపాటు కొనసాగినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) ప్రతినిధి వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ లో కొన్ని అక్రమ చెల్లింపులను గుర్తించినట్లు శుక్రవారం పేర్కొన్నారు.

 ఆదాయ వ్యయాలు సరిపోలడం లే:

ఆదాయ వ్యయాలు సరిపోలడం లే:

డిజిటల్, పేపర్ రూపంలో ఆధారాలు లభించినట్లు CBDT అధికారులు ప్రకటించారు. ఉద్యోగుల స్టేట్‌ మెంట్‌ లనూ రికార్డు చేసినట్లు చెప్పారు. దేశంలో ఆ సంస్థ కార్యకలాపాలను ఆదాయ, వ్యయాలతో పోల్చిచూస్తే సరిపోలడం లేదని వెల్లడించారు. బదిలీ ధర డాక్యుమెంటేషన్ లోనూ పలు వ్యత్యాసాలు కనుగొన్నట్లు తెలిపారు.

నిజాలను నిర్భయంగా వెలికితీస్తాం:

నిజాలను నిర్భయంగా వెలికితీస్తాం:

సర్వే పూర్తయిన అనంతరం BBC సైతం ఓ ప్రకటనను విడుదల చేసింది. తాము అధికారులకు పూర్తిగా సహకరించామని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని పేర్కొంది. తమది ఓ స్వతంత్ర, విశ్వసనీయమైన మీడియా సంస్థ అని గుర్తుచేసింది. నిజాలను నిర్భయంగా వెలికితీయడంలో పాత్రికేయులకు అండగా ఉంటామని ప్రకటించింది.

సర్వే vs రైడ్ :

సర్వే vs రైడ్ :

సర్వేకు, రైడ్‌ కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సంబంధిత శాఖ అనుమానించవచ్చు. ఆదాయానికి తగినంత పన్ను చెల్లించడం లేదని భావించవచ్చు. ఈ సందర్భంలో ఆయా వ్యక్తి/సంస్థను తనిఖీ చేసే అధికారం IT ప్రతినిధులకు ఉంటుంది. కానీ రైడ్ చేయాలంటే తప్పనిసరిగా పక్కా ఆధారాలు ఉండి తీరాల్సిందే. ప్రక్రియ పూర్తయిన అనంతరం అనుమానితుల నుంచి వ్రాతపూర్వక స్టేట్ మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *