[ad_1]
కొన్ని యోగాసనాలు ఎముక సాంద్రతను, బలాన్ని పెంచుతాయి. సమతుల్యత, భంగిమను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఈ యోగాసనాలు ఎముకలపై ఒత్తిడిని తీసుకువచ్చి.. కొత్త ఎముక కణాలను నిర్మించడానికి, ఇప్పటికే ఉన్న వాటిని బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఈ యోగాసనాలు, మహిళలలో ఎముకల బలానికి అవసరమైన.. ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తాయి.
త్రికోణాసనం..
త్రికోణాసనం ప్రాక్టిస్ చేస్తే కాళ్లు, పిరుదులు, వీపు, ఛాతీ బలపడతాయి.. బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ మెరుగుపడుతుంది. త్రికోణాసనం కాళ్లను సాగదీసి బలపరుస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఇలా వేయండి..
ముందుగా పాదాలను వీలైనంత దూరంగా పెట్టి, తిన్నగా నిలబడాలి. చేతులను రెండు వైపులకు తిన్నగా చాచాలి. నడుమును పక్కకు వంచి.. ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని తాకాలి. కుడి చేతిని పైకి తిన్నగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి కుడి చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. తర్వాత నడుమును పక్కకు వంచుతూ కుడి చేత్తో కుడి పాదాన్ని తాకాలి. ఎడమ చేయిని పైకి తిన్నగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి ఎడమ చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి.
ఉత్కటాసనం..
ఈ భంగిమ తొడలు, పిరుదుల ఎముకలను బలపరుస్తుంది. సమతుల్యత, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఉత్కటాసనం కోర్ కండరాలను దృఢంగా ఉంచుతుంది. శరీరం భంగిమను మెరుగుపరుస్తుంది.
ఇలా వేయండి..
ఈ ఆసనం వేయడానికి ముందుగా రెండు పాదాలను దగ్గరగా పెట్టి నిలబడాలి. పొట్ట నిండా శ్వాస తీసుకుని.. రిలాక్స్ అవ్వాలి. తర్వాత రెండు కాళ్లను మోకాళ్ల దగ్గర మడిచి నెమ్మదిగా శరీరాన్ని కిందకు తీసుకొస్తూ కుర్చీ లెవల్‌కు తీసుకురావాలి. రెండు చేతులను నేలవైపు చూపిస్తూ మధ్యవేళ్లతో నేలను తాకాలి. తర్వాత రెండు చేతులను పూర్తిగా ఆకాశంవైపు లేపుతూ అరచేతులను నమస్కారం చేస్తున్నట్లు ఉంచాలి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. తొడలు కుర్చీ ఆకారంలో సమాన స్థితిలో ఉండాలి. పాదాలు విడిపోకూడదు. మీకు ఎంతసేపు వీలైతే.. అంతసేపు ఈ భంగిమలో ఉండవచ్చు.
సేతుబంధాసనం..
సేతుబంధసనం వీపు, తొడలు, పిరుదల ఎముకలను బలపరుస్తుంది. వెన్నెముక వశ్యతను మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం ప్రాక్టిస్ చేస్తే.. ఒత్తిడి తగ్గుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
ఇలా వేయండి..
నేలపై వెల్లకిలా పడుకోవాలి. మోకాళ్లను వంచాలి. పాదాలు నేలపై ఆనించాలి. చేతులు రిలాక్స్‌డ్‌గా నేలను ఆన్చండి. ఇప్పుడు గట్టిగా శ్వాస తీసుకుని.. వీపు భాగాన్ని పైకి లేపాలి. శరీర బరువు మొత్తం పాదాలు, భుజాలపై ఉంచండి. చేతులు రెండింటిని ఒకదానితో ఒకటి పట్టుకోవాలి. ఎంతసేపు వీలైతే అంత సేపు ఈ భంగిమలో ఉండవచ్చు శ్వాసను నెమ్మదిగా వదలడం, తీసుకోవడం చేస్తుండాలి. తరువాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి.
వృక్షాసనం..
వృక్షాసనం శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. కాళ్లు, పాదల ఎముకలను బలపరుస్తుంది. తుంటి కదలకను మెరుగుపరుస్తుంది. వృక్షాసనం ప్రాక్టిస్ చేస్తే.. వెన్నెముక బలపడుతుంది, లోపలి తొడలు, ఛాతీని కూడా సాగదీస్తుంది.
ఇలా వేయండి..
కాళ్ల మధ్య రెండు అంగలాల దూరంతో నిలబడాలి. ఎదురుగో ఒక వస్తువుపై మీ దృష్టి ఉంచండి. గాలని బిగబట్టి కుడికాలి పాదాన్ని ఎడమ కాలి తొడపై ఉంటాలి. గాలిని వదులుతూ రెండు చేతులను పైకి గాల్లోకి నమస్కార ముద్రలో లేపాలి. 10-30 సెకన్ల పాటు ఇలా ఉంటూ సాధారణ స్థితిలో గాలిని పీల్చుకోవాలి. ఆ తర్వాత నమ్మెదిగా గాలి వదులుతూ.. చేతులు కిందకు దించాలి. ఆ తర్వాత పాదలను కూడా యాదాస్థితికి తీసుకురాలలి. ఈ విధంగా ఎడమ కాలితోనూ చేయాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు
[ad_2]
Source link
Leave a Reply