PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

health tips: అంజీరపండ్లలో ఫుల్ పోషకాలు.. తింటే దరిచేరవు డయాబెటిస్, బీపీ వంటి రోగాలు!!

[ad_1]

అంజీర పండ్లలో బోలెడన్ని పోషకాలు

అంజీర పండ్లలో బోలెడన్ని పోషకాలు

అంజీర పండ్లలో విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటితోపాటు కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కూడా ఉంటాయి. దీని వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. ఉదయం లేచిన వెంటనే అంజీర పండ్లు తినడంవల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి, మనం చురుగ్గా పని చేయడానికి కావలసిన శక్తిని అంజీర పండ్లు ఇస్తాయి.

అంజీర పండ్లు తింటే బరువు తగ్గటంతో పాటు చెడు కొలెస్ట్రాల్ మాయం

అంజీర పండ్లు తింటే బరువు తగ్గటంతో పాటు చెడు కొలెస్ట్రాల్ మాయం

అంజీర పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు అంజీర పండ్లలో పుష్కలంగా ఉంటాయి. అంజీర పండ్లు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. విరోచనం సాఫీగా అయ్యేలా చేస్తాయి .అంజీర పండ్ల వల్ల మూలశంక వ్యాధి కూడా నయమవుతుందని చెబుతారు. అంజీర పండ్లు జీర్ణక్రియను మెరుగు పరచడంతో పాటు వేగంగా బరువు తగ్గడానికి, మన శరీరంలో కొవ్వు కరిగించటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మధుమేహ వ్యాధికి చెక్ పెట్టడంతో పాటు, రక్తపోటును తగ్గించడంలో అంజీర పండ్లు కీలకంగా పనిచేస్తాయి.

డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచే అంజీర పండ్లు

డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచే అంజీర పండ్లు

డయాబెటిస్ ఉన్నవారు అంజీర పండ్లను ప్రతిరోజూ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. అంజీర పండ్లలో ఉండే ఫైబర్, విటమిన్ ఈ, ఫ్యాటీ యాసిడ్లు డయాబెటిస్ కు అద్భుతంగా పనిచేస్తాయి. అవి డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడతాయి. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలతో గుండె సంబంధిత రోగాలకు అంజీర పండ్లు చెక్ పెడతాయి. అంజీర పండ్లు తీసుకోవడం వల్ల రుతుక్రమం మెరుగుపడుతుంది. అంజీర పండ్లు కిడ్నీ సమస్యలను తగ్గిస్తాయి.

సంతాన లేమితో ఉన్నవారికి మంచి ప్రయోజనం ఇచ్చే అంజీర పండ్లు

సంతాన లేమితో ఉన్నవారికి మంచి ప్రయోజనం ఇచ్చే అంజీర పండ్లు

సంతానలేమితో బాధపడే వారు రోజుకు ఒకటి, రెండు పండ్లు చొప్పున అంజీర పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతారు. క్షయ వ్యాధిని నివారించడానికి, ఆస్తమాను తగ్గించడానికి అంజీర పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కడుపునొప్పితో బాధపడేవారు, జ్వరంతో బాధపడేవారు అంజీర పండ్లు తింటే మంచి ఫలితం ఉంటుంది. నీటిలో నానబెట్టిన అంజీర పండ్లను ఉదయాన్నే తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. నీటిలో నానబెట్టిన అంజీర పండ్లను తినడంతో పాటు ఆ నీళ్లను కూడా తాగితే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

అంజీర పండ్లను తింటే రక్తహీనత తగ్గుతుంది

అంజీర పండ్లను తింటే రక్తహీనత తగ్గుతుంది

ఎండు అంజీర పండ్లు పాలు, చక్కెరతో కలిపి ఒక వారం రోజులపాటు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుందని చెబుతారు. అంజీర పండ్లు తినడం వల్ల వీర్యం వృద్ధి చెందుతుందని, మహిళలలో అండోత్పత్తి సంబంధమైన సమస్యలు తగ్గుతాయని చెబుతారు. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే అంజీర పండ్లు రోజుకి ఒకటి రెండు ఖచ్చితంగా తింటే మంచి జరుగుతుందని, శరీరం నిత్య ఉత్సాహంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆరోగ్యాన్ని కాపాడే అంజీర పండ్లను కూడా ఆహారంలో భాగంగా చేసుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

health tips: రోజూ ఒక యాపిల్ తినండి.. ఎన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చో చూడండి!!health tips: రోజూ ఒక యాపిల్ తినండి.. ఎన్ని రోగాలకు చెక్ పెట్టొచ్చో చూడండి!!

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *