[ad_1]
Cheapest Home Loan: 2023 ఫిబ్రవరి 8న, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెపో రేటును (RBI Repo Rate) 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెరుగుదల తర్వాత, చాలా బ్యాంకులు తమ గృహ రుణాలు, కార్ లోన్లు, వ్యక్తిగత రుణాలపై వడ్డీని పెంచాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును పెంచాయి.
మీరు ఇప్పుడు హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే, వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా, చౌకగా రుణాలు ఇచ్చే బ్యాంక్ ఏదో మీకు అర్ధం అవుతుంది, ఆ బ్యాంక్ నుంచి గృహ రుణం తీసుకోవచ్చు. ప్రస్తుతం, ఏ బ్యాంకు ఎంత వడ్డీకి హోమ్ లోన్ మంజూరు చేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ ఎంత? (SBI Home Loan Interest Rate)
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన SBI, నిధుల ఉపాంత వ్యయ ఆధారిత రుణ రేటును (MCLR) 0.10 శాతం & రెపో రేట్ లింక్డ్ లెండింగ్ రేటును 0.25 శాతం పెంచింది. అయితే… సిబిల్ స్కోర్ (CIBIL Score) ఆధారిత పథకం కింద తక్కువ వడ్డీకి ఈ బ్యాంక్ గృహ రుణం ఇస్తోంది. మీ CIBIL స్కోర్ 800 అయితే 8.85%, సిబిల్ స్కోర్ 700 – 749 మధ్య ఉంటే 8.95%, సిబిల్ స్కోర్ 550 – 649 మధ్య ఉంటే 9.65% శాతం వడ్డీకి లోన్ లభిస్తుంది.
HDFC బ్యాంక్ హోమ్ లోన్‌పై వడ్డీ ఎంత? (HDFC Bank Home Loan Interest Rate)
RBI రెపో రేటును పెంచడానికి ఒక రోజు ముందు, HDFC బ్యాంక్ తన రుణ వడ్డీని పెంచింది. ఎవరైనా రూ. 30 లక్షల వరకు రుణం తీసుకుంటే 9 శాతం నుంచి 9.50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది. ఇదే మొత్తాలకు మహిళల నుంచి 8.95 శాతం నుంచి 9.45 శాతం వరకు వడ్డీ తీసుకుంటోంది. రూ. 30 లక్షలు నుంచి 75 లక్షల వరకు ఉన్న మొత్తాలకు 9.25 నుంచి 9.75 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తోంది. ఇదే మొత్తాలకు మహిళల నుంచి 9.20 శాతం నుంచి 9.70 శాతం వరకు వడ్డీ తీసుకుంటోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్‌పై వడ్డీ ఎంత? (PNB Home Loan Interest Rate)
మ్యాక్స్ సేవర్ అనే స్కీమ్‌ను PNB అమలు చేస్తోంది. ఈ పథకం కింద గృహ రుణం తీసుకుంటే, 800 CIBIL స్కోర్ ఉన్నవారికి రూ. 30 లక్షల వరకు రుణంపై 8.80 శాతం వడ్డీకి గృహ రుణం అందిస్తోంది. CIBIL స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉన్న వారికి 9 శాతం వడ్డీ & 600 నుంచి 699 స్కోరు ఉన్నవారిక 9.35 శాతం వడ్డీ ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్‌పై వడ్డీ ఎంత? (BoB Home Loan Interest Rate)
ఈ బ్యాంక్ ఇటీవల తన MCLR రేటును పెంచింది. హోమ్ లోన్ మీద 8.90 శాతం నుంచి 10.50 శాతం వరకు వడ్డీని ఈ బ్యాంక్ వసూలు చేస్తోంది. ఇది ఉద్యోగస్తులకు వర్తిస్తుంది. జీతం ఆదాయం లేని వ్యక్తులకు వడ్డీ 8.95 శాతం నుండి 10.60 శాతం వరకు ఉంటుంది.
[ad_2]
Source link
Leave a Reply