[ad_1]
Adani Group Market Cap Crossed Rs.15 Lakh Crore: నూతన సంవత్సరంలో అదానీ గ్రూప్‌నకు బాగా కలిసొచ్చింది. ఈ రోజు (బుధవారం, 03 జనవరి 2024) అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు (Supreme Court verdict on Adani Group-Hindeburg Research case) ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత అదానీ గ్రూప్‌లోని అన్ని షేర్లు రాకెట్లుగా మారాయి. షేర్లలో విపరీతమైన ర్యాలీ కారణంగా, అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ ఈ రోజు రూ. 15 లక్షల కోట్లను దాటింది.
ఉదయం నుంచి ఉరకలేస్తున్న షేర్లు
అదానీ గ్రూప్ షేర్లు ఈ రోజు ఉదయం నుంచి ఉత్సాహాన్ని కనబరుస్తున్నాయి. అదానీకి చెందిన మొత్తం 10 లిస్టెడ్ కంపెనీ షేర్లు ఇవాళ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి, ఉదయం సెషన్‌లో దాదాపు 16 శాతం వరకు పెరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అన్ని షేర్లలో జోష్ కంటిన్యూ అయింది, పచ్చగా కనిపిస్తున్నాయి.
మధ్యాహ్నం ట్రేడింగ్‌లో, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దాదాపు 10 శాతం పెరిగింది. అదానీ టోటల్ గ్యాస్‌లో దాదాపు 7 శాతం పెరుగుదల కనిపించింది. NDTV షేర్ ప్రైస్ దాదాపు 5 శాతం ర్యాలీ చేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2 శాతం పైగా జంప్ చేసింది. అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్ 4 శాతం చొప్పున పెరిగాయి. అదానీ పోర్ట్స్, ACC, అంబుజా సిమెంట్ కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఈ రోజు ట్రేడింగ్‌లో, కొన్ని అదానీ కంపెనీల షేర్లు కొత్త 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు ఇది
అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కేసులో దర్యాప్తునకు సంబంధించిన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ రోజు ఏకకాలంలో తీర్పు చెప్పింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ నిర్వహిస్తున్న దర్యాప్తును సిట్ లేదా మరేదైనా దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ ఏదైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే, కేంద్ర ప్రభుత్వం & సెబీ దానిని పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాయని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
గౌతమ్ అదానీ రియాక్షన్ (Gautam Adani’s reaction after the Supreme Court verdict)
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ స్పందించారు. నిజం గెలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు నిరూపించదని, సత్యమేవ జయతే అంటూ X లో పోస్ట్ చేశారు. తనకు తోడుగా నిలిచినవారికి కృతజ్ఞతలు చెప్పారు. భారతదేశ అభివృద్ధికి అదానీ గ్రూప్ సహకారం కొనసాగుతుందని రాశారు.
The Hon’ble Supreme Court’s judgement shows that:
Truth has prevailed.
Satyameva Jayate.I am grateful to those who stood by us.
Our humble contribution to India’s growth story will continue.
Jai Hind.
— Gautam Adani (@gautam_adani) January 3, 2024
గత ఏడాది జనవరిలో, అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్, తన కంపెనీల షేర్ల ధరలను మోసపూరితంగా పెంచిందనేది ఆరోపణల్లో ఒకటి. హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత, SEBI విచారణ చేపట్టింది. దీనిని సుప్రీంకోర్టు పర్యవేక్షించింది.
మరో ఆసక్తికర కథనం: హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు, సెబీ చేతికే దర్యాప్తు, అదానీకి అతి పెద్ద ఊరట
[ad_2]
Source link