థైరాయిడ్‌ పేషెంట్స్‌.. వేసవి కాలంలో ఈ పండ్లు తింటే మంచిది..!

[ad_1]

​Fruits For Thyroid Patients: ఎండాకాలం మొదలైంది. సీజనల్‌ మార్పుల కారణంగా.. థైరాయిడ్‌ పేషెంట్స్‌ లక్షణాలు తీవ్రం అవుతాయి. వేసవిలో సహజంగా డీహైడ్రేషన్‌ ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవారిలో వేసవిలో అలసట, నిస్సత్తువ, డీహైడేషన్‌ వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వేసవి కాలంలో థైరాయిడ్‌ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి తీసుకోవలసిన పండ్లు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.

పైనాపిల్‌..

పైనాపిల్‌..

పైనాపిల్‌లో విటమిన్‌ బి, సి, మాంగనీస్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో ఉండే విటమిన్‌ బి మీ శరీరానికి శక్తిని అందిస్తుంది. దీనిలోని విటమిన్‌ సీ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కాల్షియం శోషణకు, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను నిర్వహించడానికి, నరాల పనితీరును మెరుగుపరచడానికి మాంగనీస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ పేషెంట్స్‌కు బలహీనత, అలసట సాధారణం. విటమిన్‌ బి అలసటను దూరం చేస్తుంది. పైనాపిల్‌లో ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్‌ లక్షణాలు తగ్గించడంలో సహాయపడతాయి. పైనాపిల్‌ను ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు. ఇది ప్రొటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం తర్వతా పైనాపిల్‌ తినవద్దు, భోజనానికి అరగంట ముందు తీసుకోవచ్చు.

100 గ్రాముల పైనాపిల్‌లో ఈ పోషకాలు ఉంటాయి..
కేలరీలు: 82 కిలో కేలరీలు
డైటరీ ఫైబర్: 2.3 గ్రా
కొవ్వు: 0.20 గ్రా
ప్రోటీన్: 0.89 గ్రా
పొటాషియం: 109 మి.గ్రా
కార్బోహైడ్రేట్లు: 13 గ్రా
విటమిన్ బి: 5%
విటమిన్ సి: 79%

ఆరెంజ్‌..

ఆరెంజ్‌..

ఆరెంజ్‌లో విటమిన్‌ సీ మెండుగా ఉంటుంది. హైపోథైరాయిడిజంతో బాధపడేవారు.. ఆరెంజ్‌ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్‌ సీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. శరీరంలో ఒత్తిడి హార్మోన్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఆందోళన, రక్తపోటు, డిప్రెషన్ వంటి సమస్యలను నివారిస్తుంది. మీ సలాడ్‌లో ఆరెంజ్‌ తీసుకోవచ్చు. ఆరెంజ్‌ను భోజనం తర్వాత.. అల్పాహారంగా తీసుకోవచ్చు.
100 గ్రాముల ఆరెంజ్‌లో ఈ పోషకాలు ఉంటాయి..
కేలరీలు – 147 కిలో కేలరీలు
ఫైబర్: 3 గ్రా
ప్రోటీన్: 1 గ్రా
చక్కెర: 12 గ్రా
విటమిన్ ఎ: 1%
విటమిన్ సి: 64%
కాల్షియం: 6.4 మి.గ్రా
పొటాషియం: 181 మి.గ్రా
నీరు: 84%

బెర్రీస్‌..

బెర్రీస్‌..

బ్లూ బెర్రీస్‌.. థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్ కంటెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఇది మెదడులోని ప్రోటీన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తి ప్రోత్సహించి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. బెర్రీస్‌లో ఎల్లాజిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి, క్యాన్సర్ కణాలను నియంత్రిస్తుంది. దీనిలోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు.. థైరాయిడ్‌ పేషెంట్స్‌కు మేలు చేస్తాయి. థైరాయిడ్ డిజార్డర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. థైరాయిడ్ ఉన్నవారు లంచ్ , డిన్నర్‌లో కొన్ని బెర్రీలను తీసుకోవచ్చు. స్నాక్స్‌గా కూడా తినవచ్చు.
100 గ్రాముల బెర్రీలలో ఈ పోషకాలు ఉంటాయి..
కేలరీలు: 43 కిలో కేలరీలు
విటమిన్ సి: 35%
మాంగనీస్: 32%
విటమిన్ K: 25%
రాగి: 8%
ఫోలేట్: 6% కలిగి ఉంటుంది.

(image source – pixabay)

ఆపిల్‌..

ఆపిల్‌..

యాపిల్ శరీరాన్ని డిటాక్స్‌ చేయడానికి సహాయపడుతుంది. యాపిల్‌లో విటమిన్‌ ఎ సమృద్ధిగా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ల సంశ్లేషణ, విడదలను నియంత్రిస్తుంది. యాపిల్స్‌‌లో ఉండే ఫైబర్ మిమ్మల్ని ఎక్కువ కాలం సంతృప్తిగా ఉంచుతుంది. బరువు పెరగకుండా ఉండటానికి సహాయపడుతుంది.

100 గ్రాముల యాపిల్‌లో ఈ పోషకాలు ఉంటాయి..

కేలరీలు: 52 కిలో కేలరీలు

కార్బోహైడ్రేట్లు: 13.8 గ్రా

ఫైబర్: 2.4 గ్రాములు

కొవ్వు: 0.2 గ్రాములు

ప్రోటీన్: 0.3 గ్రా

చక్కెర: 10.4 గ్రాములు

నీరు: 86%

విటమిన్ సి: 14% (రోజువారీ విలువ తీసుకోవడం)

విటమిన్ K: 5%

అరటిపండు..

అరటిపండు..

అరటిపండ్లు అన్ని సీజన్లలో లభిస్తాయి. అరటిపండ్లలో సెలీనియం మండుగా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ గ్రంధి పనితీరును మెరుగుపరుస్తుంది. సెలీనియంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అరటిపండ్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది. థైరాయిడ్ ఉన్నవారు రోజుకు మీడియం సైజులో ఉన్న 2 అరటిపండ్లు తినవచ్చు. ఇది మీకు రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుంది.

100 గ్రాముల అరటిపండులో ఈ పోషకాలు ఉంటాయి..

కేలరీలు: 89 kCal

కార్బోహైడ్రేట్లు: 22.84 గ్రా

డైటరీ ఫైబర్: 12.23 గ్రా

కొవ్వు: 0.33 గ్రా

ఫ్రక్టోజ్: 2.6 గ్రా

పొటాషియం: 358 గ్రా

ప్రోటీన్: 1.09 గ్రా

విటమిన్ బి: రోజువారీ విలువలో 4%

విటమిన్ సి: 8.04%

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *