యూపీఐ ద్వారా నగదు జమ, డెబిట్‌ కార్డ్‌తో పని లేదు

[ad_1]

UPI Cash Deposit Facility: ఇప్పటివరకు, UPI ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడం, బిల్లులు చెల్లించడం వంటివి చేశాం. ఇకపై, ATM కేంద్రం నుంచే యూపీఐ ద్వారా బ్యాంక్‌ అకౌండ్‌లో డబ్బులు డిపాజిట్‌ కూడా చేయవచ్చు. ఈ సౌకర్యం అతి త్వరలో అమల్లోకి రాబోతోంది. మన దేశంలో యూపీఐకి ఉన్న విస్తృత ఆదరణను దృష్టిలో పెట్టుకుని దాని పరిధిని విస్తరిస్తున్నారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das), శుక్రవారం, యూపీఐకి సంబంధించి ఈ ప్రకటన చేశారు. యూపీఐ సిస్టమ్ ద్వారా ఏటీఎం నుంచే అకౌండ్‌లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చని వెల్లడించారు. ఈ సదుపాయంతో కస్టమర్ల సౌలభ్యం పెరుగుతుందని అన్నారు. యూపీఐ వ్యవస్థ ద్వారా ఏటీఎం నుంచి అకౌంట్‌లో డబ్బు చేసే ఫెసిలిటీ వస్తే, ఇకపై డబ్బు జమ కోసం బ్యాంక్‌కు వెళ్లి క్యూలో నిలుచునే శ్రమ తప్పుతుంది, చాలా సమయం ఆదా అవుతుంది. 

బ్యాంక్‌కు వెళ్లకుండా, ఏటీఎం కేంద్రం నుంచే అకౌంట్‌లో డబ్బు జమ చేసే ఫెసిలిటీ ఇప్పుడు కూడా ఉంది. ఇందుకోసం, ఏటీఎం కేంద్రంలోని ‘క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్‌’ను (CDM) ఖాతాదార్లు ఉపయోగిస్తున్నారు. ఈ పని చేయాలంటే కచ్చితంగా డబ్బు తీసుకుని వెళ్లాలి, డెబిట్‌ కార్డ్‌ కూడా ఉండాలి. యూపీఐ ద్వారా డిపాజిట్‌ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తే.. డబ్బులు పట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉండదు, డెబిట్‌ కార్డ్‌తోనూ పని ఉండదు.

కొత్త వ్యవస్థ ఎలా పని చేస్తుంది?
UPI ద్వారా నగదు డిపాజిట్ చేసే ఈ విధానం ప్రస్తుతం కొనసాగుతున్న విత్‌డ్రా ప్రక్రియను పోలి ఉంటుంది. ప్రస్తుతం, డెబిట్‌ కార్డ్‌ లేకుండానే నగదు తీసుకోవాలనుకుంటే, ATMలో ‘UPI కార్డ్‌లెస్ క్యాష్‌ ఆప్షన్‌’ ఎంచుకోవాలి. ఆ తర్వాత, తీసుకోవాలనుకుంటున్న మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. స్కీన్‌ మీద కనిపించే QR కోడ్‌ను స్కాన్ చేసి, UPI పిన్‌ను ఎంటర్‌ చేస్తే డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. డబ్బులు డిపాజిట్ చేసే విధానం కూడా ఇదే విధంగా ఉంటుందని తెలుస్తోంది.

UPI ద్వారా నగదు డిపాజిట్‌కు అనుమతి
UPI ద్వారా నగదు డిపాజిట్లకు RBI ద్రవ్య విధాన కమిటీ (MPC) అనుమతి ఇచ్చిందని గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ‘క్యాష్‌ డిపాజిట్‌ మెషీన్‌’ల వల్ల బ్యాంకు ఉద్యోగుల పని, ఒత్తిడి తగ్గిందని దాస్‌ వివరించారు. బ్యాంకుల వద్ద పొడవైన క్యూలైన్‌లు కూడా తగ్గాయన్నారు. అందువల్లే UPI సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. 

థర్డ్‌ పార్టీ యాప్‌లకూ PPIల లింక్‌
థర్డ్ పార్టీ యూపీఐ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ వాలెట్లు, ప్రి-లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌ వంటి ‘ప్రి-పెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌’ను (PPIs) సైతం లింక్‌ చేసేందుకు అనుమతించాలని RBI నిర్ణయించింది. డిజిటల్‌ చెల్లింపుల్లో ఇది మరో పెద్ద అడుగు అవుతుంది, యూజర్ల పని మరింత ఈజీ అవుతుంది. ప్రస్తుతం, యూపీఐ చెల్లింపులు చేయడానికి బ్యాంకు ఖాతాను అదే బ్యాంక్‌ ఇచ్చే UPI యాప్ లేదా మరో థర్డ్‌ పార్టీ యాప్‌తో లింక్‌ చేస్తున్నారు. అలాగే, PPIలను సంబంధిత యాప్‌లతో అనుసంధానించి యూపీఐ ద్వారా పేమెంట్స్‌ చేస్తున్నారు. ఇకపై మధ్యలోని లింక్‌ను కట్‌ చేసి, థర్డ్‌ పార్టీ యాప్‌లకు సైతం PPIలను జత చేసే సౌకర్యం తీసుకువస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇది అమల్లోకి వస్తే, చిన్న లావాదేవీలకు కూడా డిజిటల్ చెల్లింపులు మరింత పెరుగుతాయి.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *