యూపీఐ పేమెంట్స్‌పై తియ్యటి కబురు, ఇప్పుడు రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు

[ad_1]

RBI Increases UPI Transaction Limit: దేశంలో యూపీఐ UPI వినియోగాన్ని ప్రోత్సహించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చాలా ప్రయత్నాలు చేస్తోంది. యూపీఐ లావాదేవీల (UPI transactions) సంఖ్య ప్రతి నెలా పెరుగుతూ ఉండటానికి ఇదే కారణం. ఆఫ్‌లైన్ లావాదేవీల కోసం, యూపీఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని కూడా తీసుకొచ్చింది. ద్రవ్య విధాన (Monetary Policy) నిర్ణయాల్లో భాగంగా.. ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో యూపీఐ లావాదేవీలకు సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది.

ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో ఎక్కువ మొత్తంలో UPI చెల్లింపులు ‍‌(UPI payments in Hospitals and Educational Institutions)
ఇది, దేశంలోని కోట్లాది మందికి ఉపయోగపడే నిర్ణయం. ఇకపై, UPI సాయంతో ఆసుపత్రులు, విద్యాసంస్థలలో చాలా ఎక్కువ మొత్తం చెల్లింపులు చేయవచ్చు. కొత్త పాలసీ డెసిషన్‌ ప్రకారం, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో ఒక్కో లావాదేవీలో యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించవచ్చు. ఇంతకుముందు ఈ మొత్తం రూ.లక్షగా ఉంది, ఈ పరిమితిని ఇప్పుడు ఏకంగా ఐదు రెట్లు పెంచారు. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ బిల్లులు, పాఠశాలలు & కాలేజీ ఫీజులు చెల్లించడంలో ఇకపై అసౌకర్యం తగ్గుతుంది. ఆయా సంస్థల్లో UPI వినియోగం పెరుగుతుంది.         

రికరింగ్‌ నేచర్‌ పేమెంట్స్‌ విషయంలోనూ ఉపశమనం
పునరావృతమయ్యే స్వభావం ఉన్న చెల్లింపుల (Payments with Recurring Nature) విషయంలోనూ ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. ఈ తరహా చెల్లింపుల ఇ-మాండేట్‌లో (e-mandate) మార్పులు చేయాలని మానిటరీ కమిటీ (RBI Monetary Committee) సిఫార్సు చేసింది. ఈ నిర్ణయం కింద, రికరింగ్‌ లావాదేవీల్లో UPI పరిమితిని, ఒక్కో లావాదేవీకి రూ. 1 లక్షకు పెంచుతారు. గతంలో ఈ లావాదేవీల సీలింగ్‌ రూ.15 వేలుగా ఉంది. కొత్త నిర్ణయం వల్ల, మ్యూచువల్ ఫండ్స్‌కు చెల్లింపులు, ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్స్‌, పునరావృతమయ్యే ఇతర సబ్‌స్క్రిప్షన్లకు చేసే చెల్లింపుల కోసం UPI పరిమితి పెరుగుతుంది.        

EMIలపై ఉపశమనం లేదు
రెపో రేటులో (Repo Rate) ఎలాంటి మార్పు చేయడం లేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ (RBI Governor Shaktikanta Das) చెప్పారు. దీంతో, రెపో రేట్‌ 6.50 శాతం వద్దే కొనసాగుతుంది. రిజర్వ్ బ్యాంక్ తన పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం ఇది వరుసగా ఐదోసారి. రెపో రేటును తథాతథంగా కొనసాగించడం వల్ల బ్యాంక్‌ రుణాలు, డిపాజిట్లపై వడ్డీ రేట్లు (bank rates) EMIల భారం పెరగవు, తగ్గవు.            

2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ‍‌( Inflation in India) 5.40 శాతంగా ఉంటుందని దాస్ అంచనా వేశారు. ఈ ఏడాది ఆగస్టులోనూ ఇదే అంచనా వేశారు, దానినే ఇప్పుడు కూడా కొనసాగించారు.              

మరో ఆసక్తికర కథనం: ధరలతో దబిడి దిబిడే – ఇంత పెద్ద విషయాన్ని ఆర్‌బీఐ ఎంత కూల్‌గా చెప్పిందో! 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *