4 ట్రిలియన్‌ డాలర్లకు ఇండియా జీడీపీ! ఈ న్యూస్‌ నిజమేనా?

Byprakshalana

Nov 20, 2023 , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


India GDP Crosses 4 Trillion dollar Milestone: భారత ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్లు (4 లక్షల కోట్ల డాలర్లు) దాటిందని చూపే ఒక స్క్రీన్‌ గ్రాబ్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్‌ అవుతోంది. ఇది నిజమే అయితే, భారతదేశం ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ‍‌(4 Trillion Dollar Economy) మారే లక్ష్యంలో ఇది చాలా కీలక మైలురాయి అవుతుంది.

2023 నవంబర్ 18వ తేదీ రాత్రి 10:30 గంటల సమయంలో భారతదేశం 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని సాధించిందని (India GDP Crosses 4 Trillion dollar Milestone) GDP లైవ్ డేటా చూపుతోంది. దీంతో, భారతదేశం ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి చాలా దగ్గరలో ఉంది. నాలుగో స్థానంలో ఉన్న జర్మనీకి-భారతదేశానికి మధ్య GDP వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది.

ప్రపంచంలో 5 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు (top five countries by GDP in 2023)
GDP ‍‌(Gross domestic product) పరంగా, అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. అమెరికా GDP ప్రస్తుత పరిమాణం 26.7 ట్రిలియన్‌ డాలర్లు. ఆ తర్వాత, మన పొరుగు దేశం చైనా సెకండ్‌ ప్లేస్‌లో ఉంది, దాని GDP 19.24 లక్షల కోట్ల డాలర్లు. 4.39 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో జపాన్ మూడో స్థానంలో ఉండగా, 4.28 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో జర్మనీ నాలుగో స్థానంలో ఉంది. భారతదేశం ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.

2027 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం (5 trillion dollar target by 2027)
దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భారత ప్రభుత్వం బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది. 2027 నాటికి, భారతదేశం జపాన్ & జర్మనీని దాటి ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే కాకుండా, భారతదేశ జీడీపీ పరిమాణం 5 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చాలా సార్లు చెప్పారు. ఆర్థిక అంచనాల విషయంలో ఆచితూచి స్పందించే అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కూడా ఇదే తరహా అంచనాలను ప్రకటించింది.

భారత్‌ ఇప్పుడు 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారిందని చెబుతూ, అదానీ గ్రూప్‌ ఓనర్‌ గౌతమ్‌ అదానీ (Goutam Adani), కొందరు కేంద్ర మంత్రులు ఆదివారం సోషల్‌ మీడియాలో ట్వీట్లు పెట్టారు. అయితే, భారతదేశ జీడీపీ నిజంగానే 4 లక్షల కోట్ల డాలర్లు దాటిందా అన్న అనుమానాలు మరోవైపు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, ఈ సమాచారాన్ని అధికారికంగా ప్రకటించలేదు. భారత ఆర్థిక శాఖ గానీ, నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ (NSO) గానీ ఈ వివరాలను వెల్లడించలేదు, ఈ వార్తలపై స్పందించలేదు. ఆర్థిక శాఖలోని కొందరు అధికారులు చెబుతున్న ప్రకారం… ఆ పోస్ట్‌లు అబద్ధం. అన్ని దేశాల జీడీపీ వివరాలను ఇలా ఒకే చోట లైవ్‌లో ట్రాక్‌ చేసే వ్యవస్థ అందుబాటులో లేదు. మన దేశం 4 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరడానికి ఇంకా చాలా దూరంలో ఉంది.

భారత వృద్ధి రేటు (India GDP growth rate)
గత ఏడాది ప్రారంభంలో, భారతదేశం బ్రిటన్ & ఫ్రాన్స్‌ను దాటి ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇతర దేశాలతో పోలిస్తే, మన దేశ వృద్ధి రేటు చాలా బాగుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు (GDP growth rate) 7.8 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం ‍‌(India GDP growth rate in 2022-23) చొప్పున వృద్ధి చెందింది.

మరో ఆసక్తికర కథనం: విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డ్‌, ఏవియేషన్‌ ఇండస్ట్రీని నిలబెట్టిన క్రికెట్‌

 Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *