[ad_1]
Adani Group:
ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొనేందుకు అదానీ గ్రూప్ అన్ని చర్యలూ తీసుకొంటోంది. కొన్నాళ్లుగా చెబుతున్నట్టుగానే కొన్ని రుణాలను ముందుగానే చెల్లించింది. తాజాగా షేర్లు తనఖా పెట్టి తెచ్చిన రూ.7,374 కోట్ల రుణాలను చెల్లించామని మంగళవారం ప్రకటించింది. 2025 వరకు గడువు ఉన్నా రుణ భారం తగ్గించుకుంటామని పేర్కొంది. ఇచ్చిన హామీ మేరకు ప్రమోటర్లు చెల్లింపులు చేసినట్లు పేర్కొంది. చెల్లింపులు అందుకున్న వాటిలో పలు అంతర్జాతీయ బ్యాంకులు, దేశీయ ఆర్థిక సంస్థలు ఉన్నట్లు వెల్లడించింది. ఫలితంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు చెందిన 155 మిలియన్ల షేర్లు, అదానీ ఎంటర్ప్రైజ్వి 31 మిలియన్ల షేర్లు, అదానీ ట్రాన్స్మిషన్వి 36 మిలియన్ల షేర్లు, అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన 11 మిలియన్ షేర్లు బ్యాంకుల నుంచి బయటకు రానున్నాయి.
బుధవారం నుంచి ఆంక్షలు లేని ట్రేడింగ్
అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను, దాదాపు నెల రోజుల తర్వాత, స్వల్పకాలిక అదనపు నిఘా ఫ్రేమ్‌వర్క్ నుంచి ఎన్ఎస్ఈ మినహాయిస్తోంది. ఈ కౌంటర్‌ను బుధవారం (08 మార్చి 2023) నుంచి ASM ఫ్రేమ్‌వర్క్ నుంచి బయటకు వస్తుంది.
స్టాక్స్‌లో అధిక అస్థిరత ఉన్న సందర్భాల్లో, ఎక్స్ఛేంజీలు షార్ట్ సెల్లింగ్ లేదా స్పెక్యులేటివ్ ట్రేడ్ల నుంచి పెట్టుబడిదారులను రక్షించడానికి స్టాక్లను స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక అదనపు నిఘా ఫ్రేమ్‌వర్క్ కిందకు తరలిస్తాయి.
రెండు వైపులా పదునున్న కత్తి
ASM ఫ్రేమ్‌వర్క్ నుంచి బయటకు రావడం అంటే, స్టాక్ ఎక్సేంజీ రక్షణ కవచం నుంచి బయటకు వచ్చినట్లే. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఒక విధంగా ఉపయోగం, మరొక విధంగా నష్టం ఉంటుంది.
అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్‌లో బుధవారం నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఆ రోజు నుంచి ట్రేడర్లు 100% మార్జిన్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఈ స్టాక్‌లో లావాదేవీలు పెరుగుతాయి, అదే సమయంలో తీవ్ర అస్థిరతను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది.
అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా, 2023 జనవరి 24న USకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) విడుదల చేసిన వివాదాస్పద నివేదిక అదానీ స్టాక్స్‌లో భారీ రక్తపాతాన్ని సృష్టించింది. అదానీ గ్రూప్ పెట్టుబడిదార్లు సహా మొత్తం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను ఒక నెలకు పైగా బాధ పెట్టింది. ఈ నెల రోజుల్లో అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ స్టాక్స్ ఉమ్మడి మార్కెట్ విలువ 50% పైగా తగ్గింది.
లైఫ్ లైన్ అందించిన GQG పార్ట్నర్స్
ఒక నెలకు పైగా సాగిన కఠిన అమ్మకాల తర్వాత… అదానీ గ్రూప్ స్టాక్స్‌కు గత వారం కొంత ఉపశమనం లభించింది. గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ GQG పార్ట్నర్స్ అదానీ గ్రూప్ స్టాక్స్‌పై రూ. 15,000 కోట్ల పందెం కాసింది. ఇది అదానీ గ్రూప్ పిక్చర్‌ను పూర్తి మార్చేసింది, గౌతమ్ అదానీకి లైఫ్ లైన్ అందించింది.
GQG పార్టనర్స్.. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 3.4%, అదానీ పోర్ట్స్‌లో 4.1%, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.5%, అదానీ గ్రీన్ ఎనర్జీలో 3.5% వాటాలను కొనుగోలు చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply