దెయ్యాలు
ఈ పీడ కలలకు మనం నిజ జీవితంలో చూసినవై ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలకు సంబంధించిన సినిమాలు చూసినప్పుడు అందులోని కొన్ని దృశ్యాలు మన మెదడులో రికార్డవుతాయి. మనం నిద్రిస్తున్నప్పుడు అవి రివైన్ అవుతాయి. అయితే ఆ దృశ్యాల్లో మనం కూడా ఉన్నట్లు కలలు వస్తాయి. దీంతో మనం భయాందోళనకు గురవుతాం. అందుకే మనం కొన్ని భయంకరమైన సినిమాలు చూడకపోవడమే మంచిది. ఒకవేళ చూసినా.. దృశ్యాలను సినిమా హాల్లోనే వదిలేయడం మంచిదని చెబుతున్నారు.

దేవుడికి మొక్కడం
అయితే పీడ కలలు రాకుండా ఉండాలంటే నిద్రించే ముందు దేవుడికి మొక్కడం, లేదా ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినడం లాంటివి చేస్తే ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం ఉంటుంది. అయినే కూడా పదే పదే పీడ కలలు వస్తుంటే.. నివారణ పూజలు చేయడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలా మందికి ఎవరో వెంటాడుతున్నట్లు, పక్షవాతం సోకినట్లు, దెయ్యాలు మీదపడి హింసిస్తున్నట్లు, ఆత్మీయుల్లో ఎవరో చనిపోయినట్లు, జట్టు, పళ్లు రాలిపోవడం, మరణించినట్లు, పాము కాటేసినట్లు కలలు వస్తాయి.

పాము కనిపిస్తే
ఇలాంటి కలలకు వస్తే చెడుకు సంకేతమని చెబుతున్నారు. భవిష్యత్ లో చెడు జరిగే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. కొన్న మంచి కలలు కూడా వస్తాయి. కలలో తెల్ల రంగు పాము కనిపిస్తే మీరు త్వరలో ఓ గొప్ప ఘనత సాధించబోతున్నారని సంకేతమట. నెమలి నృత్యం చేస్తున్నట్లు మీకు కల వస్తే త్వరలోనే ఓ శుభవార్త వినే అవకాశం ఉందట. కలలో నూనె ఒలికిపోయినట్టు కనిపిస్తే కీడు జరిగే అవకాశం ఉంటుందట.