Diabetes: ఈ ఆధునిక జీవనశైలిలో మార్పులు, చెడు ఆహార అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా చాలా మంది డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వయస్సు మీద పడినవారే కాదు.. యువత కూడా దీని బారిన పడుతున్నారు. డయాబెటిస్ ఒకసారి వస్తే దీన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం తప్పించి.. పూర్తిగా నయం చేయలేం. డయాబెటిస్ కారణంగా.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ ఉండవు. దీర్ఘకాలం పాటు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోకపోతే.. కిడ్నీ, గుండె, ఊపిరితుత్తులు, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని సంద్భార్లో మెడికేషన్ తీసుకున్నా, క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా, హెల్తీ డైట్ తీసుకున్నా.. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయినా.. బ్లడ్ షుగర్ లెవల్స్ ఎందుకు పెరుగుతాయో డాక్టర్ అభిజీత్ మనకు వివరించారు. (Dr. Abhijeet Bhograj, Consultant Diabetes and Endocrinology at Manipal Hospital, Bangalore)
మెడిసిన్ ప్రభావం తగ్గితే..
దీర్ఘకాలం పాటు ఒక వ్యక్తి బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే.. అతను తీసుకునే మందులు మునుపటి ప్రభావాన్ని చూపించలేవని డాక్టర్ అన్నారు.
కరెక్ట్ డోస్ తీసుకోకపోతే..
శరీరం ఇన్సులిన్, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రతిస్పందించలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏమిటంటే, చాలా మంది రోగుల రక్తంలో చక్కెర స్థాయి కొన్ని కారణాల వల్ల చాలా కాలం పాటు నియంత్రణలో ఉండదు. ఇది సాధారణంగా కరెక్ట్ డోస్ మందులు తీసుకోకపోవడం, ఇన్సులిన్ నిరోధకత , గ్లూకోటాక్సిసిటీ వంటి సమస్యల కారణంగా ఎదురవుతుంది.
ఇన్ఫెక్షన్స్..
ఒక వ్యక్తి ఇన్ఫెక్షన్‌కు గురైతే.. ఆతని శరీరం చికిత్సకు ప్రతిస్పందించదు. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉండవు.
ఏమి చేయాలి..?
ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు చేయవలసిన పని ఏమిటంటే..వేర్వేరు సమయ వ్యవధిలో (భోజనానికి ముందు ,తరువాత, రాత్రి భోజనానికి ముందు, తరువాత, బ్రేకఫాస్ట్‌కు ముందు, తర్వాత) నిద్రపోండి. లేచిన ప్రతిసారి బ్లడ్ షుగర్ లెవల్స్ చెక్ చేసుకోండి. తదనుగుణంగా మోతాదును సెట్ చేయండి
వ్యాయామం చేయండి..

మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే, వ్యాయామం చేయడం మానవద్దు. వ్యాయామం శరీరం ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది, గ్లైసెమిక్ నియంత్రణలో సహాయపడుతుంది.
ఇన్సులిన్ మెరుగ్గా పనిచేసేలా చేయడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి యాంటీ-డయాబెటిక్ ఔషధాలను కూడా ఉపయోగించవచ్చు, దీని కోసం డాక్టర్‌తో మాట్లాడండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.